7వేల అడుగులతో దీర్ఘాయుష్షు..!

Walk 7000 steps a Day: నేటి మోడ్రన్ లైఫ్ స్టైల్ లో మనం ఫిజికల్ యాక్టివిటీస్ కి రోజురోజుకీ దూరమైపోతున్నాం. ఇందుకు ప్రత్యేకించి సమయం దొరకట్లేదు. ఇవ్వడం లేదు. దీంతో చిన్న వయసులోనే ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఎటాక్ అవుతున్నాయి. ఫిట్నెస్ కోసమని, లావు తగ్గాలని కొందరు జిమ్ లో చేరడం.. మినహా రెగ్యులర్ గా హెల్త్ పై ఫోకస్ పెట్టడం లేదు. లావున్నా.. లేకున్నా.. డైలీ వాకింగ్ తప్పనిసరిగా చేయడం అనేది ముఖ్యం.

నిజానికి వాకింగ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. డైలీ యాక్టివిటీస్ అయిన చదువు, జాబ్ మీద కాన్సంట్రేషన్ పెరుగుతుంది. బ్రెయిన్ యాక్టివ్ గా పనిచేస్తుంది. హార్ట్ హెల్త్ బాగుంటుంది. రోజంతా యాక్టివ్ పనుల వల్ల నైట్ చక్కగా నిద్రపడుతుంది. అలాగే లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుందని రీసెంట్ గా లాన్సెట్ రీసెర్చ్ అనేది క్లారిఫై చేసింది. Walk 7000 steps a Day.

రోజుకు 7,000 ఫూట్ స్టెప్స్ నడవడం వల్ల ఆయుర్దాయం బాగా పెరుగుతుందని ఈ అధ్యయనం చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా 1.6లక్షల మందిపై కండక్ట్ చేసిన 57 అధ్యయనాల రిజల్ట్స్ లో ఈ విషయాన్ని తెలిపింది. జనరల్ గా రోజుకు కనీసం 2వేల అడుగులు వేసే వ్యక్తులతో పోలిస్తే, రోజుకు 7వేల అడుగులు వేసే వారిలో డెత్ రిస్క్ 47% తక్కువగా ఉన్నట్లు రీసర్చెర్స్ కనుగొన్నారు. ఈ రీసెర్చ్ ప్రకారం, రోజుకు 7,000 అడుగులు నడవడం వల్ల హార్ట్ రిలేటెడ్ 25%, టైప్-2 డయాబెటిస్ 14%, డిమెన్షియా 38%, డిప్రెషన్ 22%, క్యాన్సర్ 6%, ఉన్నట్టుండి పడిపోవడం 28% మేర రిస్క్ తగుతుందట.

60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్నవారు 6,000 నుంచి 8,000 అడుగులు, 60 ఏళ్లలోపు వారికి 8,000-10,000 అడుగులు నడవడం మంచిది. ఇక ఫిట్నెస్ ట్రాకర్లు లేదా స్మార్ట్ ఫోన్ యాప్ ల ద్వారా మీరు వేసే అడుగులను ట్రాక్ చేసుకోవచ్చు. అలాగే సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి ఇతర యాక్టివిటీస్ కూడా చేస్తూ హెల్తీగా ఉండొచ్చని హెల్త్ గైడ్ లైన్స్ సూచిస్తున్నాయి.

Also Read: http://mega9tv.com/life-style/there-is-a-super-urgent-category-for-liver-transplants-checkout-the-full-information/