ఇంస్టా రీల్స్.. ఇక ఆగవు.. త్వరలో ఆటో స్క్రోల్ ఆప్షన్ రానుంది!

Instagram Introduces auto scroll option: సోషల్ మీడియాలో ప్రస్తుతం రీల్స్ ట్రెండ్ నడుస్తోంది. అప్ కమింగ్ మూవీలో నుంచి సాంగ్ అయినా.. ఒకరు చేశారని మరొకరు చేస్తూ.. ట్రెండింగ్ ను బీట్ చేసేలా రీల్స్ ట్రెండ్ అనేది నడుస్తోంది. ఇంస్టాగ్రామ్ వచ్చిన తర్వాత

స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ దానికే అడిక్ట్ అయిపోయారు. ఎంతలా అంటే రోజూ ఏ కాస్త టైం దొరికినా.. రీల్స్ చూడటం, షేర్ చేయడం అనేది పరిపటైంది. కొందరు రీల్స్ అప్లోడ్ చేయడమే పనిగా పెట్టుకుంటే.. కొందరు రీల్స్ చూడటమే తప్ప ఇంకో పనిలేదన్నట్లుగా మారిపోయారు. ఒక్కసారి రీల్స్ చూడటం మొదలు పెడితే మనసు అనుకోకుండా ఇంకో రీల్ చూడాలనుకుంటుంది. అలా ఎంత టైం గడిచిపోతుందో కూడా తెలియదు. అడిక్షనో, టైంపాసనో తెలియదు కానీ.. రీల్స్ చూసేవారికి ఇబ్బంది లేకుండా ఇన్ స్టాగ్రామ్ మరో సరికొత్త ఫీచర్ తో యూజర్లకి ఇబ్బంది లేకుండా చేయనుంది.

ఇప్పటివరకు రీల్స్ చూసే సమయంలో ఒక రీల్ చూశాక మరో రీల్ చూడాలంటే చేతి వేళ్లతో స్క్రోల్ చేసేవాళ్ళం. ఇకనుంచి ఆ శ్రమ కూడా అక్కర్లేకుండా.. వేళ్లతో స్క్రోల్ చేసే పనిలేకుండా ఆటో స్క్రోల్ అనే ఆప్షన్ ను తీసుకొస్తోంది. దీంతో మనం స్క్రోల్ చేయకుండానే ఇంకో రీల్ ఆటోమేటిక్ గా ప్లే అవుతుందన్నమాట. Instagram Introduces auto scroll option.

ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే క్రియేటర్లకు ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. కొద్ది టైంలోనే ఎక్కువ కంటెంట్ యూజర్ చూస్తే అల్గారిథమ్ లోనూ రీచ్ బాగుంటుంది. అయితే దీని ఉపయోగం విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలోనే రోజంతా గడిపే ప్రమాదాన్ని కొనితెచ్చినట్లవుతుంది.

ఎందుకంటే మనం స్క్రోల్ చేయకుండానే కంటెంట్ ముందుకు పోతుంటే ఎక్కడ ఆగాలనిపించదు. దీంతో యూజర్లు రీల్స్ కు మరింత అడిక్ట్ అయ్యేందుకే ఎక్కువ ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ టెస్టింగ్ స్టేజ్ లోనే ఉంది. టెస్టింగ్ లో సక్సెస్ అయితే గనుక త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుంది.

Also Read: https://www.mega9tv.com/technology/ai-which-is-proving-its-power-in-all-fields-has-now-taken-on-a-new-form-for-the-protection-of-women/