
Has the megastar’s plan changed: మెగాస్టార్ చిరంజీవి ఏజ్ పెరిగినా… స్పీడు మాత్రం అస్సలు తగ్గలేదు.. ఇంకా చెప్పాలంటే.. సినిమాలు చేయడంలో మరింత దూకుడు పెంచారు అని చెప్పచ్చు. ఇటీవల మెగాస్టార్ నాలుగు సినిమాలను ఓకేసారి సెట్స్ పైకి తీసుకువచ్చి యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పుడు మరింతగా వేగం పెంచి సినిమాలు చేయబోతున్నారని తెలిసింది. అలాగే ఆయన ప్లాన్ కూడా మారిందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. మెగాస్టార్ ఏ ఏ సినిమాలు చేయబోతున్నారు..? మారిన మెగాస్టార్ ప్లాన్ ఏంటి..?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వలన పోస్ట్ పోన్ అయ్యింది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వీఎఫ్ఎక్స్ వర్క్ లో మరింత క్వాలిటీ చూపించేందుకు.. ఆడియన్స్ కి విజువల్ వండర్ అనేలా అద్భుత చిత్రం అందించేందుకు మేకర్స్ టైమ్ తీసుకుంటున్నారు. యు.వీ క్రియేషన్స్ ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. పెండింగ్ ఉన్న సాంగ్ కూడా కంప్లీట్ అవ్వడంతో.. త్వరలో రిలీజ్ ఎప్పుడు అనేది ప్రకటించనున్నారు. Has the megastar’s plan changed.
ఈ మూవీతో పాటు ఇప్పుడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనుకున్న ప్లాన్ ప్రకారం షూటింగ్ జరుపుకుంటుంది. సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఈ క్రేజీ మూవీ కంప్లీట్ అయిన తర్వాత దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా చేయాలి. ఆల్రెడీ ఈ సినిమాను అఫిషియల్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అనిల్ రావిపూడితో మూవీ కంప్లీట్ అయిన వెంటనే ఈ సినిమానే స్టార్ట్ చేస్తారనుకుంటే.. ఇప్పుడు బాబీతో సినిమాను ప్రకటించబోతున్నారనే వార్త లీకైంది. ఈ వార్త నెట్టింట వైరల్ అయ్యింది.
చిరంజీవి హీరోగా బాబీ తెరకెక్కించిన వాల్తేరు వీరయ్య సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. ఈ మూవీ తర్వాత చిరు, బాబీ కలిసి మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట. బాబీ వర్కింగ్ స్టైల్ నచ్చడంతో మరో సినిమా చేస్తానని మాట ఇచ్చారట మెగాస్టార్. ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం.. బాబీతో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తుంది. చిరు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని అనౌన్స్ చేస్తారని సమాచారం. ఇలా శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ ముందుగా బాబీతో సినిమా చేసి.. ఆతర్వాత శ్రీకాంత్ ఓదెలతో మూవీ చేసేలా ప్లాన్ మార్చారని తెలిసింది. మొత్తానికి మెగాస్టార్ ఈ వయసులో కూడా మరింత స్పీడుగా సినిమాలు చేస్తుండడం విశేషం.