టబుని.. పూరి అలా చూపించబోతున్నాడా..?

Vijay Sethupathi Puri movie: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో ఓ భారీ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి అసలు ఊహించని ఈ కాంబో అందరిలో ఆసక్తి కలిగించింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో టబు నటిస్తున్నారని ప్రకటించడంతో ఆమె క్యారెక్టర్ ఎలా ఉంటుంది..? ఏ గెటప్ లో కనిపించనుంది అనే క్యూరియాసిటీ పెరిగింది. ఇప్పుడు టబు క్యారెక్టర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్..?

పూరి తెరకెక్కించిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు రెండూ డిజాస్టర్స్ అవ్వడంతో ఈసారి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సాధించాలని కసితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కథే చాలా డిఫరెంట్ గా ఉంటుందని.. టాక్ వినిపిస్తోంది. ఇక టబు క్యారెక్టర్ గురించి వినిపిస్తోన్న మాట ఏంటంటే.. ఇందులో చాలా పవర్ ఫుల్ గా నెగిటివ్ షేడ్ లో కనిపించనుందట.. ఇంకా చెప్పాలంటే విలన్ రోల్ లో కనిపిస్తాది అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. పూరి ఏ ఆర్టిస్ట్ నుంచైనా బలమైన పెర్ ఫార్మన్స్ ను బయటకు తీసుకురాగలడు. ఇప్పుడు టబును సరికొత్తగా ప్రెజెంట్ చేయనున్నాడని వార్తలు రావడంతో ఈ సినిమా పై మరింత క్రేజ్ ఏర్పడింది.

టబు ఇప్పటి వరకు సీరియస్ అండ్ ఎమోషనల్ క్యారెక్టర్స్ లో నటించింది. విలన్ గా నటిస్తే.. ఇదే ఫస్ట్ టైమ్ అవుతుంది. టబును పూర్తిగా కొత్తగా చూడడానికి సినీ అభిమానులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ సినిమా టబుకు గేమ్ ఛేంజర్ మూవీ అవుతుంది అంటున్నారు. ఆమె బాలీవుడ్ మూవీ అంధాధున్ లో క్లాసీ నెగిటివ్ రోల్ లో కనిపించింది కానీ.. ఇది అంతకు మించి అనేట్టుగా.. అసలు ఊహించని విధంగా ఆమె నెగిటీవ్ రోల్ ఉంటుందట. ఇటీవల ఈ సినిమాని స్టార్ట్ చేశారు. సినిమా స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయడం పూరి స్టైల్. ఈ సినిమాను కూడా ఆయన స్టైల్ లోనే చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారని తెలిసింది. Vijay Sethupathi Puri movie.

తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీని భారీగా రిలీజ్ చేయాలనేది ప్లాన్. అయితే.. పాన్ ఇండియా మూవీ అయినప్పటికీ పూరి స్టైల్ మాత్రం మారదు. సినిమాలో కథను పరుగులు పెట్టించడమే కాదు.. యూనిట్ ను కూడా పరుగులు పెట్టించి అనుకున్న టైమ్ కంటే ముందుగానే కంప్లీట్ చేస్తాడు ఈ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, దునియా విజయ్ కూడా నటిస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి.. ఈ సినిమాతో పూరి మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/power-star-pawan-kalyan-action-film-og-to-release-worldwide-on-september-25th/