చిన్నారులకోసం విజ్ఞానం అందించే.. బేబీ గ్రోక్.. త్వరలో రానుంది!

Elon Musk’s Baby Grok: టెస్లా దిగ్గజం ఎలాన్ మస్క్.. ఇప్పుడు చిన్నారుల కోసం విజ్ఞానదాయకమైన కంటెంట్ ను అందించేందుకు స్పెషల్ గా ఒక చాట్ బాట్ ను డెవలప్ చేస్తున్నట్లు ఇటీవల తెలిపారు. దీని పేరు బేబీ గ్రోక్.

ఈ యాప్‌ ప్రధానంగా పిల్లలకు సంబంధించి నాలెడ్జ్ ను పంచే కంటెంట్‌ను అందిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాట్‌బాట్‌ల కంటే బేబీ గ్రోక్ మరింత సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఉండనుంది.

ప్రస్తుతమున్న గ్రోక్‌ కంటే మరింత సులువుగా ఉండేలా బేబీ గ్రోక్‌ను డిజైన్ చేస్తున్నారట. ముఖ్యంగా పిల్లలకు తగిన కంటెంట్ ఇందులో అందుబాటులో ఉండేలా తయారు చేస్తున్నారు.

గ్రోక్‌ను 2023లో లాంచ్ చేయగా.. ఓపెన్ ఏఐకి చెందిన చాట్‌జీపీటీ, గూగుల్‌కు చెందిన జెమినీ, మెటాకు చెందిన లామాకు ఆల్టర్నేట్ గా దీన్ని డిజైన్ చేశారు. ప్రస్తుతం గ్రోక్‌లో డీప్ సెర్చ్, థింక్, బిగ్ మైండ్ అనే మూడు మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఎంతటి వివరమైన సమాధానం కావాలో అనే దాన్ని బట్టి యూజర్లు ఈ మూడింట్లో ఏదో ఒక మోడ్‌ను ఎంచుకుని గ్రోక్‌ను ఏదేని ప్రశ్నలు అడగొచ్చు. లేటెస్ట్ వర్షన్ అయిన గ్రోక్-4 ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. Elon Musk’s Baby Grok.

పీహెచ్‌డీ స్థాయి ప్రశ్నలకు కూడా ఈ వర్షన్ సమాధానాలు ఇస్తుందట. భవిష్యత్తులో ఇది కొత్త విషయాలను కనుగొన్నా ఆశ్చర్యపోనక్కర్లేదని మస్క్ అన్నారు. ఆ తరువాత గ్రోక్ యూదు వ్యతిరేక కంటెంట్‌ను షేర్ చేయడం కాంట్రవర్సీకి దారి తీసింది. దీంతో గ్రోక్ పై నెగేటివిటి వచ్చింది. ఇది పక్కన పెడితే బేబీ గ్రోక్ ప్రకటనను అనేకమంది స్వాగతించారు. చాట్‌జీపీటీకి బదులుగా ఈ యాప్ ను తమ పిల్లలకు సూచిస్తామని పలువురు తల్లిదండ్రులు అన్నారు. ఇక ఈ కొత్త టూల్ ఫీచర్స్, ఎలా పని చేస్తుందో వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read: https://www.mega9tv.com/technology/the-government-is-warning-about-cybercrime-and-telling-people-not-to-download-screen-sharing-apps/