వైష్ణవ్ తేజ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?

Vaishnav Tej New film: మెగా హీరో వైష్ణవ్ తేజ్.. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి తొలి సినిమాతోనే సంచలనం సృష్టించాడు. ఆతర్వాత అదే స్పీడు కంటిన్యూ చేస్తాడు.. వరుసగా బ్లాక్ బస్టర్స్ అందిస్తాడు అనుకుంటే.. వరుసగా ఫ్లాప్స్ ఇచ్చాడు. వైష్ణవ్ తేజ్ నుంచి సినిమా వచ్చి రెండేళ్లు అవుతుంది ఇంత వరకు కొత్త సినిమాని ప్రకటించలేదు. అయితే.. ఇప్పుడు ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి ఓకే చెప్పాడని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఆ ప్లాప్ డైరెక్టర్ ఎవరు..? వైష్ణవ్ నిర్ణయం సరైనదేనా..?

ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్ కొండపొలం, రంగ రంగ వైభవంగా, ఆదికేశవ సినిమాలు చేశాడు. ఆ మూడు సినిమాలు కూడా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈసారి ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ సాధించాలని సరైన కథ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. రెండు సంవత్సరాల నుంచి కథలు వింటూనే ఉన్నాడు కానీ.. ఏ సినిమా కథ వైష్ణవ్ ని మెప్పింలేదట. అయితే.. ఇటీవల పరశురామ్ చెప్పిన కథ మాత్రం నచ్చిందట. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయండి.. మనం సినిమా చేద్దామని మాట ఇచ్చాడట. దీంతో పరశురామ్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడని టాక్ వినిపిస్తోంది. Vaishnav Tej New film.

పరశురామ్ విషయానికి వస్తే.. స్టార్ డైరెక్టర్స్ లీగ్ లో చేరాలని తపించాడు. సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో సర్కారు వారి పాట అనే సినిమా తీసాడు. ఆ సినిమా బాగానే ఉంది కానీ.. ఆశించిన రేంజ్ లో సక్సెస్ అందివ్వలేదు. ఆతర్వాత విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ అంటూ ఫ్యామిలీ సినిమా చేశాడు. గీత గోవిందం మ్యాజిక్ రిపీట్ అవుతుందని దిల్ రాజు చాలా గట్టిగా నమ్మాడు.. బాగా ప్రమోట్ చేశాడు కానీ.. బాక్సాఫీస్ దగ్గర బొమ్మ బోల్తాపడింది. ఆ సినిమా వచ్చి సంవత్సరం అయ్యింది కానీ.. పరశురామ్ ఇంత వరకు కొత్త సినిమా ఎవరితో అనేది ప్రకటించలేదు.

రెండు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న వైష్ణవ్ తేజ్.. సంవత్సరం నుంచి వెయిట్ చేస్తోన్న పరశురామ్ ఇప్పుడు కలిసి సినిమా చేయబోతున్నారనే వార్త ఆసక్తిగా మారింది. ఫ్యామిలీ స్టార్ తర్వాత పరశురామ్.. కోలీవుడ్ స్టార్ కార్తితో సినిమా చేయాలి అనుకున్నాడు. స్టోరీ లైన్ చెప్పడం.. బాగుంది చేద్దామని కార్తీ చెప్పడని మీడియాలో వార్తలు వచ్చాయి కానీ.. ప్రాజెక్ట్ మాత్రం పట్టాలెక్కలేదు. ఆతర్వాత ఒకరిద్దరు హీరోలతో సినిమాలు ప్లాన్ చేసినా సెట్ కాలేదు. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ తో పరశురామ్ మూవీ సెట్ అయ్యిందని ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. మరి.. ఈ సినిమా అయినా పట్టాలెక్కుతుందో … వార్తలకే పరిమితం అయిపోతుందో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/meher-rameshs-film-with-power-star-i-will-definitely-do-a-film-with-pawan-says-meher-ramesh/