పవన్ డైరెక్టర్ తో బాలయ్య మూవీ ఫిక్స్..?

Krish & Balayya’s Aditya 999: నందమూరి బాలకృష్ణ ఏమాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు. ఓ వైపు సినిమాలు.. మరో వైపు రాజకీయాలు.. ఇంకో వైపు టాక్ షోలు.. ఇలా అస్సలు గ్యాప్ ఇవ్వడం లేదు. ప్రస్తుతం అఖండ 2 సినిమా చేస్తోన్న బాలయ్య ఆమధ్య గోపీచంద్ మలినేనితో సినిమాని కన్ ఫర్మ్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు బాలయ్య పవన్ డైరెక్టర్ తో సినిమా ఓకే చేసాడనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఇంతకీ.. పవన్ డైరెక్టర్ ఎవరు..? బాలయ్య చేయబోయే సినిమా ఏంటి..?

పవన్ డైరెక్టర్ ఎవరో కాదు.. క్రిష్‌. ఇప్పుడు బాలయ్య.. క్రిష్ తో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడని వార్తలు వస్తున్నాయి. బాలయ్య, క్రిష్ కలిసి గౌతమీపుత్ర శాతకర్ణి, కథానాయకుడు సినిమాలు చేశారు. ఇందులో గౌతమీపుత్ర శాతకర్ణి సక్సెస్ సాధించగా, కథానాయకుడు సినిమా ప్లాప్ అయ్యింది. అయినప్పటికీ.. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. అందుకనే.. హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా క్రిష్ తో సినిమా చేయడానికి ఓకే చెప్పాడని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అక్టోబర్ లేదా నవంబర్ లో ఈ సినిమా స్టార్ట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది.

అయితే.. బాలయ్యతో క్రిష్‌ చేసే సినిమా ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999. ఈ క్రేజీ మూవీని సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించాలి అనుకున్నారు. ఆతర్వాత తనే డైరెక్ట్ చేస్తానని బాలయ్య చెప్పారు. ఇప్పుడు ఆ బాధ్యతను క్రిష్‌ అప్పగించారని తెలిసింది. క్రిష్ వర్కింగ్ స్టైల్ గురించి బాలయ్యకు బాగా తెలుసు. ముఖ్యంగా ఆయన చాలా స్పీడుగా సినిమాలు తీస్తుంటారు. ఆ స్పీడే బాలయ్యకు బాగా నచ్చుంటుంది. ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్ట్ వార్తల్లో ఉంది. ఇప్పుడు పట్టాలెక్కడానికి రంగం సిద్ధమౌతుంది. ఈ సినిమాని క్రిష్ స్నేహితుడు రాజీవ్ రెడ్డి నిర్మిస్తారా..? లేక వేరే నిర్మాత ఎవరైనా నిర్మిస్తారా..? అనేది తెలియాల్సివుంది. Krish & Balayya’s Aditya 999.

బాలయ్య నటిస్తున్న అఖండ 2 సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత మలినేని గోపీచంద్ తో సినిమా చేయనున్నారని వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు క్రిష్ తో చేసే సినిమా గురించి వార్త లీకవ్వడంతో ముందుగా ఎవరితో సినిమా చేస్తారనేది ఆసక్తిగా మారింది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. మలినేని గోపీచంద్ తో సినిమా, క్రిష్‌ తో సినిమా.. ఈ రెండు సినిమాలను ఓకేసారి చేసేలా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. క్రిష్ ప్రస్తుతం ఘాటీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. సెప్టెంబర్ లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఆతర్వాత నుంచి బాలయ్యతో చేసే మూవీ వర్క్ స్టార్ట్ చేస్తాడట. మరి.. బాలయ్య, క్రిష్‌ కలిసి ఈసారి ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/is-rajini-the-villain-in-lokesh-kanagarajs-movie-lokesh-who-directed-the-movie-coolie-with-rajini-will-release-on-august-14th/