1000 ఏళ్ల నాటి మిస్టరీ ఆ 6వ గదిలో ఏముందంటే..?

Shree Ananthapadmanabha Swamy Temple: ప్రపంచంలోనే సంపన్న దేవాలయం అనగానే ఠక్కున చెప్పే పేరు ఆ వడ్డీకాసులవాడు కొలువైన అనంత పద్మనాభ స్వామి ఆలయం. కేరళ రాజధాని నగరం తిరువనంతపురంలోని ఈ ఆలయంలో వేల ఏళ్ల నాటి గదుల్లో ఉన్న లక్ష కోట్లకు పైగా నిధి నిక్షేపాలు సుమారు 10 ఏళ్ల క్రితం బయట పడినప్పుడు ఈ గుడి పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ప్రపంచంలోనే అత్యంత రిచ్చెస్ట్ టెంపుల్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఈ గుడిలోని నేలమాళిగల్లో నిక్షిప్తమై ఉన్న నిధి నిక్షేపాల గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఈ గుడిలోని 6వ గది గురించి ఇప్పటికీ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఆలయంలోని అన్ని గదులు తెరుచుకున్నా ఈ గదిని తాకే సాహసం మాత్రం ఎవరూ చేయలేదు…ఈ గదిలో వజ్రవైఢూర్యాలు.. బంగారు రాశులు..నిధి నిక్షేపాలు, అపూర్వ కళాఖండాలు ఇలా అనంతమైన సంపద ఉండవచ్చని ప్రచారం ఉంది. గెడ లేని, తాళాలు వేయని.. కనీసం ఆ తలుపులు లాగడానికి కూడా ఏమీ లేకుండా నాగ బంధనంతో సీల్ చేసి ఉన్న ఆ గదిలో ఏముంటాయో అని తెలుసుకోవాలని ఎంతో మందికి ఆసక్తి ఉంది. ఆ కుతూహలంతో కొంత మంది ఓపెన్ చేసే ప్రయత్నం కూడా చేశారు. అయితే 275 సంవత్సరాల తర్వాత కొన్ని నెలల క్రితం ఆలయ ప్రాంగణంలో మహా కుంభాభిషేకం నిర్వహించారు.దీంతో ఈ గుడి మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఈ క్రమంలో అనంత పద్మనాభుడి ఆలయం చరిత్ర… ఆ 6వ గది వెనకున్న మిస్టరీ, ఆ గదిలో ఉన్న అనంతమైన నిధి గురించిన ఫుల్ డీటైల్స్ ను ఈ వీడియోలో చూసేద్దాం పదండి.

అనంత పద్మనాభ స్వామి ఆలయం అతి ప్రాచీనమైనది. కలియుగం ప్రారంభంలోనే ఈ గుడిని నిర్మించారనీ అప్పటి నుంచీ ఇక్కడ పూజలు జరుగుతున్నాయనీ చెబుతారు. చారిత్రకంగా చూస్తే- ఆరు లేదా ఎనిమిదో శతాబ్దంలో ఈ ఆలయం కట్టి ఉంటారని తెలుస్తోంది. 1000 సంవత్సరాల కంటే పురాతనమైన చోళ సామ్రాజ్యానికి చెందిన రాజ రాజ చోళ ఈ ఆలయానికి వెలకట్టలేని సంపదను సమర్పించారు… బంగారు నాణెలు, విగ్రహాలు,వజ్ర వైఢూర్యాలు ఇలా లెక్కలేనంత సంపదను విరాలాలుగా అందించారు.ఈయనే కాదు అనేక శతాబ్దాలుగా ఎంతో మంది మహారాజులు అందించిన బంగారు విగ్రహాలు ఈ ఆలయంలో కొలువుదీరాయి. వజ్రం, గోమేధికం, పుష్యరాగం ఒకటేమిటి ఇలాంటి అమూల్యమైన రత్నాలు పొదిగిన స్వర్ణ విగ్రహాలు,ఆభరణాలు, భారీ కిరీటాలు,బంగారు హారాలు కళ్ళు జిగేల్మనిపించే నిధి నిక్షేపాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ వాటన్నింటినీ సరిగ్గా లెక్కపెట్టలేదంటే ఎంత సంపద ఉందో అర్థం చేసుకోవచ్చు.

