
War 2 Promotions: రజినీ, నాగ్ కాంబోలో రూపొందుతోన్న కూలీ, ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో రూపొందుతోన్న వార్ 2.. ఈ రెండు క్రేజీ పాన్ ఇండియా సినిమాలు ఆగష్టు 14నే రిలీజ్ అవుతుండడం తెలిసిందే. దీంతో ఈ రెండు సినిమాల బాక్సాఫీస్ వార్ ఏ రేంజ్ లో ఉండబోతుందని అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. కూలీ ప్రమోషన్స్ లో దూకుడు చూపిస్తుంది కానీ.. వార్ 2 మాత్రం ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు. దీంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి.. వార్ 2 ప్రమోషన్స్ స్టార్ట్ చేసేది ఎప్పుడు..? అసలు ప్లాన్ ఏంటి…? War 2 Promotions.
కూలీ, వార్ 2.. ఈ రెండు సినిమాలకు నెల రోజులే టైమ్ ఉంది. వార్ 2 నుంచి ఇప్పటి వరకు టీజర్ రిలీజ్ చేశారు కానీ.. అంతకు మించి ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు చేయలేదు. యష్ రాజ్ ఫిల్మ్స్ ఎందుకు సైలెంట్ గా ఉంది..? అనే డిష్కసన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో జరుగుతోంది. అయితే.. ఆగష్టు ఫస్ట్ వీక్ నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తుందని తెలిసింది. ఇంకా చెప్పాలంటే.. వార్ 2 ప్రమోషన్స్ నెక్ట్స్ లెవల్లో ఉంటాయనేది బాలీవుడ్ రిపోర్ట్. ప్రస్తుతం ఎన్టీఆర్.. డ్రాగన్ మూవీ షూట్ లో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ సినిమా రామోజీ ఫిలింసిటీలో ఇటీవల కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
హైదరాబాద్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా ప్లాన్ చేస్తున్నారట. ఈ ఈవెంట్స్ తో అంచనాలు ఎక్కడికో వెళ్లడం ఖాయం అంటున్నారు మేకర్స్. వార్ 2 మూవీని తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్ టైన్మెంట్స్ అధినేత నాగవంశీ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్ వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ కి తెరలు చిరిగిపోతాయని.. ఆడియన్స్ కి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని చెప్పారు. అంతే కాకుండా ఇద్దరు ఫైనెస్ట్ స్టార్ట్స్ తెర పై కొట్టుకుంటే చూడడానికి రెండు కళ్లు చాలవని.. 2 యాక్షన్ ఎపిసోడ్ లో ఓ రేంజ్ లో ఉంటాయని చెప్పడం ఆసక్తిగా మారింది.
కూలీ, వార్ 2 సినిమాలు ఒకే రోజున వస్తుండడంతో ఏ సినిమాకి ఎక్కువ బజ్ ఉంది.. ఏ సినిమా జనాల్లో క్రేజ్ క్రియేట్ చేసిందనేది హాట్ టాపిక్ అయ్యింది. కూలితో తీవ్రమైన పోటీ ఉండడంతో ఓపెనింగ్స్ పంచుకోవాల్సి వస్తుందనే దాని మీద యంగ్ టైగర్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల సంగతి పక్కనపెడితే కూలి ప్రభావం తమిళనాడు, కేరళలో తీవ్రంగా ఉంటుంది. కర్ణాటకలోనూ ఎఫెక్ట్ చూపించడం ఖాయం. బజ్ పరంగా కూలి కన్నా వార్ 2 కొంత వెనుకబడిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే.. వార్ 2 ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన తర్వాత కావాల్సినంత బజ్ వస్తుంది అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.