
Google Chat GPT Record: టెక్ ప్రపంచంలో చాట్ జీపీటీ రోజురోజుకూ తిరుగులేని వెపన్ లా దూసుకుపోతుంది. యూజర్ల అవసరాలు, సందేహాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని సరికొత్త రీతిలో వారి అవసరాలను తీరుస్తోంది. ఈ విషయాన్ని ఓపెన్ ఏఐ స్వయంగా యాక్సియోస్ పత్రికకు ఇటీవల వెల్లడించింది.
చాట్ జీపీటీ రోజుకు సుమారు 250 కోట్ల ప్రాంప్ట్ లను హ్యాండిల్ చేస్తున్నట్లు చెప్పింది. ఒక్క అమెరికా నుంచే రోజుకు 3.3 కోట్ల ప్రాంప్ట్ లు వస్తున్నాయంటే నమ్ముతారా.? ఇక వార్షిక ప్రాతిపదికన చూస్తే అవి 91వేల కోట్లు అవుతాయని అంచనా. Google Chat GPT Record.
యూజర్ల రోజువారీ ఆన్లైన్ కార్యకలాపాలకు ఈ చాట్ బాట్ కేంద్రంగా ఎలా మారుతోందనడానికి ఉదాహరణగా ఈ రిజల్ట్స్ నిలిచాయి.
అయితే గూగుల్ తో పోలిస్తే ఇప్పటికీ చాట్ జీపీటీ కొంత వెనుకబడి ఉంది. దీనిలో వార్షికంగా 5 లక్షల కోట్ల సెర్చ్ లు మాత్రమే వస్తున్నా… చాట్ జీపీటీ వృద్ధి, వేగం చూస్తే మాత్రం ఫ్యూచర్ లో గూగుల్ కు బలమైన ఆల్టర్నేట్ గా మారే అవకాశం ఉంది.
2023 డిసెంబర్ నాటికి చాట్ జీపీటీ బాట్ వారానికి కేవలం 300 మిలియన్ యూజర్లు మాత్రమే ఉండేవారు. కానీ మూడు నెలల తర్వాత అది 500 మిలియన్లకు చేరింది. పైగా వీరంతా ఉచిత వెర్షన్ వాడేవారే. ఇక చాట్ జీపీటీ కూడా ఏఐ ఆధారంగా పనిచేసే వెబ్ బ్రౌజర్ ను తీసుకొచ్చేందుకు కూడా యత్నిస్తోందని సమాచారం. అది నేరుగా గూగుల్ క్రోమ్ తో కంపీట్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇప్పటికే చాట్ జీపీటీ ఏజెంట్ ను విడుదల చేసింది.