యూట్యూబ్ ‘హైప్‌’.. మాములుగా లేదుగా!

YouTube Hype A New Feature: భారత్ లో యూట్యూబ్ ఇటీవల హైప్ (YouTube Hype) అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇది కంటెంట్ క్రియేటర్లకు వారి ఛానెల్‌ను ఎక్స్ ఫ్లోర్ చేసేందుకు.. కొత్త ప్రేక్షకులను చేరుకొని, ఆదాయాన్ని పెంచుకునేందుకు సరికొత్త అవకాశాన్ని అందిస్తుంది.

యూట్యూబ్ లో రోజుకో రకం కంటెంట్ తో.. కొత్త యూట్యూబర్లు మనకు తారసపడుతూనే ఉంటారు. యూట్యూబ్ ఫ్యామిలీగా మారిన మరికొందరికీ.. అప్పుడే యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేసినవారికి.. ఈ హైప్ ఫీచర్ అనేది తమ ఛానెల్ ను మరింత హైప్ చేసేందుకు ప్రత్యామ్నాయంగా మారనుంది. కాగా ఈ ఫీచర్ ప్రధానంగా 500 నుంచి 5,00,000 సబ్‌స్క్రైబర్లు కలిగిన క్రియేటర్స్ కి వర్తించనుంది. YouTube Hype A New Feature.

హైప్ ఫీచర్ ఉద్దేశం..
హైప్ అనేది యూట్యూబ్‌లో ఒక కొత్త ఎంగేజ్‌మెంట్ ఫీచర్. ఇది వీక్షకులు తమకు ఇష్టమైన వీడియోలను హైప్ చేయడానికి పర్మిషన్ ఇస్తుంది. ఇది లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ బటన్‌లతో పాటు మరో కొత్త సపోర్ట్ ఆప్షన్ ఇస్తోంది. ప్రస్తుతం చిన్న కంటెంట్ సృష్టికర్తలకు కొత్త ప్రేక్షకులను చేరుకోవడం తరచూ సవాలుగా మారుతుంది. కాబట్టి అలాంటివారు ఈ హైప్ ఫీచర్ ద్వారా వ్యూస్ ను పెంచుకోవచ్చు.

వీడియో పబ్లిష్ అయిన వారంలో వీక్షకులు హైప్ బటన్‌ను క్లిక్ చేయవచ్చు. దీనిద్వారా వీడియోకు పాయింట్లు లభిస్తాయి. ఈ పాయింట్లు మీ వీడియోను యూట్యూబ్ ఎక్స్‌ప్లోర్ ట్యాబ్‌లోని టాప్ 100 హైప్ వీడియోల లీడర్‌బోర్డ్‌లో ర్యాంక్ పొందేలా చేస్తోంది.

ఉదాహరణకు, 500 సబ్‌స్క్రైబర్లు ఉన్న ఛానెల్‌కు ఒక హైప్‌కు ఎక్కువ బోనస్ పాయింట్లు లభిస్తాయి. ఇది 4,00,000 సబ్‌స్క్రైబర్ల ఛానెల్‌తో పోలిస్తే ఎక్కువ బెనిఫిట్ పొందుతుంది. లీడర్‌బోర్డ్‌లో టాప్ ప్లేస్ లో ఉన్న వీడియోలు యూట్యూబ్ హోమ్ ఫీడ్‌లో ప్రమోట్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల కొత్త వీక్షకులను త్వరగా చేరుకుంటారు, ఛానెల్ కూడా స్పీడ్ గా గ్రో అవుతుంది.

  • హైప్ ఫీచర్ వీక్షకులకు తమకు ఇష్టమైన క్రియేటర్లకు సపోర్ట్ చేసే ఛాన్స్ ను ఇస్తుంది. ఈ క్రమంలో ఒక క్రియేటర్ వారానికి మూడు వీడియోలను ఉచితంగా హైప్ చేసుకోవచ్చు.
  • ఇది క్రియేటర్స్ బ్రాండ్‎ను పెంచడంతోపాటు వీక్షకుల సపోర్ట్ కూడా ఛానెల్ విజయానికి దోహదపడేలా చేస్తుంది.
  • హైప్ చేయబడిన వీడియోలు కొన్నిసార్లు స్పెషల్ బ్యాడ్జ్‌లను పొందుతాయి. ఇది క్రియేటర్లను మంచి కంటెంట్‌ను జెనరేట్ చేసేలా ఎంకరేజ్ చేస్తోంది.
  • చిన్నస్థాయి క్రియేటర్స్ కి, వారి ఆడియెన్స్ ఏ కంటెంట్‌ను ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవడానికి డేటాను కూడా అందివ్వనుంది.
  • భలే క్రేజీ అండ్ యూస్ ఫుల్ గా ఉంది కదూ!

Also Read: https://www.mega9tv.com/technology/elon-musk-introduces-baby-grok-an-educational-app-for-childrens-is-coming-soon/