
Nagarjuna song in Coolie: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్.. ఈ క్రేజీ కాంబోలో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ కూలీ. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో సినిమా పై మరింత క్రేజ్ పెరుగుతుంది. అయితే.. ఈ సినిమా నుంచి రెండు పాటలు రిలీజ్ చేశారు. ఒక సాంగ్ లో రజినీ కనిపిస్తే.. మరో సాంగ్ లో పూజా కనిపించింది. అయితే.. ఇందులో నాగ్ విలన్ గా నటిస్తున్నారు. మరి.. నాగ్ కు సాంగ్ ఉంటుందా..? లేదా..? నాగ్ సాంగ్ వెనకున్న సీక్రెట్ ఏంటి..?
కూలీ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తారని అనౌన్స్ చేసినప్పుడు సోషల్ మీడియాలో నాగ్ సాంగ్ వస్తుంది అంటూ అభిమానులు తెగ సందడి చేశారు. అయితే.. పూజా సాంగ్ వచ్చింది కానీ.. నాగ్ ఎక్కడా కనిపించలేదు కానీ.. సాంగ్ మాత్రం సోషల్ మీడియాని ఊపేస్తుంది. ఒక్క తెలుగు వెర్షెన్ సాంగే 3 మిలియన్ల వ్యూస్ దాటేయడం విశేషం. దీనిని బట్టి ఈ సాంగ్ ఎంతలా నచ్చేసిందో అర్థం చేసుకోవచ్చు. పూజా హెగ్డే రెడ్ కాస్ట్యూమ్ లో అంత అందంగా అదరగొడితే ఆమెకన్నా ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ సౌబిన్ సాహిర్ హైలైట్ కావడం ఊహించని ట్విస్ట్ అని చెప్పచ్చు. Nagarjuna song in Coolie.
ఈ సాంగ్ రిలీజైనప్పటి నుంచి ఎవరా సౌబిన్ అని సినీ అభిమానులు ఆరా తీయడం స్టార్ట్ చేశారు. అంతే కాకుండా ఈ సాంగ్ వచ్చిన తర్వాత నుంచి సౌబిన్ లో ఇంత మంచి డ్యాన్సర్ ఉన్నాడా..? మనం ఎందుకు గుర్తించలేదు అని మలయిళం దర్శకులు తెగ ఫీలవుతున్నారట. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సాంగ్ లో నాగార్జున ఉంటారట. అయితే.. అది ఇప్పుడే చూపిస్తే థ్రిల్ పోతుందని.. తెర పై చూపిస్తేనే బాగుంటుందనే ఉద్దేశ్యంతోనే లోకేష్ కనకరాజ్ ఇలా ప్లాన్ చేశారట. సినిమాలో పూజా నాగార్జున కోసమే పోర్ట్ కు వస్తుందట. ఆమె వచ్చినప్పుడు సెలబ్రేషన్ గా ఈ ఐటెం సాంగ్ తో ఆడిస్తారట.
నెగటివ్ రోల్ అయినప్పటికీ నాగార్జున క్యారెక్టర్ కు చాలా ప్రాధాన్యత ఉంటుందట. దానికి తగ్గట్టే ఒక ప్రత్యేక పాటను ఉంచారు. ఎక్స్ పెక్ట్ చేసిన దాని కన్నా చాలా పెద్ద రెస్పాన్స్ రావడం చూసి కూలి మేకర్స్ ఆనందం మాములుగా లేదట. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. గత కొన్ని రోజులు నుంచి అసలు ట్రైలర్ రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా సినిమాను రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఆగష్టు 2న కూలీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టుగా లోకేష్ కనకరాజ్ ఓ ఇంటర్ వ్యూలో అనౌన్స్ చేశారు. సో.. ఆగష్టు 2న కూలీ ట్రైలర్ తో యూబ్యూట్ షేక్ అవ్వడం ఖాయం.
Also Read: https://www.mega9tv.com/cinema/star-heroes-are-running-towards-comedy-genre-to-make-audience-laugh/