1729లో అనంత పద్మనాభ స్వామి గుడి ట్రావెన్కోర్ రాజవంశం చేతుల్లోకి వచ్చింది. ప్రస్తుత ఆలయాన్ని 16వ శతాబ్దంలో చేర, ద్రవిడ శైలుల్లో కట్టారని తెలుస్తోంది. గోపురాన్ని 18వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజా మార్తాండ వర్మ కట్టించి, ఆలయాన్ని పునరుద్ధరించాడనీ చెబుతారు. 12,008 సాల గ్రామాలతో స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు, ఈ సాల గ్రామాలను నేపాల్‌లోని గండ కీ తీరం నుంచి తెచ్చినట్లు, విగ్రహాన్ని రూపొందించేందుకు 4 వేల మంది శిల్పకారులూ 6 వేలాది మంది కార్మికులూ వంద ఏనుగులూ ఆరునెలలపాటు అహోరాత్రాలు శ్రమించినట్లు, కటుసర్కర యోగం అనే ఆయుర్వేద పూతతో ఈ రాళ్లను అతికించినట్లు తెలుస్తోంది. రాజా మార్తాండ వర్మది ఒకటే సిద్ధాంతం..రాజ్యం మొత్తం శ్రీ మహా విష్ణువుని, రాజులందరూ పద్మనాభ దాసులని భావించేవారు. అందుకే 1750లో త్రిపాడి దానం చేశారు. త్రిపాడి దానం అంటే రాజ్యం మొత్తాన్ని అనంత పద్మనాభుడుకి దానం ఇచ్చేశారు. ఓ యాగం చేసి రాజ్య సంపదను ఆ మహా విష్ణువుకు సమర్పించారు. అప్పటికే అక్కడ గుట్టలుగా ఉన్న ఆలయ సంపదను డచ్‌ వర్తకుల బారి నుంచీ టిప్పుసుల్తాన్‌ దాడుల నుంచీ కాపాడేందుకు మార్తాండ వర్మే స్వయంగా విగ్రహం కింద రహస్య గదులని నిర్మించి, అనాటి సిద్ధుల్ని పిలిపించి ఓ గదికి నాగ బంధనం కూడా వేయించారట.

అయితే 2011లో.. పద్మనాభ స్వామి ఆలయం నిర్వహణ హక్కులపై సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం మొదలైంది. ఆలయ ఆస్తులను నిర్వహించే హక్కు ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికి ఉందా లేదా అనేది ఈ పోరాటానికి ప్రధాన కారణం. 2011లో, కేరళ హైకోర్టు ఆలయ నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. అయితే ట్రావెన్కోర్ రాజకుటుంబం దీనిని సుప్రీం కోర్టులో సవాలు చేసింది. సుప్రీం కోర్టు 2020లో ఆలయ నిర్వహణ హక్కులను ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికి అప్పగించింది. ఈ తీర్పుతో, దశాబ్దాల పాటు జరిగిన న్యాయ పోరాటానికి ముగింపు లభించింది. అయితే సుప్రీమ్ కోర్టు మాజీ జడ్జ్ అయిన టీపీ సుందర్ రాజనే ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికి వ్యతిరేకంగా హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ట్రావెన్కోర్ రాజవంశీయులు పద్మనాభ స్వామి ఫండ్స్ ను దుర్వినియోగం చేస్తున్నారని ఆలయం కేరళ ప్రభుత్వం ఆధీనంలోకి రావాలని పిటిషన్ లోని సారాంశం. ఈ పిటిషన్ పై హైకోర్టులో పెద్ద న్యాయ పోరాటమే జరిగింది. గుడి కింది ఉన్న నేలమాళిగల్లో ఏం ఉన్నాయో ఒకసారి ఆడిట్ చేపించండని కోరారు. ఈ కేసు సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. దీంతో సుప్రీమ్ కోర్టు ఇతని వాదనలో నిజం ఉందని నమ్మి ఆ గదులను తెరిపించమని ఆదేశాలిచ్చింది.దీంతో ఓ వైపు ట్రావెన్కోర్ వారసులు, మరోవైపు కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలో జడ్ ప్లస్ సెక్యూరిటీతో ఒక్కో గదిని తెరవడం మొదలుపెట్టారు. ఇది అప్పట్లో పెద్ద సంచలన విషయంగా మారింది.

సుప్రీమ్ కోర్టు చెప్పిందిన ఈ గుడి తలుపులను 2011 తెరిచారు. ఈ ఆలయంలో ఆరు గదులు ఉన్నాయి. వీటికి A B C D E F‌ అని పేర్లు పెట్టారు. మొదటి గది A తలుపులు తెరవగానే అందరి మైండ్ బ్లాక్ అయ్యింది. ఈ గదిలో సుమారు లక్ష కోట్లు విలువ చేసే నిధి నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు.ఈ ఖజానాలో మూడున్నర కేజీలుండే వజ్రం, రూబీతో నిండిన మహావిష్ణువు బంగారు విగ్రహం, 18 అడుగుల పొడవైన బంగారు గొలుసు, వజ్రాల కెంపులు, విలువైన రత్నాలు బయటకు వచ్చాయి.ఈ గదిలో ఉన్నంత బంగారం కానీ వజ్రాలు కానీ మరే గదిలో లేవు. ఇందంతా ఒక వ్యక్తి ఇచ్చింది కాదు. ఫ్రెంచ్, డచ్, చోలాస్, ట్రావెన్కోర్ వంటి రాజ్యాలకు చెందిన రాజులు విరాలంగా ఇచ్చిన అనంత నిధి ఇది. వివిధ రాజ్యాలకు చెందిన బస్తాలకొద్దీ గోల్డ్ కాయిన్లు. సుమారు వెయ్యి కేజీల బరువుండే శ్రీ మహా విష్ణువు బంగారు విగ్రహం, అరుదైన వజ్రాలు పొదిగిన బంగారు భారీ నెక్లెస్ లు దండలు, 11 అడుగుల ఉండే బంగారు గొలుసులు. భారీ కిరీటాలు ఒకటేమిటి ఎన్నో అపూర్వమైన అలనాటి రాజవంశాన్ని రిప్రజెంట్ చేసే ఎన్నో కళాత్మకమైన అభరణాలు , బంగారు శిలాఫలకాలు రాశులకొద్దీ ఉన్నాయట. బంగారు కంకణాలూ, ఉంగరాల్లాంటివి తీసే కొద్దీ వస్తూనే ఉన్నాయట. మట్టి, రాగి పాత్రల్లో ఉన్న ఆ సంపదను పైకి తేవడానికి 12 రోజుల పైనే పట్టిందనీ చెబుతారు. Shree Ananthapadmanabha Swamy Temple.

ఇందత కేవలం బయట కనిపించింది మాత్రమే. కానీ A గదిలో మరో సీక్రెట్ రూమ్ ఉంది. ఆ గదిలో ఏముంది అన్నది మాత్రం బయట ఉన్న వారెవరికీ తెలియదు. ఆ గదిలోకి కొంత మంది మాత్రమే వెళ్లారు. ఆ గదిలోకి వెళ్లినవారంతా ఒక్కసారిగా భయపడిపోయారు. ఎందుకంటే ఆ గదిలో ఇంకా చాలా నిధి ఉంది..దానిని పూర్తిగా ఆడిట్ చేయలేదు. దీనికి పక్కనే ఉంది B గది.అదే మిస్టరీ గది. ఈ గది తలుపులను ఓపెన్ చేయడానికి విశ్వప్రయత్నాలు చేశారు.కానీ కుదరలేదు. అయితే ఈ ఆరు గదుల్లో C,D,E,F గదులను ఏటా వేడుకల సమయంలో తెరిచి, అందులోని వస్తువులను వాడి మళ్లీ అక్కడే పెట్టేస్తుంటారు. ఈ గదులలో బంగారం, వెండి విగ్రహాలు, బంగారం ఆభరణాలు , ఆలయంలో నిత్యం జరిగే సేవలకు, కార్యక్రమాలకు వాడే రికార్డులు, డొనేషన్ల లెక్కా పత్రాలు ఉంటాయి.

