సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.!

Kota Srinivasa Rao: టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో..బాధపడుతున్న కోట శ్రీనివాసరావు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. కోట శ్రీనివాస రావు మృతిపై పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కోట నాలుగు దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో రకాల పాత్రలు చేసి ప్రేక్షకుల్ని మెప్పించారు. కేవలం తెలుగులోనే కాదు.. తమిళం, హిందీ భాషల్లో కూడా తన సత్తా చాటారు. కోట శ్రీనివాసరావు 1942 జులై 10వ తేదీన కంకిపాడులో జన్మించారు. కోట తండ్రి సీతా రామాంజనేయులు డాక్టర్. కోట కూడా మొదట్లో డాక్టర్ కావాలనే అనుకున్నారు. అయితే, యాక్టింగ్ మీద ఆసక్తితో నాటకాల వైపు వచ్చారు. సినిమాల్లోకి రాకముందు ఆయన స్టేట్ బ్యాంకులో పని చేశారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తెలుగులో చివరగా సువర్ణ సుందరి అనే సినిమాలో నటించారు.2003లో వచ్చిన సామి సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టారు. తమిళంలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2018లో వచ్చిన కాత్తాడి ఆయన చివరి తమిళ సినిమా. స Kota Srinivasa Rao.

ఇక 1987లో విడుదలైన ప్రతిఘాత్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 2016లో విడుదలైన భాగీ ఆయన చివరి హిందీ సినిమా. కన్నడలో 1997లో వచ్చిన లేడీ కమిషనర్‌తో ఎంట్రీ ఇచ్చారు. 2023 విడుదలైన కబ్జా ఆయన చివరి కన్నడ సినిమా. కేవలం నటుడిగానే కాదు.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, సింగర్‌గా కూడా కొన్ని సినిమాలకు పని చేశారు. కోటా శ్రీనివాస్ 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 750 సినిమాల్లో నటించారు. 9 నంది అవార్డులు, సైమా అవార్డు గెలుచుకున్నారు. 2015లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు కోటా శ్రీనివాస్ రావు. 1990లలో బీజేపీలో చేరారు. 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇలా రాజకీయాల్లోనూ….సినీ పరిశ్రమల్లోనూ తనదైన ముద్ర వేశారు కోటా శ్రీనివాస రావు.

కోట భౌతికకాయానికి నివాళులర్పించిన చిరంజీవి మహానటుడు కోట మరణం బాధాకరం.కోట ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా మా ఇద్దరి నట ప్రస్థానం ఒకే సినిమాతో మొదలైంది. కోట శ్రీనివాసరావుతో మంచి అనుబంధం ఉంది కోటతో నటించిన ప్రతి సినిమా నాకు ప్రత్యేకం యాసలు, మాండలికాలు అవలీలగా మాట్లాడుతారు. కోట మృతి సినీ పరిశ్రమకు తీరనిలోటు-చిరంజీవి

  • కోట భౌతికకాయానికి నివాళులర్పించిన బాబూమోహన్‌.
  • కోట మృతికి సంతాపం తెలిపిన మహేష్‌బాబు.
  • కోట ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా.
  • కోట కుటుంబ సభ్యులకు నా సానుభూతి-మహేష్‌బాబు.
  • కోట శ్రీనివాసరావు మృతికి మోహన్‌బాబు సంతాపం.