
Congress Party MLA’s: పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు రాజీనామాలకు సిద్ధపడినట్లుగా జోరుగా చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బాన్సవాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిలు ఆ తర్వాత పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుకున్న విషయం తెలిసిందే. వీరితో పాటు అరికపూడి గాంధీ, కాలె యాదయ్య, బండ్ల క్రిష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, ప్రకాశ్‌గౌడ్‌లు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు.
రాష్ట్రంలో పరిపాలన కంటే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొదట్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న తర్వాత అది సైలెంట్ అయ్యింది. బీఆర్ఎన్ నుంచి 2/3 వంతు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే వారిపై అనర్హత వేటు ఉండదు. వారిని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలని ప్లాన్ చేసినా..కేసీఆర్ ఎత్తుల ముందు రేవంత్ రెడ్డి ప్లాన్ వర్కౌట్ కాలేదు. పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ కోర్టుకెక్కింది.
తాజాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం కొంతకాలంలో కోర్టులో నానుతోంది. తాజాగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోకా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. స్పీకర్ వేటు వేయకుండానే తాము ముందుగా రాజీనామా చేయాలని ఆ ఎమ్మెల్యేలు యోచిస్తున్నట్లు సమాచారం.
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ పంచకు చేరిన ఆ నలుగురు ఎమ్మెల్యేలకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు రాజీనామా చేసే ఛాన్స్ ఉందని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఎందుకంటే అనర్హత వేటుకు ముందు రాజీనామా చేసేందుకు ఆ నలుగురు ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారని సోషల్ మీడియాలో కోడై కూస్తోంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ నలుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ వేటు వేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే స్పీకర్ వేటు వేయకుండానే తామే ముందుగా రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ వీళ్లు రాజీనామా చేస్తే జూబ్లీహిల్స్ ఉపఎన్నికతోపాటు మరో నాలుగు ప్రాంతాల్లో ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత వీళ్లు రాజీనామా చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
స్పీకర్ నోటీసులతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏం చేస్తారన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. స్పీకర్ నోటీసులు జారీ చేశారన్న విషయం తెలియగానే.. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి స్పందించారు. తాను పార్టీ మారలేదని, టెక్నికల్‌గా బీఆర్ఎస్లోనే ఉన్నానని స్పష్టం చేశారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని తెలిపారు. ఇప్పటికీ తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నానని క్లారిటీ ఇచ్చారు. ఇక మిగతా ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయడం లేదు. ఆచితూచి వ్యవహరించాలనే యోచనలోనే ఉండటం గమనార్హం. న్యాయ నిపుణులతో మాట్లాడిన తర్వాత…నోటీసులపై స్పందించాలని ప్రస్తుతానికి మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. Congress Party MLA’s.
స్పీకర్ నోటీసుల జారీ నేపథ్యంలో ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేస్తారన్న చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. పార్టీ కండువా కప్పుకోవడంతో పాటు కాంగ్రెస్ స్టాండ్ తీసుకుని క్లియర్ డైరెక్షన్లో ఉండటంతోవీరిపై స్పీకర్‌కు చర్యలు తీసుకోక తప్పనిసరి పరిస్థితులు నెలకొనిఉన్నాయన్న అభిప్రాయం, విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలోనే ఈ నలుగురు ఎమ్మెల్యేలు గౌరవప్రదంగా రాజీనామాలు చేసే ఆలోచనతో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కొంత కాలం వరకు వెయిట్ చేయాల్సిందే మరీ.