వేధింపులపై ఏఐ అస్త్రం..!

AI New Form For protection of women: అన్నిరంగాల్లో తనదైన సత్తా చాటుతున్న ఏఐ ఇప్పుడు మహిళల రక్షణ కోసం సరికొత్త రూపు దాల్చింది. మరీ ముఖ్యంగా కార్యాలయాల్లో, ఆఫీసుల్లో వేధింపులకు గురవుతున్న మహిళలకు రక్షణ అనేది కరవైంది. ఈ నేపథ్యంలో వేధింపులకు గురైన వారి సమస్యను గుర్తించడం, నిరోధించడంతో పాటు పరిష్కరించడంలోనూ ముందున్నది. ఏళ్లకేళ్లుగా ఎన్ని యాక్షన్స్ తీసుకుంటున్నా.. కార్యాలయాల్లో మహిళలపై వేధింపులనేవి తగ్గడం లేదు. కౌన్సెలింగ్, శిక్షణలు, అవేర్నెస్ కల్పించే ప్రోగ్రామ్స్ ఎన్ని కండక్ట్ చేసినా.. వేధింపులు ఆగడం లేదు.

పెళ్లైనవారు ఇంట్లోకి భర్త ఇన్కమ్ కి తమ సంపాదన కూడా హెల్ప్ ఫుల్ గా ఉండేందుకనీ.. అమ్మానాన్నల కోసమో, కెరీర్ బాగుంటుందనో అమ్మాయిలు ధైర్యంగా ఉద్యోగాలు చేస్తున్నారు. చిరు ఉద్యోగాల నుంచి కార్పొరేట్ రంగంలోనూ కొనసాగుతున్నారు. అటువంటి తరుణంలో కార్యాలయాల్లో వేధింపుల కారణంగా ఎవరితోనైనా చెబితే పరువు పోతుందనీ, తమ కెరీర్ కే ఇబ్బంది అని కంప్లైంట్ చేయడానికి భయపడుతున్నారు. ఒకవేళ కాదనీ ధైర్యంగా ఫిర్యాదు చేసినా, న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. ఈ సమస్యకు.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మంచి పరిష్కారం చూపుతుందని ఇటీవల సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో నెమ్మదిగా, పక్షపాతంగా సాగే న్యాయ చర్యలు, మానవ జోక్యంపై ఆధారపడటానికి బదులుగా పూర్తిగా ఏఐతో తక్షణ న్యాయం పొందొచ్చని అంటున్నారు.

ఇప్పటికే ఉమ్ వెల్ట్.ఏఐ రూపొందించిన ఏఐ ఆధారిత ‘లీఫ్ లైజనింగ్ ఆఫీసర్’ అయిన నికీ… కార్యాలయాల్లో జరిగే వేధింపులపై రిపోర్ట్స్ తయారుచేస్తుంది. ఈ క్రమంలో ఉద్యోగుల మనోభావాలను విశ్లేషించడంతోపాటు మహిళల అభిప్రాయాలనూ కలెక్ట్ చేస్తుంది. ఈ.మెయిల్స్ చెక్ చేయడం, చాట్ సెషన్లను స్కాన్ చేయడం ద్వారా ఎవరైనా వేధింపులకు గురవుతున్నారా? లేదా? అనే విషయాలను కనిపెట్టనుంది. AI New Form For protection of women.

అతిగా వేధింపులకు గురైనవారు ఎదుర్కొనే సమస్యలు రిపోర్టింగ్, పక్షపాతం. కాగా ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ ఫిర్యాదులను నిష్పక్షపాతంగా విచారిస్తుంది. జెండర్, డిపార్ట్మెంట్, సీనియారిటీ లాంటి ఐడెంటిటీస్ అన్నిటినీ తొలగిస్తుంది. కేసులను వాస్తవాల ఆధారంగా రివ్యూ చేస్తుంది. తద్వారా బాధితులకు సత్వర న్యాయం చేకూరుతుంది.

కంప్లయింట్ చేస్తే ఎక్కడ తమపై రివెంజ్ చర్యలకు పాల్పడతారోనన్న భయం కూడా అక్కర్లేకుండా ఏఐ ఆధారిత వర్చువల్ అసిస్టెంట్లు ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచడంలో మేటిగా పనిచేయనుంది. వారికావల్సిన న్యాయపరమైన సజెషన్స్, మానసికంగా బెటర్ అయ్యేందుకు కావాల్సిన కౌన్సెలింగ్ వంటివి కూడా అందిస్తోంది.

Also Read: https://www.mega9tv.com/technology/airtel-perplexity-to-launch-an-ai-browser-comet-which-is-gonna-compete-with-google-chrome/