
War 2 Movie Trailer: టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్.. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ వార్ 2. ఈ సినిమా ప్రమోషన్స్ లో వెనకబడింది. మరో వైపు కూలీ ప్రమోషన్స్ లో దూకుడు చూపిస్తుంది. దీంతో ఎప్పుడెప్పుడు వార్ 2 ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారా అని ఎదురు చూస్తున్న యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ ఏంటంటే.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. అయితే.. ఈ ట్రైలర్ రిలీజ్ డేట్ వెనుక సీక్రెట్ ప్లాన్ అదిరింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇంతకీ.. వార్ 2 ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు..? ఇంతకీ ప్లాన్ ఏంటి..?
వార్ 2 ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తోన్న అభిమానులకు అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ ట్రైలర్ ను ఈ నెల 23న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇక ఈ ట్రైలర్ రన్ టైమ్ విషయానికి వస్తే.. 2 నిమిషాల 39 సెకన్లు అని తెలిసింది. ఇప్పటి వరకు ప్రమోషన్స్ లో సైలెంట్ గా ఉన్న వార్ 2 మేకర్స్ ఇక నుంచి స్పీడు పెంచడానికి ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. ట్రైలర్ విడుదల చేసినప్పటి నుంచి సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎక్కడా చూసిన వార్ 2 గురించే చర్చ జరిగిలే గట్టిగానే ప్లాన్ చేశారట మేకర్స్.
ఈ నెల 23నే ట్రైలర్ రిలీజ్ చేయడం వెనకున్న సీక్రెట్ ఏంటంటే.. కూలీ మూవీ ట్రైలర్ ను ఆగష్టు 2న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. కూలీ సినిమాలో రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్.. ఇలా భారీ తారాగణమే ఉంది. అందుచేత ఒక్కసారి కూలీ ట్రైలర్ బయటకు వస్తే.. సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా ఉండదు. అందుకనే కూలీ ట్రైలర్ కంటే ముందుగానే వార్ 2 రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారట. అలాగే ఈ ట్రైలర్ కట్ పై చాలా కసరత్తు జరిగిందట. ఫైనల్ గా ఈ ట్రైలర్ వావ్ అదిరింది అనేలా కట్ చేసారని సమాచారం. War 2 Movie Trailer.
ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగన్ మూవీ షూట్ లో ఉన్నారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న డ్రాగన్ మూవీని రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరిస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ పై భారీ యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేశారు. ఇప్పుడు వార్ 2 ప్రమోషన్స్ కోసమని బ్రేక్ ఇవ్వనున్నారని తెలిసింది. ఈ సినిమాకి కూలీ రూపంలో గట్టి పోటీ ఏర్పడడంతో ప్రమోషన్స్ ను భారీగా ప్లాన్ చేశారట. ట్రలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమా పై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు రెట్టింపు అవ్వడం ఖాయమని మేకర్స్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. వార్ 2 ట్రైలర్ కనుక అంచనాలకు తగ్గట్టుగా మెప్పిస్తే.. మరింత క్రేజ్ పెరగడం ఖాయం. మరి.. ఏం జరగనుందో చూడాలి.