దటీజ్.. పవర్ స్టార్!

Power Star’s Veeramallu Promotion: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌.. వీరమల్లు సినిమాని ప్రమోట్ చేయడం కోసం రంగంలోకి దిగారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కంటే ముందుగా మీడియా ముందుకు వచ్చారు. అయితే.. పవర్ స్టార్ వస్తున్నారని తెలిసినప్పటి నుంచి మీడియా అలెర్ట్ అయ్యింది. క్యూ అండ్ ఏ ఉంటుంది ఏమో.. పవన్ పై తమ ప్రశ్నలను సంధించాలని చూసిన మీడియా జనాలకు నిరాశే ఎదురైంది. అయితే.. పవన్ మాటలతో మాత్రం అందరి మనసు దోచుకున్నారు. దటీజ్ పవర్ స్టార్ అనిపించారు. ఇంతకీ.. అంతలా పవన్ స్పీచ్ లో ఏముంది..?

హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు మీడియా మీట్ లో పవర్ స్టార్ దాదాపు 20 నిమిషాల పాటు సుదీర్ఘంగా మాట్లాడారు. మీడియాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే కొంత మంది పాత్రికేయుల పేర్లు కూడా ప్రస్తావించడం విశేషం. నేను చిన్న హీరోని.. నాకంటే పెద్ద హీరోలు ఉన్నారు. వాళ్ల‌తో పోలిస్తే.. నా మార్కెట్ త‌క్కువ‌. నాకొచ్చే వ‌సూళ్లు త‌క్కువ‌ అని పవన్ కళ్యాణ్‌ వ్యాఖ్యానించ‌డం అంద‌రికీ ఆశ్చ‌ర్యం కలిగించింది. ప్ర‌భాస్‌, అల్లు అర్జున్ తదితర హీరోలు వంద‌లు, వేల కోట్ల క్ల‌బ్ లోకి చేరిపోతున్నారు. వాళ్ల‌తో పోలిస్తే.. ఈ రేసులో ప‌వ‌న్ వెనుక‌బ‌డిన మాట నిజం. Power Star’s Veeramallu Promotion.

అయితే.. పవ‌న్ స్థాయి వేరు.. స్టామినా వేరు. ప‌వ‌న్ సినిమా ఫ్లాప్ అయినా, ఆయ‌న తొలి రోజు వ‌సూళ్లు మిగిలిన హీరోల వీకెండ్ వ‌సూళ్ల‌కు తీసిపోవు. వరుసగా ఎన్ని ఫ్లాపులు ఇచ్చినా.. ఎన్ని సంవత్సరాలు సినిమా చేయకపోయినా.. వెనకబడడం అనేది జరగదు. ఆయన రాజకీయాల్లోకి వెళ్లడం వలన సినిమాలపై ఫోకస్ పెట్టడం లేదు కానీ.. ఆయన కనుక కాన్ సన్ ట్రేషన్ చేసుంటే.. అద్భుతమైన కాంబినేషన్లో.. అద్భుతమైన సినిమాలు చేసేవారు. అయితే.. ఏ స్థాయికి వెళ్లినా సినిమాని.. సినిమా వాళ్లని మరచిపోకుండా గుర్తుంచుకోవడం.. తన స్థాయి గురించి తన సినిమాల మార్కెట్ గురించి నిజాయితీగా మాట్లాడడం అభినందనీయం.

వీరమల్లు సినిమా ప్రమోషన్స్ కోసం పవన్ కళ్యాణ్‌ వస్తారో రారో అనే కామెంట్లు వినిపించాయి. అయితే.. రంగంలోకి దిగి ప్రమోట్ చేయడం.. నిజాయితీగా మాట్లాడడంతో అందరీ మనసులు దోచుకున్నారు పవర్ స్టార్. ఈ మీడియా మీట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ తో వీరమల్లు సినిమా పై మరింత క్రేజ్ పెరిగింది. ఈ నెల 24న భారీ స్థాయిలో రిలీజ్ కి అంతా సిద్దమైంది. భారీ స్థాయిలో ప్రీమియర్స్ వేస్తుండడంతో.. ఫస్ట్ డే కలెక్షన్స్ భారీగా ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి.. వీరమల్లు బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం ఎలా ఉంటుందో.. ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/sai-dharam-tejs-sambarala-yetigattu-release-date-and-updates/