నేలమాళిగల్లో ఇప్పటికీ తెరవని ఆరో గదే బి. దీనినే భరతక్కోన్‌ కల్లర అని అంటుంటారు. ఈ గదికే నాగబంధం వేసి ఉంది. అయితే ఈ గది శ్రీ మహా విష్ణువుకి సంబంధించినదనీ ఇందులో ఎలాంటి సంపద లేదని శ్రీచక్రం ఉందనీ, జానపదాల్లోని కాంజిరోట్టు యక్షి అనే స్త్రీ అక్కడ స్వామిని కొలుస్తుందని రకరకాల కథలు ఉన్నాయి. అయినప్పటికీ దీన్నీ తెరిచేందుకు అధికారులు ప్రయత్నించారు. పై భాగంలో ఉన్న లోహ ద్వారాన్నీ, దాని వెనకున్న చెక్క తలుపునీ తీస్తే ఇనుముతో చేసిన మూడో తలుపు బయటపడింది. దానిమీద మహాసర్పాల బొమ్మలు తప్ప బోల్టులు,తాళాలు, గొళ్లేలు ఏమీ లేవు. వేల సంవత్సరాల నాట గది కదా ఈజీగా ఓపెన్ చేయవచ్చు అని భ్రమపడ్డారు. కానీ కట్ చేస్తే సీన్ రివర్స్ అయ్యింది. ఎంత మోడ్రన్ టెక్నాలజీ ఉన్నా ఈ గది తలపులను వీసమంత కూడా తెరవలేకపోయారు. అక్కడి స్థానికులు చెప్పినట్లుగా మలయాళీ తాంత్రికుల్ని రప్పించి, గరుడమంత్రాన్ని చదివించారు..అయినా అది తెరుచుకోలేదు సరికదా, కొందరు అధికారులకు పూజారులకీ ఎన్నో సమస్యలు వచ్చాయట.ఈ క్రమంలోనే ట్రావెన్కోర్ రాజకుటుంబం వారలుసు ఆ గదిని తెరవకుండా ఇంజెంక్షన్‌ ఆర్డర్‌ తీసుకురావడంతో అధికారులు తమ ప్రయతాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. అలా ఆరోగది ఇప్పటికీ ఓ అంతుబట్టని రహస్యంగా ఉండిపోయింది.

ఈ నాగబంధం గురించి పూర్తిగా తెలిసినవాళ్లు గరుడ మంత్రం చదివితే దానంతటదే తెరుచుకుంటుందనీ కొందరు పండితులు చెబుతుంటే, అది తెరిస్తే ప్రపంచానికే అరిష్టమని మరికొందరు జ్యోతిషులు వాదిస్తున్నారు. అయితే గరుడ మంత్రం చదివి ఆ పాశాన్ని విప్పగల సిద్ధ పురుషులెవరూ అనేదే ప్రశ్న. అయినా 2018లో మరోసారి ఆరో గదిని తెరవాలని ప్రయత్నించారు. అప్పుడే కేరళను వరదలు ముంచెత్తాయి. అంతే కాదు గది తలుపులు తెరవాని పిటిషన్‌ వేసిన సుందర రాజన్, గదుల్ని తెరిచిన కొన్నిరోజులకే మరణించడంతో అక్కడి స్థానికుల నమ్మకం మరింత బలపడింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆలయ కమిటీ దీన్ని తెరిచేందుకు ప్రయత్నిస్తే…ఏవో అలల ఘోష లాంటి అర్థంకాని శబ్దాలేవో భయంకరంగా వినిపించాయనీ, ఆ తరవాత 1930లలో ఓ దొంగల ముఠా దీన్ని దోచుకునేందుకు ప్రయతస్తే… పాములు చుట్టుముట్టాయనీ రకరకాల కథలూ ఈ 6వ గది చుట్టూ తిరుగుతున్నాయి. ఆరో గదిని తెరిస్తే ఆలయం మునిగిపోతుందనీ, లోపల భారీ సర్పాలున్నాయనీ, వెలకట్టలేని సంపదతోపాటు ఎన్నో రహస్యాలూ ఉన్నాయనీ అవన్నీ మనుషుల కంటపడితే మానవజాతి వినాశనం తప్పదని ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అందుకే దేశంలోనే ఏ గుడికి లేని విధంా ఈ గుడికి జెడ్‌ కేటగిరీ సెక్యూరిటీ నిత్యం ఉంటుంది. ఇదిలా ఉంటే 2004లో వచ్చిన సునామీలో పద్మనాభస్వామి ఆలయాన్ని ఒక్క అల కూడా తాకలేదు. అందుకే ఈ ఆలయంలో అంతుబట్టని రహస్యం ఏదో ఉందన్నదే భక్తుల నమ్మకం.

Also Read: https://www.mega9tv.com/devotional/ashada-masam-first-festival-and-hyderabad-bonalu-festival-2025-full-schedule/