
Fish Venkat Passed Away: కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఫిష్ వెంకట్ లివర్ ఫెయిల్యూర్ తో ఆస్పత్రి పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన వెంకట్. ఫిష్ వెంకట్ మృతికి సినీ ప్రముఖుల సంతాపం
హైదరాబాద్: సినీ నటుడు ఫిష్ వెంకట్ శుక్రవారం రాత్రి మృతి చెందారు. ఆయన అసలు పేరు వెంకట్ రాజ్. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఫిష్ వెంకట్ తీవ్రమైన కిడ్నీ, లివర్ వైఫల్యంతో కన్నుమూశారు. ఆయన కొన్ని నెలలుగా డయాలసిస్ చేయించుకుంటూ ఉండేవారు. ఇటీవల ఆయనను వెంటిలేటర్ పై ఉంచారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ కోసం డోనర్ దొరకకపోవడంతో ఆయన పరిస్థితి మరింత దిగజారి మరణించారు. Fish Venkat Passed Away.
ఫిష్ వెంకట్ తెలంగాణ యాసతో హాస్య పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు. గబ్బర్ సింగ్, అదుర్స్, డీజే టిల్లు చిత్రాల్లో నటించారు. ఆయన కుమార్తె శ్రావంతి ఆర్థిక సాయం కోసం అభ్యర్థించగా, పవన్ కల్యాణ్, విశ్వక్ సేన్ వంటి నటులు సహాయం అందించారు.