ప్రభాస్ కు కలిసొచ్చింది.. మరి విజయ్ కి కలిసొచ్చేనా..?

Prabhas Chatrapathi And Vijay’s Kingdom: ఒక్కొక్కరికీ ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది.. అదే ఇండస్ట్రీలో అయితే.. ఈ సెంటిమెంట్స్ కాస్త ఎక్కువుగానే ఉంటాయి. ఇక్కడ ఓ బ్యాక్ డ్రాప్ లో సినిమా సక్సెస్ అయితే.. అందరూ అదే బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేయాలి అనుకుంటారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఓ బ్యాక్ డ్రాప్ బాగా కలిసొచ్చింది.. బ్లాక్ బస్టర్ అయ్యింది. విజయ్ దేవరకొండ కూడా అదే బ్యాక్ డ్రాప్ లో సినిమా చేశారు. ఇంతకీ.. ఆ బ్యాక్ డ్రాప్ ఏంటి..? ప్రభాస్ బ్లాక్ బస్టర్ అందించిన ఆ బ్యాక్ డ్రాప్ లో ఇటీవల వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రభాస్ కెరీర్ లో మరచిపోలేని సినిమాల్లో ఒకటి ఛత్రపతి. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమా శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీలంక నుంచి శరణార్థులు ఇండియాలోని విశాఖపట్నంకు వస్తారు. వచ్చిన తర్వాత వైజాగ్ లో ఓ నాయకుడుగా ఎలా ఎదిగాడు అనేది కథాంశం. తెలుగు సినిమాకి శ్రీలంక నేపథ్యం అప్పుడు బాగా కలిసొచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఛత్రపతి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ నటించిన సినిమా కింగ్ డమ్. ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా కథ అంతా శ్రీలంక నేపథ్యమే.

ఇది కూడా శరణార్థుల కథే అనిపిస్తుంది. టీజర్ చూస్తుంటే. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన సాంగ్ చూస్తుంటే.. ఇందులో ఎమోషన్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థమౌతుంది. తెలుగులోనే కాదు.. మిగిలిన ఇండస్ట్రీలో కూడా శ్రీలంక నేపథ్యం బాగానే కలిసొస్తుంది. ఈమధ్యే తమిళంలో రిలీజై సంచలన విజయం సాధించిన సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ. ఈ సినిమా బ్యాక్ డ్రాప్ కూడా శ్రీలంక నేపథ్యమే. అక్కడ నుంచి అడ్డదారుల్లో ఇండియాకి వచ్చి ఇక్కడ ఎలా ఉన్నారనేదే కథ. ఈ సినిమా దర్శకధీరుడు రాజమౌళి తెగ నచ్చేసింది. Prabhas Chatrapathi And Vijay’s Kingdom.

8 కోట్లతో నిర్మించిన ఈ సినిమా 80 కోట్లు వసూలు చేసింది ఈ టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా. సినిమాలే కాదు.. వెబ్ సిరీస్ లలో కూడా లంక నేపథ్యం వర్కవుట్ అయ్యింది. ఈమధ్య సమంత కీలక పాత్రలో రాజ్ డీకే క్రియేట్ చేసిన ఫ్యామిలీ మేన్ 2 లో ఉన్నది అంతా లంక నేపథ్యమే. ఎల్.టీ.టీ నేపథ్యంలో వచ్చిన ఈ సిరీస్ సంచలనం సృష్టించింది. రాజీవ్ గాంధీ డెత్ మిస్టరీ నేపథ్యంలో వచ్చిన హంట్ సిరీస్ నేపథ్యం కూడా శ్రీలంకే. ఇలా శ్రీలంక నేపథ్యంతో వచ్చిన సినిమాలు వెబ్ సిరీస్ సక్సెస్ సాధించాయి. మరి.. ఈ సెంటిమెంట్ విజయ్ దేవరకొండకు కలిసొచ్చి కింగ్ డమ్ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందిస్తుందేమో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/og-and-veeramallu-coming-in-gap-of-2-months-og-is-more-crazed-than-veeramallu/