
The Unique Identification Authority of India: ప్రతిదానికీ ఇప్పుడు ఆధార్ తప్పనిసరి. అందుకే ఈ కార్డ్ ను ఎల్లప్పుడూ ఆప్డేటెడ్ గా ఉంచుకోవడం చాలా అవసరం! ఏవైనా పేరు, అడ్రస్ తదితర పొరపాట్లు ఉంటే కచ్చితంగా ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి సరిచేసుకోవాల్సిందే. చాలా సందర్భాల్లో అలాంటి కేంద్రాలు ఎక్కడున్నాయో తెలుసుకోవడం ఒక్కోసారి సమస్యగా మారుతుంది. ముఖ్యంగా నగరాలకు కొత్తగా వలస వచ్చినవారు.. ఒక చోటు నుంచి మరోచోటుకు మారినవారికి ఈ కేంద్రాల సమాచారం గురించి తెలుసుకోవడం కాస్త ఇబ్బందే. దీనికి పరిష్కారంగా ఇప్పుడు ఒక పోర్టల్ ను తీసుకొచ్చారు. దాని పేరే భువన్ పోర్టల్.
దీని ద్వారా సులువుగా ఆధార్ కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవచ్చు.
భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) ఇస్రోకు అనుబంధంగా పనిచేసే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC)తో కలిసి భువన్ ఆధార్ (Bhuvan Aadhar) అనే పోర్టల్ ను స్టార్ట్ చేసింది. దీనిద్వారా ఆధార్ కార్డు హోల్డర్లు మూడు రకాల ప్రీమియం ఫీచర్లను పొందొచ్చు. The Unique Identification Authority of India.
తమకు దగ్గర్లో ఉన్న ఆధార్ సెంటర్లను తెలుసుకోవడంతోపాటు వాటి దగ్గరకు వెళ్లేందుకు రూట్, ఏ పరిసరాల్లో ఉందో అనే మ్యాప్ ను కూడా ఈ పోర్టలే మనకు అందిస్తుంది. ఆయా ఆధార్ కేంద్రాల్లో మీకు అవసరమైన సేవలు ఆయా కేంద్రాల్లో లభిస్తాయా? లేదా? అనేది కూడా ఫిల్టర్ చేసి తెలుసుకోవచ్చు. ఎంత దూరంలో ఆధార్ కేంద్రం కావాలో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఇందుకోసం ముందుగా భువన్ ఆధార్ పోర్టల్ లోకి వెళ్లాలి. స్క్రీన్ కు లెఫ్ట్ సైడ్ లో మీకు నాలుగు డ్రాప్- డౌన్ ఆప్షన్లు కనిపిస్తాయి.
- దగ్గర్లోని ఆధార్ నమోదు కేంద్రాన్ని తెలుసుకునేందుకు ఆప్షన్లలో ‘సెంటర్స్ నియర్ బై’ను చూజ్ చేసుకోవాలి. వెంటనే మీకు దగ్గర్లోని కేంద్రాలు స్క్రీన్ పై లిస్టౌట్ అవుతాయి.
- మీకు ప్రత్యేకంగా ఒక ఆధార్ సేవా కేంద్రం పేరు తెలిస్తే ‘సెర్చ్ బై ఆధార్ సేవా కేంద్ర’ అనే ఆప్షన్ ను కూడా యూస్ చేసుకోవచ్చు.
- పిన్ కోడ్ ఎంటర్ చేయడం ద్వారా కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఆధార్ కేంద్రాలు ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చు.
- రాష్ట్రం, జిల్లా, మండలం లాంటి బేసిక్ అడ్రస్ డీటైల్స్ ను ఎంటర్ చేసి ఆయా రాష్ట్రాల్లోని ఆధార్ కేంద్రాల వివరాలన్నింటినీ చూసుకోవచ్చు.
- టూల్స్ అనే సెక్షన్ పైన క్లిక్ చేసి, దగ్గర్లోని సెంటర్ కి రూట్ మ్యాప్ ను కూడా ఐడియా కోసం చూడొచ్చు.