నాని ప్యారడైజ్ టార్గెట్ ఇదేనా..?

Nani’s new movie Paradise: నేచురల్ స్టార్ నాని కెరీర్ స్టార్టింగ్ నుంచి కొత్తదనం కోసం తపిస్తూనే ఉన్నాడు. కథను నమ్మి సినిమాలు చేసే హీరోల్లో నాని ముందు వరుసలో ఉంటాడు. స్టార్ డైరెక్టర్స్ వెంటపడడు.. కొత్తవాళ్లతో సినిమా చేయడానికే ఎక్కువ ఇష్టపడుతుంటాడు. ఇప్పుడు ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్. ప్రస్తుతం ప్యారడైజ్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా రెగ్యులర్ సినిమా కాదు.. ఇదొక డిపరెంట్ మూవీ… ఈ సినిమా టార్గెట్ ఏంటి అనేది బయటకు వచ్చింది. ఇంతకీ.. ప్యారడైజ్ టార్గెట్ ఏంటి..?

నాని హిట్ 3 సినిమా తర్వాత విభిన్న కథ అయిన ప్యారడైజ్ మూవీ చేస్తున్నాడు. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో దసరా సినిమా రూపొందడం.. ఆ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరడం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ కలసి సినిమా చేస్తుండడం ఆసక్తిగా మారింది.. మరింతగా అంచనాలు పెంచేసింది. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన ప్యారడైజ్ గ్లింప్స్ అందరిలో క్యూరియాసిటీని పెంచేసింది. ఇంత వరకు నాని మాత్రమే కాదు.. ఏ హీరో చేయనటువంటి పాత్రను చేస్తున్నాడనే విషయం క్లియర్ గా క్లారిటీ వచ్చేసింది. ఇంకా చెప్పాలంటే.. నాని ట్రాన్స్ జెండర్ క్యారెక్టర్ లో కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది. Nani’s new movie Paradise.

అయితే.. నాని ప్యారడైజ్ టార్గెట్ ఏంటంటే.. నేషనల్ అవార్డ్ అని ప్రచారం జరుగుతోంది. నేషనల్ అవార్డ్ ను గురిపెట్టే.. ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్ ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. నాని క్యారెక్టర్.. యాక్టింగ్ అంతా కూడా వేరే లెవల్లో ఉంటుదని ఫిల్మ్ నగర్ లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు చేసిన షూట్ చేసుకుని మేకర్స్ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారట. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఒక్క తెలుగులోనే కాదు.. పాన్ ఇండియా రేంజ్ లో పెద్ద చర్చ జరుగుతుందని యూనిట్ మెంబర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో ఎక్కువ మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీగా సీన్స్ చిత్రీకరించారట.

ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరూ ఇదేదో రెగ్యుల్ సినిమా అనుకున్నాం కానీ.. కాదు. అందర్నీ ఆలోచింప చేసే సినిమా అని చెబుతున్నారు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.. చక చకా షూటింగ్ చేస్తున్నారు కానీ.. ఇంత వరకు ఇందులో నటించే హీరోయిన్ ఎవరు అనేది మాత్రం బయటకు రాలేదు. ఈ మధ్య భాగ్యశ్రీ పేరు వినిపించింది కానీ.. ఇది నిజమా..? కాదా..? అనేది తెలియాల్సివుంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ సినిమాని రెండు పార్టులుగా తీసే ఆలోచనలో ఉన్నారట. దీనిని బట్టి ఈ సినిమా కథలో ఎంత బలం ఉందో… ఎంతలా కథ పై శ్రీకాంత్ ఓదెల వర్క్ చేసాడో అర్థమౌతుంది. మార్చి 26న ప్యారడైజ్ రిలీజ్ కానుంది. మరి.. ప్యారడైజ్ టార్గెట్ పెట్టుకున్నట్టుగా నేషనల్ అవార్డ్ దక్కిచుకుంటుందేమో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/kamal-enters-the-fray-for-rajini-rajini-nag-upendra-combos-coolie-aamir-khan-to-play-a-guest-role-in-coolie/