
Heavy Rains in Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపుర్, రాయదుర్గం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, ఎస్సార్ నగర్, ఎర్రగడ్డ, అమీర్‌పేట్, పంజాగుట్ట, బోరబండ, యూసఫ్ గూడా, దుండిగల్, గండిమైసమ్మ, మల్లంపేట, బహదూర్‌పల్లి, సూరారం, కొంపల్లి, సుచిత్ర, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, బాలానగర్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, జవహర్ నగర్, బొల్లారం, ప్యాట్నీ, పారడైజ్, చిలకలగూడ, మారేడుపల్లి, కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, నాంపల్లి, బషీర్ బాగ్, హిమాయత్ నగర్, నారాయణ గూడ, ట్యాంక్ బండ్, సైదాబాద్, చంపాపేట్, సరూర్ నగర్, సంతోష్ నగర్, లంగర్ హౌస్, గుడిమల్కాపూర్, గోల్కొండ, జియాగూడ, మెహదీపట్నం, ఆసిఫ్ నగర్, పాతబస్తీ, చార్మినార్, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, బార్కస్, ఉప్పుగూడ, ఛత్రినాక ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో నగరవాసులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో బుధ, గురువారాల్లో ఒంటిపూట బడులు నడపాలని ఆదేశించారు. పిల్లల్ని మధ్యాహ్నం ఇంటికి పంపించేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఐటీ ఉద్యోగులు, ఇతర సిబ్బందికి బుధవారం ఇంటి నుంచి పని చేసే అవకాశం ఇవ్వాలని ఆదేశిస్తూ ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కుండపోత వానలతో నగరంలోని రోడ్లు జలమయమై, ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందనే అంచనాలతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. Heavy Rains in Hyderabad.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. వాగులు, చెరువులు, నదుల దగ్గరికి వెళ్లకూడదని, ముఖ్యంగా రాత్రి సమయంలో బయటికి రావద్దంటూ సూచించారు. తడిసిన గోడల వద్ద, పాత ఇళ్లలో కాకుండా సురక్షితమైన ప్రదేశాలలో ఉండాలన్నారు. సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులకు అవసరమైన సూచనలు ఇచ్చారని తెలిపారు. ఇక ములుగు జిల్లా పరిసరాల్లో గోదావరి, వాగులు వంకలు పొంగిపొర్లే అవకాశం ఉందని చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు బయటికి వెళ్లకుండా కుటుంబ సభ్యులతోనే ఉండాలన్నారు.