రిలీజ్ కు ముందే రికార్డ్ క్రియేట్ చేస్తోన్న వీరమల్లు!

Power Star Veeramallu movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటించిన ఫస్ట్ పాన్ ఇండియామూవీ హరి హర వీరమల్లు. క్రిష్‌, జ్యోతికృష్ణ తెరకెక్కించిన వీరమల్లు చిత్రం ఈ నెల 24న భారీ స్థాయిలో రిలీజ్ కి రెడీ అయ్యింది. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ మరింత క్రేజ్ పెరుగుతుంది. పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన నుంచి వస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఓపెనింగ్ మాత్రం వేరే లెవల్లో ఉంటుందని అభిమానులే కాదు.. ట్రేడ్ వర్గాల్లో కూడా గట్టిగా టాక్ వినిపిస్తోంది. అయితే.. ఈ వీరమల్లు విడుదల కాకుండానే రికార్డులు సెట్ చేస్తుందని తెలిసింది. ఇంతకీ.. వీరమల్లు నయా రికార్డ్ ఏంటి..?

వీరమల్లు రాకకు డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ లో మరింతగా స్పీడు పెంచారు. హీరోయన్ నిథి అగర్వాల్, డైరెక్టర్ జ్యోతికృష్ణ, నిర్మాత ఏఎం రత్నం ఇంటర్ వ్యూలు ఇస్తూ.. వీరమల్లును మరింతగా జనాల్లోకి తీసుకెళుతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో అంచనాలు మరింతగా పెరగడం ఖాయం. అయితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటర్ వ్యూలు ఇస్తారా..? ఈ సినిమాని ప్రమోట్ చేస్తారా..? ఆయనకు అంత టైమ్ ఉందా..? అనేది ఆసక్తిగా మారింది. అయితే.. ఆయన సినిమాని ప్రమోట్ చేయడానికి మీడియా ముందుకు రావడం విశేషం. తాజా సమాచారం ప్రకారం.. ఆయన తో కామన్ ఇంటర్ వ్యూ చేసి అందరికీ ఇచ్చే ప్లానింగ్ లో మేకర్స్ ఉన్నారని తెలిసింది. Power Star Veeramallu movie.

ఇక రికార్డుల విషయానికి వస్తే.. పవర్ స్టార్ కు ఉత్తరాంధ్రలో ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఉత్తరాంధ్రలో మొత్తం 150 థియేటర్స్ ఉంటే.. అందులో ఏకంగా 135 థియేటర్స్ లో వీరమల్లు సినిమాని రిలీజ్ చేస్తున్నారట. ఇంత వరకు ఇలా ఏ సినిమాకి జరగలేదట. ఫస్ట్ టైమ్ అక్కడ 135 థియేటర్స్ లో వీరమల్లు సినిమాను రిలీజ్ చేస్తున్నారని సమాచారం. ఇది ఒక రోజు రెండు రోజులు కూడా.. వారం రోజులు పాటు 135 థియేటర్స్ లో వీరమల్లును ప్రదర్శించనున్నారని తెలిసింది. ఇది ఉత్తరాంధ్రలో హయ్యస్ట్ స్క్రీన్స్ లో రిలీజైన సినిమాగా వీరమల్లు రికార్డ్ క్రియేట్ చేసిందని సమాచారం.

పవన్ కళ్యాణ్‌ నుంచి సినిమా వచ్చి చాలా రోజులు అయ్యింది. పైగా ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన నుంచి ఫస్ట్ టైమ్ వస్తున్న సినిమా కావడంతో డే 1 హయ్యస్ట్ కలెక్షన్స్ రావడం ఖాయమని సినీ పండితులు చెబుతున్నారు. ప్రీమియర్స్ కూడా భారీగా ప్లాన్ చేశారు. అందుచేత.. ప్రీమియర్స్, ఫస్ట్ డే కలెక్షన్ కలపి బిగ్ నెంబరే వస్తుందని ఇప్పటి నుంచి వార్తలు వస్తున్నాయి. మొత్తానికి పవర్ స్టార్ అభిమానుల ఆకలి తీర్చే సినిమా వీరమల్లు. ఐదేళ్లు ఈ మూవీ టీమ్ పడిన కష్టానికి తగిన ఫలితం రావడం ఖాయం. అయితే.. ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో.. ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/who-is-natural-star-nanis-next-movie-with-is-nani-going-to-do-a-movie-with-maruthi/