బన్నీ అసలు టార్గెట్ ఇదే..!

Icon Star Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప, పుష్ప 2 సినిమాలతో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో తెలిసిందే. ఇప్పుడు అంతకు మించి అనేలా సంచలనం సృష్టించేందుకు.. సరికొత్త రికార్డులు సెట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ భారీ క్రేజీ పాన్ వరల్డ్ మూవీని సాధ్యమైనంత స్పీడుగా కంప్లీట్ చేయాలనేది మేకర్స్ ప్లాన్. అయితే.. ఈ మూవీ కోసం బన్నీటార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. బన్నీ టార్గెట్ ఏంటి..? ఆయన టార్గెట్ రీచ్ అవ్వడం సాధ్యమేనా..?

ఒకప్పుడు 100 కోట్లు సాధించడం అంటే గొప్పగా ఉండేది. ఆతర్వాత 100 కోట్లు కలెక్ట్ చేసిందంటే జనాలకు పెద్దగా ఆనడం లేదు. 500 కోట్లు.. 1000 కోట్లు అంటేనే తృప్తిగా ఉంటుంది. దంగల్ సినిమా కలెక్ట్ చేసిన 2 వేల కోట్లని అందుకోవాలని బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, పుష్ప 2 చిత్రాలు ప్రయత్నాలు చేశాయి కానీ కుదరలేదు. అందుకనే ఈసారి టార్గెట్ మిస్ కాకుండా.. 2 వేల కోట్లు సాధించాలని బన్నీ టార్గెట్ గా పెట్టుకున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే.. అట్లీ సినిమాల కథలు రెగ్యులర్ గానే ఉంటాయి కానీ.. కొత్తగా ఉండవనే టాక్ ఉంది. అయితే.. ఈసారి మాత్రం అట్లీ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశాడనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్.

ఈ సినిమా బడ్జెట్ 500 కోట్లు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో వావ్ అనిపించే విజువల్స్ తో.. ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారట. ఈ సినిమాకి ఐకాన్ అనే టైటిల్ ఖరారు చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే.. 2 వేల కోట్లు టార్గెట్ ను రీచ్ అవ్వడం సాధ్యమేనా అంటే.. పక్కాగా ప్లాన్ చేస్తే అది అంత పెద్ద విషయమేమీ కాదనిపిస్తుంది. కాకపోతే ఓవర్సీస్ మార్కెట్ పై మరింతగా దృష్టి పెట్టాలి. జ‌పాన్ వంటి దేశాల నుంచి మంచి వసూళ్లు రాబ‌ట్టు కోవాలి. బాహుబలి, ఆర్‌.ఆర్‌.ఆర్ సినిమాలు దేశ స‌రిహ‌ద్దులు దాటేసి ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా భాష‌ల్లో ప్రేక్ష‌కుల్ని మెప్పించాయి. Icon Star Allu Arjun.

అసలు పుష్ప 2 సినిమా టార్గెట్ 1000 కోట్లు. అయితే.. ఊహించని విధంగా ఆ సినిమా 1800 కోట్లు వరకు కలెక్ట్ చేసిందని ట్రేడ్ పండితులు చెబుతుంటారు. ఈసారి టార్గెట్ 2 వేల కోట్లు. ఎట్టి పరిస్థితుల్లోనూ టార్గెట్ మిస్ కాకూడదని బన్నీ పక్కాగా ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. ఈ మూవీ ప్రమోషన్ బడ్జెట్టే 100 కోట్లు ఉంటుందని ఓ అంచనా. ప్రచారంలో ఉన్నట్టుగా ప్రమోషన్స్ కే 100 కోట్లు కేటాయిస్తే.. ఈ మూవీ జనాలకు మరింతగా రీచ్ అవుతుందని.. 2000 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయమని అంటున్నారు సినీ జనాలు. మరి… బన్నీ టార్గెట్ రీచ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడేమో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/tej-is-planning-two-films-at-the-same-time-tej-is-targeting-pan-india-with-sambarala-yetigattu/