ఆపరేషన్ మహదేవ్ అంటే ఏంటి..?

What is Operation Mahadev: పహల్గాం ఉగ్రదాడి ఘటనకు భారత్ సైన్యం పగ తీర్చుకుందా..? ఈ ఘటనకు కారణమైన ఉగ్రవాదులను మట్టుపెట్టారా..? అసలు జమ్మూకశ్మీర్ లో జరిగిన ఆపరేషన్ గురించి ఎలాంటి వార్తలు బయటకు వచ్చాయి..? ఈ ఆపరేషన్ కు .. ఆపరేషన్ మహాదేవ్ అని ఎందుకు పేరు పెట్టారు..? ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంట్ లో చర్చ జరుగుతున్నప్పుడే ఈ ఎన్ కౌంటర్ జరగడం ఎలా చూడొచ్చు..?

ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత సైన్యం పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి ఉగ్రమూకలపై ఓ కీలక ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్ లో కీలకమైన ఉగ్రవాదులు హతం అయినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఎవరైతే పహల్గాం ఉగ్రదాడలో పాల్గొని.. పర్యాటకులను హతమార్చారో వారిని కూడా సైన్యం మట్టుపెట్టిందని తెలుస్తోంది. జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఆపరేషన్‌ మహాదేవ్‌ లో పహల్గాం దాడితో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను సైనిక దళాలు మట్టుబెట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని సైన్యం ధ్రువీకరించినట్లు చెబుతున్నారు. మరోవైపు హతమైన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకడు గతేడాది సోనామార్గ్‌ టన్నెల్‌లో జరిగిన ఉగ్రదాడికి కారకుడు కాగా, మరొకడు పహల్గాం ఉగ్రదాడిలో అనుమానితుడిగా చెబుతున్నారు.

ఆపరేషన్ మహాదేవ్ ఎలా కొనసాగింది..?
హర్వాన్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల సమాచారంతో నెల రోజులుగా సైన్యం, పోలీసు బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఆపరేషన్‌ కోసం గత కొన్ని రోజులుగా దళాలు పకడ్బందీగా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. దాచిగామ్‌ అడవుల్లో రెండ్రోజుల క్రితం అనుమానాస్పద కమ్యునికేషన్లను భద్రతా దళాలు పసిగట్టాయి. దీనికి తోడు.. స్థానిక సంచార జాతుల వారు కూడా ఉగ్రవాదుల కదలిలపై భారత భద్రతా దళాలకు సమాచారం అందించారు. దీంతో సోమవారం చాలా బృందాలను సైన్యం ఆ ప్రదేశాలకు తరలించింది. 24 రాష్ట్రీయ రైఫిల్స్‌, 4 పారా కమాండోల బృందం ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించింది. భద్రతా బలగాలు అక్కడికి చేరుకోగానే ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు కూడా వారిపై ఎదురుకాల్పులు జరిపింది. ఈ ఉగ్రవాద స్థావరంలో మొత్తం ఐదు నుంచి ఏడుగురు ఉగ్రవాదులున్నట్లు సమాచారం. దట్టమైన అడవిలో ఓ గొయ్యి తవ్వి దానిపై టెంట్‌ వేసుకొని వీరు దాక్కున్నారు. ఈ క్రమంలో గాలింపు చేపట్టిన భద్రతా దళాలకు లిడ్వాస్‌ ప్రాంతంలో తొలిసారి ఉగ్రవాదులు భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరిగాయి. What is Operation Mahadev.

ఆపరేషన్ మహాదేవ్ అని పేరు ఎందుకు పెట్టారు..?
దాచిగామ్‌ సమీంలోని మహాదేవ్‌ పర్వతం ఆధారంగా ఈ ఆపరేషన్‌కు పేరు పెట్టారు. ఎన్‌కౌంటర్‌ జబర్వన్‌-మహదేవ్‌ పర్వతాల మధ్య జరిగింది. అందుకే ఈ పేరు పెట్టారు. ఈ ఆపరేషన్‌ను జమ్మూకశ్మీర్‌ పోలీసులు, భారత సైన్యం, సీఆర్పీఎఫ్‌ సంయుక్తంగా చేపట్టాయి. మృతిచెందిన ముగ్గురూ ఉగ్రవాదులు పాకిస్థాన్ కు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. వీరు లష్కరే తయిబాకు దగ్గర శిక్షణ పొందిన వారిగా అనుమానిస్తున్నారు. ఘటనాస్థలంలో ఏకే-47 రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత జమ్మూకశ్మీర్ లో భద్రతా బలగాలు అనువణువు గాలిస్తున్నాయి. ఉగ్రవాదులు భద్రతా బలగాల ముసుగులో మరిన్ని దాడులు చేయొచ్చనే సమాచారంతో పర్యాటక ప్రాంతాల్లో భద్రతను పెంచారు. పహల్గాం ఉగ్రవాదులకు సహకరించిన వారి ఇళ్లను ధ్వంసం చేశారు. కొందరు అనుమానితులు, ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇది భారీ స్థాయిలో జరిగిన ఎన్ కౌంటర్ గా చెప్పుకొవ్చచ్చు.

పహల్గామ్ ఉగ్రదాడి.. ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంట్ లో చర్చ జరుగుతున్న సమయంలోనే ఈ ఎన్ కౌంటర్ జరగడం కీలకంగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో గల ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బైసరన్‌ లోయ వద్ద ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అతి సమీపం నుంచి కాల్పులు జరిపి 25 మంది పర్యాటకులు, ఓ కశ్మీరీ వ్యక్తి ప్రాణాలు తీశారు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు. అప్పటినుంచి భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట సాగిస్తున్నాయి. లష్కరే తయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ కు చెందిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు. వీరిలో ఒక్కొక్కరి తలపై రూ.20లక్షల వరకు రివార్డును ఇప్పటికే ప్రకటించారు. అటు అమెరికా సైతం టీఆర్ఎఫ్ ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఇది పాకిస్థాన్ కు పెద్ద ఎదురుదెబ్బ అయినా.. పాకిస్థాన్ దొంగ నాటకాలు మాత్రం ఆపలేదు. టీఆర్ఎఫ్ ను ఉగ్రసంస్థగా ప్రకటించినా తమకు ఎటువంటి సమస్య లేదని.. దీనిని తాము స్వాగతిస్తున్నామని మరీ చెప్పింది.

అటు పహల్గాం ఉగ్రదాడి గురించి.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం గురించి ప్రపంచ దేశాల ముందు భారత్ తమ వాణి వినిపించింది. ఎంపీల బృందాలను విదేశాలకు పంపి.. పహల్గాం ఉగ్రదాడి జరిగిన తీరును వివరించింది. దీని ద్వారా పాకిస్థాన్ పైకి మంచిగా మాట్లాడుతూ.. ఉగ్రవాదులకు ఫండింగ్ ఎలా చేస్తుందో వివరించే ప్రయత్నం చేశారు. చాలా దేశాలు ఈ విషయంలో భారత్ కు మద్దతు ప్రకటించాయి. ఈ చర్యల ద్వారా పాకిస్థాన్ కుటిల బుద్ధిన బయటపెట్టే ప్రయత్నం చేసింది భారత్.

Also Read: https://www.mega9tv.com/national/operation-sindoor-debate-in-lok-sabha-what-kind-of-counter-did-rajnath-give-to-the-opposition/