ఈ ఇయర్ లో రానున్న సినిమాల రిలీజ్ డేట్స్ ఇవే..!

Release dates of upcoming movies 2025: ఇప్పుడే 2025 స్టార్ట్ అయినట్టు ఉంది. అప్పుడే ఏడు నెలలు కంప్లీట్ అయిపోతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో కొన్ని బ్లాక్ బస్టర్ అవ్వడం.. కొన్ని ప్లాప్ అవ్వడం.. మరికొన్ని డిజాస్టర్స్ అవ్వడం జరిగింది. మరి.. ఈ ఇయర్ లో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి మరిన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి. మరి.. ఆగష్టు నుంచి డిసెంబర్ వరకు ఏ ఏ సినిమాలు రానున్నాయి..? అవి ఎప్పుడు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

బకాసుర రెస్టారెంట్ అనే విభిన్న కథాంశంతో రూపొందిన సినిమా ఆగష్టు 8న విడుదల కానుంది. ఇక కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కాంబినేషన్లో రూపొందిన క్రేజీ మూవీ కూలీ ఆగష్టు 14న విడుదల కానుంది. ఇదే డేట్ కు నార్త్ స్టార్ హృతిక్ రోషన్, సౌత్ స్టార్ ఎన్టీఆర్ కలిసి నటించిన వార్ 2 కూడా భారీ స్థాయిలో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ రెండు సినిమాలు ఒకే రోజున థియేటర్స్ లోకి వస్తుండడం బాక్సాఫీస్ దగ్గర పోటీపడుతుండడం అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ ఆసక్తిగా మారింది. ఇక అనుపమ పరమేశ్వరన్ నటించిన పరదా సినిమా ఆగష్టు 22న రిలీజ్ కానుంది.

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న మూవీ మాస్ జాతర. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. పోస్ట్ పోన్ అయ్యింది. ఇప్పుడు ఆగష్టు 27న విడుదలకు రెడీ అవుతోంది. ఇక తేజ సజ్జ నటించిన మిరాయ్ సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ కి రెడీ అవుతుంటే.. సెప్టెంబర్ 12న ఘాటీ విడుదలకు ముస్తాబు అవుతోంది. అనుష్క కొంత గ్యాప్ తర్వాత నటించిన ఈ సినిమా టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో మూవీ పై మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటించిన క్రేజీ మూవీని సెప్టెంబర్ 25న రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు. సుజిత్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకి డీవీవీ దానయ్య నిర్మాత. Release dates of upcoming movies 2025.

నట సింహం బాలకృష్ణ నటిస్తోన్న మూవీ అఖండ 2. బోయపాటి తెరకెక్కిస్తోన్న అఖండ 2 సినిమాని కూడా సెప్టెంబర్ 25నే విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే.. ఈ మూవీ రిలీజ్ డేట్ మారే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. సెప్టెంబర్ 25న రావడం కుదరకపోతే.. డిసెంబర్ లో అఖండ 2 వచ్చే ఛాన్స్ ఉంది. మెగాస్టార్ మేనల్లుడు సాయిదుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమా కూడా సెప్టెంబర్ 25న రిలీజ్ అని ప్రకటించారు కానీ.. ఓజీ వస్తుండడంతో తేజ్ సినిమా పోస్ట్ పోన్ చేయనున్నారు. ఎప్పుడు రిలీజ్ అనేది క్లారిటీ రావాల్సింది. కుదిరితే ఈ ఇయర్ లోనే విడుదల చేస్తారని సమాచారం. కాంతార చాప్టర్ 1 అక్టోబర్ 2న, సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా సినిమాని అక్టోబర్ 17న, కే ర్యాంప్ అక్టోబర్ 18న, ప్రభాస్ ది రాజాసాబ్ డిసెంబర్ 5న, అడవి శేష్ డెకాయిట్ డిసెంబర్ 25న రిలీజ్ కానున్నాయి. మరి.. ఈ సినిమాల్లో ఏ ఏ సినిమాలు బ్లాక్ బస్టర్స్ సాధిస్తాయో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/mallidi-vassishta-who-told-the-story-to-rajinikanth-about-baashha-sequel-2/