టిక్‌టాక్‌ రీ ఎంట్రీ.?

Central Government on Tiktok: ఒకప్పుడు టిక్‌టాక్‌ యాప్‌ భారత్‌లో ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. చాలామంది ఈ యాప్‌కు అడిక్ట్ అయిపోయారు. కొందరు రీల్స్‌ మోజులో పడి ప్రమాదకర స్టంట్లు చేసి ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఇక 2020లో గాల్వన్‌ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఉద్రిక్తలు చెలరేగాయి. దీంతో భద్రతపరమైన కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్‌ యాప్‌ను బ్యాన్ చేసింది. దీంతో పాటు చైనాకు చెందిన అనేక యాప్‌లపై నిషేధం విధించింది. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. అయితే అమెరికా టారిఫ్‌ల తర్వాత భారత్, చైనా మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టిక్‌టాక్‌ యాప్‌ సేవలు మళ్లీ భారత్‌లోకి రానున్నాయని ప్రచారం నడుస్తోంది.

చిన్న వీడియో యాప్ TikTok భారతదేశంలోకి తిరిగి వస్తోందా? ఒకప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన TikTok దాదాపు 5 సంవత్సరాల తర్వాత భారతదేశంలోకి తిరిగి రావచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి. వాస్తవానికి భారతదేశంలోని చాలా మంది వినియోగదారులకు TikTok వెబ్‌సైట్ అందుబాటులో ఉంది. అయితే, వెబ్‌సైట్‌ను అన్‌బ్లాక్ చేయడానికి అధికారికంగా ఎటువంటి నోటీసు జారీ చేయలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక ఈ విషయంపై కంపెనీ కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

సోషల్ మీడియాలో కొంతమంది వినియోగదారులు TikTok వెబ్‌సైట్ అందుబాటులో ఉందని చెప్పారు, మరికొందరు దానిని యాక్సెస్ చేయలేకపోతున్నామని అంటున్నారు. చాలా మంది వినియోగదారులు వెబ్‌సైట్ హోమ్ పేజీని దాటి వెళ్లలేదని చెప్పారు. అదే సమయంలో, TikTok యాప్ ఇంకా Google Play Store లేదా Apple App Storeలో అందుబాటులో లేదు. వెబ్‌సైట్ యాక్సెస్ అయిన తర్వాత, ఈ చైనీస్ యాప్ మళ్లీ భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందా అనే ప్రశ్న ప్రజల మనస్సుల్లోకి వచ్చింది. Central Government on Tiktok.

దీనిపై తాజాగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. భారత్‌లోకి మళ్లీ టిక్‌టాక్ వస్తుందన్న ప్రచారాన్ని ఖండించాయి. ఆ వార్తల్లో నిజం లేదని తేల్చిచెప్పాయి. టిక్‌టాప్‌పై దేశంలో ఇంకా నిషేధం కొనసాగుతోందని పేర్కొన్నాయి. టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం దీనిపై జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ అని స్పష్టం చేశాయి. టిక్‌టాక్‌ వెబ్‌సైట్‌ను కూడా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు బ్లాక్‌లిస్టులో ఉంచాయని చెప్పాయి. కానీ కొందరు యూజర్లకు అది ఎలా అందుబాటులకి వచ్చిందో అనేదానిపై క్లారిటీ లేదని వెల్లడించాయి.