బీజేపీలో ముదిరిన వివాదం.. !!

BJP President Controversy: సిద్దిపేట బీజేపీలో మళ్లీ ముసలం మొదలైంది
సిద్దిపేట జిల్లా బిజెపి అధ్యక్ష పదవి కి పలువురు నాయకులు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. పార్టీని అంటిపెట్టుకొని కష్టపడ్డ నాయకులకు అధ్యక్ష పదవి ఇవ్వలేదని క్రియాశీలక సభ్యత్వం కలిగి ఉండాలన్న నిబంధనను పరిగణలో తీసుకోలేదని ఆశావాహులు సామాజిక మాధ్యమాల్లో తమ నిరసనను వ్యక్తం చేశారు జిల్లా అధ్యక్ష పదవికి దుబ్బాకకు చెందిన బాలేష్ గౌడ్ గజ్వేల్ చెందిన నలువల శ్రీనివాస్ దారం గురువారెడ్డి సిద్దిపేటకు చెందిన మోహన్ రెడ్డి బైరి శంకర్ నామినేషన్ దాఖలు చేశారు కానీ రాష్ట్ర బీజేపీ నాయకత్వం పార్టీని అంటిపెట్టుకొని పార్టీ కోసం పనిచేసిన నాయకులను కాదని టిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన బైరి శంకర్ను ఎలా నియమిస్తారని సీనియర్ నాయకులు కార్యకర్తలు బాహాటంగా తమ నిరసనలు తెలిపారు

సిద్ధి పేటజిల్లా పార్టీ అధ్యక్షుడి ఎంపికపై మూడు నెలల కిందట మొదలైన అసంతృప్తి సెగలు మరింత పెరిగాయి. జిల్లా కమిటీ నియామకంలో రాష్ట్ర బాధ్యులు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ పార్టీ శ్రేణులు నిరసన తెలిపాయి. జిల్లా నుంచి సుమారు 150 మంది పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ నాంప ల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆందోళ నకు కూడా చేశారు జిల్లా అధ్యక్షుడుగా బైర్ శంకర్ ముదిరాజ్ ను నియామకాన్ని వ్యతిరేకించిన జిల్లా ముఖ్యనాయకులు అతన్ని మార్చాలంటూ అప్పట్లోనే నిరసన తెలిపారు. పార్టీ సీనియర్లనుకాదని బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన వ్యక్తికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఎలా ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకర్ ముదిరాజ్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ మూడు నెలల కిందట భారీ సంఖ్యలో కార్యకర్తలు రాష్ట్ర కార్యాలయంలో నిరసన తెలిపారు. తక్షణమే నియామకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

స్పందించిన పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ చంద్రశేఖర్ తివారి వారిని సముదాయించారు. సిద్దిపేట జిల్లా అధ్యక్షుని ఎన్నికపై కేంద్ర కమిటీకి నివేదించి వారి సూచన మేరకు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతవరకు జిల్లా కార్యవర్గ నియామకం జరపవద్దని శంకర్ ముదిరాజ్ కు సూచించారు. కేంద్ర కమిటీ ఆదేశాలు వచ్చే వరకు సిద్ధిపేట జిల్లాలో మరో ఇద్దరు బాధ్యులను నియమించి కార్యకలాపాలు నిర్వహిస్తామని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. దాంతో ఆగ్రహం వీడి చల్లబడ్డ జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతు న్నారు. చంద్రశేఖర్ తివారి హామీ ఇచ్చి ఆరు నెలలు గడిచిన ఏలాంటి కదలిక లేకపోవడంతో భారీ సంఖ్యలో కార్యకర్తలు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తక్షణమే జిల్లా పార్టీ అధ్యక్షున్ని తొలిగించాలని ఉమాండ్ చేశారు. లేనిపక్షంలో త్రీ మెన్ కమిటీ నియమించాలని కోరారు. దాదాపు రెండుగంటలపాటు ఆందోళన దిగడంతో పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి చంద్రశే ఖర్ మరోసారి వారితో చర్యలు చేపట్టారు. బైది శం కర్ నియానుకం పై కేంద్రకమిటీకి నివేదించామని త్వరలోనే ఒక తీర్పు వస్తుందని చెప్పారు. ఈలోపు త్రీ మెన్ కమిటీని నియమించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాడు. త్రిమన్ కమిటీ నియమిస్తారా అధ్యక్ష పదవి నుంచి బయటి శంకర్ తప్పిస్తారా మరెవరినైనా నియమించి గొడవ సద్దుమణిగిస్తారా అని వేచి చూస్తున్న తరుణంలో నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా కొత్తగా మరొక తలనొప్పి వచ్చిందని చెప్పవచ్చు. BJP President Controversy.

జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉంటూనే వేరే పార్టీ నేత సూచించిన వారిని గెలిపించుకోవాల్సిన అవశ్యకత ఉందని ఇతరులతో చర్చించిన ఆడియో కాల్ సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపుతుంది. ఒక పార్టీలో ఉండి వేరే పార్టీ వారికి ఎలా గెలిపించాలని ఎలా సూచిస్తారని బిజెపి కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. కుల బంధం పై ప్రేమతో పార్టీకి వెన్నుపోటు పొడిచేలా బిజెపి అధ్యక్షుడు వ్యవహారం ఉందని నాయకులు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు