లోకేష్‌ కనకరాజ్ లైనప్ మామూలుగా లేదుగా..!

Lokesh Kanagaraj’s latest movie Coolie: లోకేష్‌ కనకరాజ్.. ఈ డైరెక్టర్ కు క్రేజ్ మామూలుగా లేదు. ఓ రేంజ్ లో ఉంది. కార్తీతో తీసిన ఖైదీ సినిమాతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ఇప్పుడు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూలీ అనే సినిమానే భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందించారు. ఆగష్టు 14న కూలీ సినిమా రిలీజ్ కానుంది. అయితే.. లోకేష్ కనకరాజ్.. లైనప్ గురించి అదిరింది అంటూ వార్తలు వస్తుండడం ఆసక్తిగా మారింది. ఇంతకీ.. లోకేష్‌ కనకరాజ్ లైనప్ ఏంటి..?

మా నగరం సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన లోకేష్‌ కనకరాజ్.. ఆతర్వాత కార్తీతో తీసిన ఖైదీ సినిమాతో స్టార్ డైరెక్టర్ అయ్యాడు.. అనతి కాలంలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఖైదీ తర్వాత మాస్టర్ సినిమా చేశాడు. ఈ సినిమా సక్సెస్ సాధించింది. ఆతర్వాత యూనివర్శిల్ హీరో కమల్ హాసన్ తో విక్రమ్ సినిమా తీసి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. ఈ మూవీ విజయం సాధించడమే కాకుండా.. తన పేరిట సినిమాటిక్ యూనివర్శ్ ను కూడా క్రియేట్ చేసింది. ఇండియన్ సినిమాలో ఖైదీ, విక్ర‌మ్, లియో సినిమాల‌తో లోకేష్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. Lokesh Kanagaraj’s latest movie Coolie.

ఆగష్టు 14న రానున్న కూలీ సినిమా అయితే.. వేరే లెవల్లో ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే.. కోలీవుడ్ కు ఫస్ట్ 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా అనే ప్రచారం జరుగుతుంది. ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ గా నటిస్తుండడం విశేషం. కూలీ సినిమా తర్వాత లోకేష్ కార్తీతో క‌లిసి ఖైదీ సీక్వెల్ ఖైదీ 2 చేయ‌నున్నారు. మ‌రో 8 నెల‌ల్లో ఖైదీ2 సెట్స్ పైకి వెళ్ల‌నుందని సమాచారం. ఇదిలా ఉంటే.. లోకేష్‌ కనకరాజ్ హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. అవును.. లోకేష్‌ హీరోగా అరుణ్‌ మాతేశ్వరన్ ఓ సినిమా చేస్తున్నాడు. ఖైదీ 2 తర్వాత ఈ మూవీ స్టార్ట్ కానుందని తెలిసింది.

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తో ఓ సినిమా చేయనున్నాడని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ కంప్లీట్ అయ్యేందుకు ఎంత లేదన్నా రెండేళ్లు అయినా పడుతుంది. ఆతర్వాత మరోసారి సూపర్ స్టార్ తో సినిమా చేస్తాడట లోకేష్‌. కూలీ షూటింగ్ టైమ్ లోనే ఓ లైన్ చెబితే ఖచ్చితంగా చేద్దామని రజినీకాంత్ మాట ఇచ్చారట. అలాగే రోలెక్స్, విక్రమ్ 2 కూడా చేయాల్సివుంది. ఇంత బిజీగా ఉన్న లోకేష్ తెలుగు హీరోలతో సినిమా చేసే టైమ్ లేదు. కుదిరితే ప్రభాస్ తో సినిమా చేయాలి అనుకుంటున్నాడు. అలాగే రామ్ చరణ్ తో కూడా లోకేష్‌ సినిమా ఉంటుందని టాక్. మొత్తానికి లోకేష్‌ లైనప్ అదిరింది.. మరి.. తెలుగు హీరోలతో ఎప్పుడు సినిమా చేస్తాడో..?

Also Read: https://www.mega9tv.com/cinema/huge-expectations-on-mahesh-rajamoulis-movie-who-will-maheshs-next-movie-be-with-boyapati-prashanth-neel-or-sandeep-reddy/