
Krishna Mohan reddy: ఉమ్మడి పాలమూరు జిల్లాలో శాసనసభ్యులు కొందరు ఏ పార్టీలో కొనసాగుతున్నారో.. కూడా ప్రజలకు తెలియని పరిస్థితిలో ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. గెలుపొందిన పార్టీలో కాకుండా మరో పార్టీలో ప్రస్తుతం కొనసాగుతుండటంతో ఏ పార్టీలో ఉన్నారో కూడా ఆ నియోజకవర్గ ప్రజలకు తెలియలేని పరిస్థితిలో ఆ ఎమ్మెల్యే కొనసాగుతున్నారు. తనకు అవసరం ఉన్న సమయంలో గెలుపొందిన పార్టీని వాడుకోవడం లేనియెడల అభివృద్ధి పేరిట మరో పార్టీలో ఉన్నట్లు నటించడం కొనసాగుతుంది. ఇది ఎక్కడో తెలుసుకోవాలని ఉందా… నడిగడ్డ ప్రాంతమైన జేజమ్మ సొంత జిల్లా అయిన గద్వాల నియోజవర్గంలో అవసరానికి దోబూచులాట కొనసాగుతుంది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలలో 12 నియోజకవర్గాలు కాంగ్రెస్ గెలుపు పొందగా రెండు నియోజకవర్గాలు మాత్రమే టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. అల్లంపూర్, గద్వాల ఈ నియోజకవర్గాలలో అలంపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడు గెలుపొందగా, గద్వాల నియోజకవర్గంలో భరత్ సింహారెడ్డి మేనల్లుడు, జేజమ్మ ఇలాఖాలో బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గెలుపొందారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఇలాఖాలో అభివృద్ధి పనులకు ఆటంకం ఉండదనే ఆలోచనతో ముందుగా పసిగట్టిన కృష్ణమోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి సమక్షంలో జాతీయ జెండా అని అనుకుంటున్నా ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పడం జరిగింది.
ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో కలవడంపై తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల కేసును పదిమంది శాసనసభ్యులపై కోర్టును ఆశ్రయించడంతో బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో సక్సెస్ అయిందని చెప్పవచ్చు…
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గద్వాల శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విషయానికొస్తే నియోజవర్గ అభివృద్ధి విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిశానని చెప్పుకొస్తూనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తన ఫోటోలు బ్యానర్లో ముద్రించడంపై పోలీస్ స్టేషన్లో టిఆర్ఎస్ గద్వాల్ ఎమ్మెల్యేగా ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిని ఆసరాగా చేసుకొని పార్టీ మారలేదంటూ ఎఫ్ ఐ ఆర్ కాపీని స్పీకర్కు పంపించడం జరిగింది. Krishna Mohan reddy.
ఈనెల తొమ్మిదో తేదీ ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కుశ మోహన్ రెడ్డి… శ్రీ లింగం, పురుష లింగమ అన్నట్టు ఎటకారంగా కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి మాట్లాడడం జరిగింది. టిపీసీసీ చీఫ్ తన ప్రసంగంలోనే పదిమంది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పేర్కొనడం జరిగిందని, ఇదే విషయాన్ని న్యాయస్థానం ముందు పెడతానంటూ కేటీఆర్ అనడంతో తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈనెల 13వ తేదీ గద్వాల కేంద్రంగా కేటీఆర్ సమక్షంలో వివిధ పార్టీల నుంచి చేరే కార్యకర్తలు అదేవిధంగా భారీ బహిరంగ సభ ఉండడంతో సభా వేదికపై కృష్ణమోహన్ రెడ్డికి ఆహ్వానం లేదనే విధంగా కేటీఆర్ మాట్లాడడం జరిగింది.