
Prabhas and Prashanth Varma project: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సంవత్సరానికి రెండు సినిమాలు రిలీజ్ చేయాలి.. ఫ్యాన్స్ ను బాగా ఎంటర్ టైన్ చేయాలని తపిస్తుంటాడు. అందుకనే రెండు, మూడు సినిమాలను ఒకేసారి చేస్తుంటాడు. అయితే.. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడని గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. ఆతర్వాత ఎలాంటి అప్ డేట్ బయటకు రాలేదు. ఇంతకీ.. ఈ ప్రాజెక్ట్ ఉందా..? లేదా..? అసలు ఈ క్రేజీ ప్రాజెక్ట్ వెనకున్న అసలు నిజం ఏంటి..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్, ఫౌజీ సినిమాలు చేస్తున్నాడు. రాజాసాబ్ మూవీని మారుతి తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఇటీవల ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు. దీనికి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 5న ది రాజాసాబ్ మూవీని రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో అనుకున్న టైమ్ కి ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసే బిజీలో ఉన్నారు టీమ్. ప్రభాస్ నటించిన ఫస్ట్ హర్రర్ మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. Prabhas and Prashanth Varma project.
ఇక ఫౌజీ సినిమాని హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నారు. రాజాసాబ్ సమ్మర్ లో రిలీజ్ చేయడం కుదిరితే.. ఫౌజీ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే.. రాజాసాబ్ షూటింగ్ ఆలస్యం అవ్వడం వలన ఫౌజీ మరింత ఆలస్యం అవుతుంది. దీంతో ప్రభాస్ సినిమాల ప్లానింగ్ అంతా మారింది. రాజాసాబ్, ఫౌజీ ఎప్పుడు కంప్లీట్ అవుతాయా..? సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ మూవీని పట్టాలెక్కించాలని వెయిట్ చేస్తున్నాడు డార్లింగ్ ప్రభాస్. త్వరలోనే స్పిరిట్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసి ఫాస్ట్ గా కంప్లీట్ చేయడానికి సందీప్ పక్కా ప్లాన్ రెడీ చేశాడు.
ఇక అసలు విషయానికి వస్తే.. ఆమధ్య ప్రశాంత్ వర్మ చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేస్తానని మాట ఇచ్చాడట ప్రభాస్. రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ కంప్లీట్ అయితే.. కల్కి 2, సలార్ 2 చేయాలి. ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి టైమ్ పడుతుంది. అందుచేత ప్రశాంత్ వర్మ్ ప్రాజెక్ట్ ను ప్రస్తుతానికి పక్కనపెట్టాడని తెలిసింది. దీంతో ఇన్ని రోజులు ఈ సినిమా స్టార్ట్ చేయాలని వెయిట్ చేసిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు వేరే ప్రాజెక్టుల పై ఫోకస్ పెట్టాడని తెలిసింది. ప్రభాస్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉండడంతో డేట్స్ కోసం ఎంతో ఓపిగ్గా వెయిట్ చేయాలి. మరి.. ప్రభాస్, ప్రశాంత్ వర్మ కాంబో మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.