
WhatsApp web: ప్రజెంట్ సిచ్చువేషన్ లో వాట్స్ అప్ వెబ్ ను బాగానే వినియోగిస్తుంటారు. ఆఫీస్ లోనూ, కంప్యూటర్స్ లో లాప్ టాప్ లో వాట్స్ అప్ లాగిన్ అయి వాడుతున్నారు. ఇలా చేయడం మానుకోవాలని కేంద్రం హెచ్చరిస్తుంది. చిన్న అలవాటే కదా అని లైట్ తీసుకుంటే డేంజర్ లో పడతారు. తీవ్ర పరిణామాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. వాట్స్ అప్ వెబ్ ను ఉపయోగిస్తే ప్రభుత్వం ఎందుకు హెచ్చరిస్తుంది. దీని వలన ఎలాంటి ముప్పు వాటిల్లుతుందో తెలుసు కోవాలంటే….
వాట్స్ అప్ మన జీవితాలలో ఒక భాగంగా మారిపోయింది. ఈ మెసేజ్ ఆప్ ను ప్రతిఒక్కరు వాడుతున్నారు. అందుకే యావత్ ప్రపంచంలోనే యూజర్ల పరంగా చూస్తే వాట్స్ అప్ అతి పెద్ద మెసేజింగ్ ఆప్ గా అవతరించింది. ఇది ఇలా ఉంచితే పనుల కోసమో, సౌలభ్యం కోసమో చాలా మంది ఎంప్లాయిస్ వాట్స్ అప్ వెబ్ ను ఆఫీస్ డెస్క్ టాప్ లేదా ల్యాప్ టాప్ లో వాడుతూ ఉంటారు. అయితే ఈ విధంగా చేయడం సరైనది కాదని కేంద్ర ప్రభుత్వం సూచించింది. వీలైనంత వరకు తమ కార్యాలయాలో
వాట్సాప్ అనేది విస్తృతంగా ఉపయోగించే కమ్యూనికేషన్ యాప్‌లలో ఒకటి. వాట్సాప్ వెబ్ రాకతో దీనిని వ్యాపార రంగంలో కూడా చురుకుగా ఉపయోగిస్తున్నారు. అయితే, వాట్సాప్ వెబ్‌ను ఉపయోగించే వారికి కేంద్ర ప్రభుత్వం కొన్ని భద్రతా హెచ్చరికలు జారీ చేసింది.
ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రకారం.. WhatsApp వెబ్ డేటా లీకేజీకి గురయ్యే అవకాశం ఉంది. కార్పొరేట్ పరికరాల్లో WhatsApp వెబ్‌ను ఉపయోగించడం వల్ల వ్యక్తిగత సమాచారం మాత్రమే కాకుండా ముఖ్యమైన కంపెనీ సమాచారం కూడా లీక్ అయ్యే అవకాశం ఉంది. స్క్రీన్ మానిటరింగ్, మాల్వేర్, బ్రౌజర్ హైజాకింగ్ వంటి భద్రతా బెదిరింపులు WhatsApp వెబ్ వినియోగదారులకు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు ఆఫీస్ వై-ఫై ఉపయోగించినప్పుడు మీ కంపెనీ మీ వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేయగలదు. అదనంగా వాట్సాప్ వెబ్‌ను ఉపయోగించే పరికరాలు పోయినట్లయితే పెద్ద డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉంది.
ఇక ఇదే జరిగితే మొత్తం నెట్ వర్స్ సైబర్ నేరస్తుల చేతిలోకి వెళ్లిపోతుంది. అలాగే పర్స్ నల్ ఫోన్ కు ఆఫీస్ వైఫై ని వాడటం కూడా మంచిది కాదు. నెట్ వర్స్ సేఫ్ గా లేకపోతే ప్రైవేట్ డేటా డేంజర్ లో పడే చాన్స్ ఉంది. యావత్ ప్రపంచ వ్యాప్తంగా టెక్స్ మెసేజ్ లు, ఫోటోలు, వీడియోలు అలాగే డాక్యుమెంట్స్ పంపడానికి వాట్స్ అప్ వీలు కల్పిస్తుంది. దాంతో పాటుగా దీన్ని ద్వారా వీడియో కాల్స్, వాయిస్ కాల్స్ చేసే వీలుంది. వాట్స్ అప్ నెలవారి యూజర్ల సంఖ్య రెండు వేల కోట్లకు పైగా ఉందంటే అర్ధం చేసుకోవచ్చు. వాట్స్ ను జనాలు ఏ స్థాయిలో వాడుతున్నారు అన్నది. WhatsApp web.
ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే మనదేశంలో సుమారు 85.4 కోట్ల యూజర్ల తో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది. ఇక ఇంట్లో భైయట ఫోన్లు వాట్స్ అప్ ను వాడేవారు. ఆఫీస్ లోకి వెళ్లగానే వాట్స్ ఆప్ వెబ్బను యూజ్ చేస్తున్నారు. అయితే మనం ఇలాంటి సమస్యల భారిన పడకుండా ఉండాలీ అంటే కొన్ని జాగ్రత్తలను తప్పని సరిగా పాటించాల్సి ఉంటుంది. వాట్స్ ప్ వెబ్ ను వాడిన తర్వాత లాగ్ ఔట్ చెయ్యాలి. సురక్షితం కాని లింక్‌లపై క్లిక్ చేయవద్దు. ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వలన కొంత వరకు మప్పు నుంచి బయట పడే అవకాశం ఉంది.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q