ఓల్డ్ సిటీకి మెట్రో… ఆ మార్గాల్లో పరుగులు!

Hyderabad Old City Metro: హైదరాబాద్ వాసులకు మరో గుడ్ న్యూస్ . దశాబ్దానికి పైగా కొనసాగుతున్న పాతబస్తీ మెట్రో కల ఇప్పుడు నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి. హైదరాబాద్లో ట్రాఫిక్ కు చెక్ పెట్టేలా హైదరాబాద్ ఓల్డ్ సిటీ మెట్రో రైల్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి సన్నాహక పనులు కీలక దశకు చేరుకుంటున్నాయి. ఇక ఈ విషయాన్ని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎన్ వి ఎస్ రెడ్డి పేర్కొన్నారు.

పాతబస్తీ మెట్రో రైలు పనుల పురోగతి మాస్టర్ ప్లాన్ ప్రకారం 100అడుగులకు రోడ్డు విస్తరణ జరుగుతోందని, ఇందులో భాగంగా ప్రభావిత ఆస్తుల కూల్చివేత కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. మెట్రో రైలు పనులు శరవేగంగా ప్రారంభించడానికి కావలసిన రైట్ ఆఫ్ వే ప్రక్రియ పురోగతిలో ఉందని ఆయన వెల్లడించారు.మెట్రో స్తంభాల నిర్మాణానికి అవసరమైన స్థలంతో పాటుగా ఇరువైపులా రెండు లైన్ల రోడ్ విస్తరణకు కొంత ప్రాంతాన్ని కేటాయించారు. ఈ ప్రాంతాన్ని రైట్ ఆఫ్ వే అంటారు.

పనుల్లో ఎటువంటి లోపాలు లేకుండా, డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (DGPS) ద్వారా సర్వేలు నిర్వహిస్తున్నారు. దీనికి డ్రోన్ సర్వేల డేటాను కూడా అనుసంధానం చేస్తున్నారు. 7.5 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి, నిర్దేశిత ప్రదేశాలను గుర్తించడానికి హై ప్రెసిషన్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ రిసీవర్లను ఉపయోగిస్తున్నారు. పాతబస్తీ మార్గం చాలా పురాతనమైనది కావడంతో రహదారి కింద తాగునీటి, మురుగునీరు, వరదనీరు పైపులతో పాటు విద్యుత్, టెలికాం లైన్లు ఉన్నాయి. వీటిని గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (GPR) సర్వే ద్వారా గుర్తిస్తున్నారు.

మెట్రో స్తంభాలు వేసే ప్రదేశాల్లో ఈ యుటిలిటీలను మరోచోటుకు మార్చడం అత్యంత ముఖ్యమైన పని అని ఎన్వీఎస్ రెడ్డి వివరించారు. మెట్రో అలైన్‌మెంట్‌లో ఉన్న పురాతన, సున్నితమైన కట్టడాలకు ఎటువంటి నష్టం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. వాటిని పరిరక్షించడానికి ప్రత్యేక ఇంజనీరింగ్ పరిష్కారాలను రూపొందిస్తున్నారు. భారీ మెట్రో స్తంభాలను నిలబెట్టడానికి భూమి సామర్థ్యాన్ని పరీక్షించడానికి మట్టి పరీక్షలు చేస్తున్నారు. ఈ పనులన్నీ పూర్తయిన తర్వాత మెట్రో మార్గం నిర్మాణం వేగంగా ముందుకు సాగుతుందని అధికారులు తెలియజేశారు. ఈ ప్రాజెక్ట్ పాతబస్తీ ప్రజల రవాణా అవసరాలను తీర్చడమే కాకుండా ఆ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదపడుతుందని ఆశిస్తున్నారు.

గతంలో అలైన్మెంట్ వివాదాల కారణంగా నిలిచిన ప్రాజెక్టు గతంలో ఎంజీబీఎస్ నుండి ఫలక్ నుమా వరకు అలైన్మెంట్ వివాదాల కారణంగా ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది .అయితే ప్రస్తుతం పనులలో వేగం పుంజుకోవడంతో రెండు సంవత్సరాలలో పాతబస్తీ ప్రాంతంలో మెట్రో రైళ్ళు తిరుగుతాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ప్రతిపాదన ప్రకారం ఎంజీబీఎస్ నుండి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో విస్తరణ జరుగుతుంది.

ప్రస్తుతం ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్- ఎంజీబీఎస్, రాయదుర్గం- నాగోల్ కారిడార్‌లో మెట్రో పరుగులు పెడుతుండగా.. ఎంజీబీఎస్ మెట్రోకు కొనసాగింపుగా.. చంద్రాయణ గుట్ట వరకు పాతబస్తీ మెట్రోను పొడిగిస్తున్నారు. Hyderabad Old City Metro.

మెట్రో పనులకు ఈ ఇబ్బందులు ప్రస్తుతం మెట్రో స్తంభాలు, స్టేషన్ల నిర్మాణానికి సంబంధించి సన్నాహక పనులను వేగవంతం చేస్తున్నారు. ఈ పాతబస్తీ మార్గం చాలా పురాతనమైనది కావడంతో రోడ్డు కింద భాగంలో మురుగునీరు, తాగునీరు, వరదనీటి పైప్లైన్లు, టెలికాం, విద్యుత్ లైన్లు వంటివి ఉన్నాయి. వీటిని గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ సర్వే ద్వారా గుర్తిస్తున్నారు. మెట్రో స్తంభాలు వచ్చే ప్రదేశంలో భూగర్భంలో ఉన్న వాటిని వేరే చోటికి మార్చడం చాలా ముఖ్యమైన పని అని చెబుతున్నారు. కొనసాగుతున్న నిర్మాణాల కూల్చివేత పనులు ఇక పాత బస్తి మెట్రో కారిడార్ 7.5 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉందని ఇక్కడ దాదాపు ఈ ప్రాజెక్టు వల్ల 1100 ఆస్తులు ప్రభావితం అవుతున్నాయని చెబుతున్నారు. అయితే ఇప్పటికే 550 నిర్మాణాలను కూల్చి వేయగా, ప్రభావిత ఆస్తుల యజమానులకు 443 కోట్ల రూపాయలను పరిహారంగా ఇచ్చారు. ప్రతి 100 మీటర్లకు ఒక మైలురాయిని ఏర్పాటు చేస్తున్నారు.

పాతబస్తీ మెట్రో రైల్ కారిడార్ పనులలో కీలక అడుగులు పాతబస్తీలో మిగిలిన మార్గాన్ని రెండవ దశలో చేర్చి అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. ప్రస్తుతం ఇది పరిశీలనలో ఉంది. ఏది ఏమైనా రకరకాల సమస్యలను అధిగమించి పాతబస్తీ మెట్రో కారిడార్ పనులలో కీలక అడుగులు పడుతున్నాయి.