ఏఐ తరహా కామెట్ బ్రౌజర్ ఇది..!

Perplexity AI Comet Browser: వెబ్ బ్రౌజర్ గురించి ఎప్పుడైనా తెలుసుకుందామని అనిపించిందా మీకు.. బ్రౌజర్ల గురించి చెప్పు కోవటానికి ఏముంటుంది అసలు అనుకుంటున్నారా? నిజమే కొన్నేళ్ళుగా అవేమీ పెద్దగా మారలేదు. క్రోమ్, సఫారీ, ఫైర్ ఫాక్స్ వంటి బ్రౌజర్ లేదంటే యాప్ ను ఓపెన్ చేయడం.. యూఆర్ఎల్ బార్ లో కావాల్సిన వెబ్సైట్ అడ్రస్ ఎంటర్ చేయటం.. అవసరమైన సమాచారాన్ని తెలుసుకోవటం. ఇంతేగా? మనం రోజూ చేసేది.

కానీ ఇప్పుడు బ్రౌజర్ ఏఐతో కలిసి కొత్తరూపు సంతరించుకుంటోందని తెలుసా.?
అంటే కేవలం సెర్చ్ చేయడమే కాక చాట్ చేసే విధంగా మారిపోతోంది. ఇటీవలే పర్ ప్లెక్సిటి కామెట్ అనే ఏఐ ఆధారిత బ్రౌజర్ ను పరిచయం చేసింది. కాగా ఓపెన్ ఏఐ సంస్థ కూడా త్వరలో ఇలాంటి దాన్నే తీసుకురానుంది.

బ్రౌజింగ్ చేయడం వల్ల కావాల్సిన సమాచారం పొందడమే కాక.. దానికి సంబంధించిన అంశాలను పక్కాగా చూపిస్తే.. విశ్లేషణలతో పాటు సంబంధిత వెబ్సైట్లను మన ముందుంచితే ఎలా ఉంటుందనే ఆలోచనకు తగ్గట్టు ఏఐ బ్రౌజర్ అలానే పనిచేయనుంది ఇక. Perplexity AI Comet Browser.

క్రోమియం వేదిక మీద రూపొందించిన ఈ బ్రౌజర్ డిఫాల్ట్ గా ఏర్పాటై.. ఉద్యోగాలు, రిసెర్చ్, ఇతర అవసరాల కోసం ఇంటర్నెట్ వాడుకునేవారిని ఉద్దేశించి డిజైన్ చేయడమైంది. బ్రౌజింగ్ సెషన్లను ఒకే ఒక్క కంటిన్యూడ్ ఇంటరాక్షన్స్ ను, సంక్లిష్ట పనులను తేలికైన సంభాషణలుగా మార్చనుంది. ఉదా; మీటింగు బుక్ చేయడం, చూస్తున్న అంశం మీద ఈ.మెయిల్ పంపడం, రోజంతా చేసిన పనులను రివ్యూ చేయమని మీరు కామెట్ ను అడగొచ్చు. అడిగినట్లె అన్నింటినీ చిటికెలో చేసి పెడుతుంది. అంటే అవసరమైన విషయాన్ని ప్రాంప్ట్ రూపంలో అందిస్తే చాలు.. ఆయా వివరాలను క్లియర్ గా ఇవ్వడమేకాక కోరిన పనులూ చేసేస్తుంది.

ఇందుకోసం బ్రౌజర్ కుడివైపున పైనుంచి కామెట్ ఆసిస్టెంట్ ను యాక్సెస్ చేయొచ్చు. ఇది వెబ్ పేజీ కంటెంట్ ను చూసి, అడిగిన ప్రశ్నలకు జవాబులూ ఇస్తుంది. గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ల మాదిరిగా దీనికి ట్యాబ్ ఇంటర్ఫేస్ అనేది ఉండదు. వర్క్ స్పేస్ ద్వారా సమాచారాన్ని వేగంగా అందిస్తోంది. అందువల్ల యూజర్ దేని కోసం వెతుకుతున్నారో అబ్జర్వ్ చేస్తోంది. సజెషన్స్ మేరకు సమాచారాన్ని ఇస్తుంది. గత సెషన్లలో చేసిన పనులను దృష్టిలో పెట్టుకొని రిలవెంట్ వార్తలను, రిమైండర్లను ఇస్తుంది.

కాగా ఈ కామెట్ బ్రౌజర్ ప్రస్తుతానికి వెయిట్ లిస్టులో సైనప్ అయిన కొద్దిమందికి మాత్రమే అవైలబుల్ లో ఉంది. మీకు కావాలనుకుంటే పర్ పెక్సిటీ మంత్లీ మ్యాక్స్ ప్లాన్ ను (200 డాలర్లు) తీసుకొని, వాడుకోవచ్చు.

Also Read: https://www.mega9tv.com/technology/jack-dorsey-bitchat-will-soon-compete-with-whatsapp-will-work-without-the-need-for-internet/