బాలయ్య, పవన్ మధ్యలో మెగాస్టార్..?

Akhanda 2 OG & Vishwambhara: నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న భారీ చిత్రం అఖండ 2. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న క్రేజీ మూవీ ఓజీ. ఈ రెండు సినిమాలు సెప్టెంబర్ 25న ఓకే రోజున థియేటర్స్ లోకి వస్తుండడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఉండదేమో.. పోస్ట్ పోన్ అవుతాయి అనుకుంటే.. తగ్గేదేలే అన్నట్టుగా ఈ రెండు సినిమాల మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ రెండు సినిమాలు పోటీపడుతుంటే… మధ్యలో మెగాస్టార్ చిరంజీవి నేనున్నాను అంటూ విశ్వంభరతో వచ్చేందుకు రెడీ అవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ.. అఖండ 2, ఓజీతో పాటు విశ్వంభర కూడా అదే రోజున వస్తుందా..? లేక వేరే ప్లాన్ ఏదైనా ఉందా..?

బాలయ్య అఖండ సినిమాకి సీక్వెల్ గా అఖండ 2 సినిమాని ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీ పై మరింత క్రేజ్ ఏర్పడింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా పై ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే.. గతంలో ఎప్పుడూ బాలయ్య, పవన్ బాక్సాఫీస్ దగ్గర పోటీపడలేదు. రాజకీయాల్లో కలిసే ఉన్నా.. ఇప్పుడు సినిమాల విషయంలో బాక్సాఫీస్ దగ్గర వీరిద్దరూ పోటీపడుతుండడంతో ఏం జరగనుంది..? ఏ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది అనేది ఆసక్తిగా మారింది. Akhanda 2 OG & Vishwambhara.

అయితే.. రెండు భారీ చిత్రాలు ఒకే రోజున రిలీజ్ అయితే.. నిర్మాతకు నష్టం. అందుచేత లాస్ట్ మినిట్ లో ఏదో సినిమా పోటీ నుంచి తప్పుకుంటుందని.. ఈ రెండు సినిమాల్లో సెప్టెంబర్ 25న ఒక సినిమానే విడుదల అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ.. ఇంత వరకు రాలేదు. ఓ స్పెషల్ సాంగ్ షూట్ చేయాలి.. త్వరలోనే ఈ సాంగ్ ను షూట్ చేసి రిలీజ్ డేట్ ఫైనల్ చేయాలి అనుకుంటున్నారు. సెప్టెంబర్ 25న రావాలి అనుకుంటుందట కానీ.. బాలయ్య అఖండ 2, పవన్ ఓజీ ఉండడంతో వేరే ఆప్షన్ చూస్తుందని టాక్.

అయితే.. బాలయ్య అఖండ 2, పవన్ ఓజీ ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా అయినా పోస్ట్ పోన్ అయితే.. చిరు విశ్వంభర చిత్రాన్ని సెప్టెంబర్ 25న రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. ఒకవేళ ఆ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ లో ఎలాంటి తేడా లేకపోతే… విశ్వంభర సినిమాని ఆ రెండు సినిమాల కంటే ఒక వారం ముందుగా అంటే.. సెప్టెంబర్ 18న విడుదల చేయాలి అనేది మేకర్స్ ప్లాన్ అని సమాచారం. అక్టోబర్ 2న రిలీజ్ చేద్దామంటే.. కాంతార ప్రీక్వెల్ కాంతార చాప్టర్ 1 ఉంది. అందుచేత సెప్టెంబర్ 18నే విశ్వంభర రావచ్చు అని తెలిసింది. దసరా హాలీడేస్ ను ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకూడదు అని మెగాస్టార్ మేకర్స్ కి గట్టిగానే చెప్పారట. అందుచేత ఈ దసరా సీజన్ లో విశ్వంభర రావడం ఖాయం.

Also Read: https://www.mega9tv.com/cinema/huge-expectations-on-bunny-atlees-movie-is-bunny-going-to-play-four-roles/