మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ రాజీనామా వెనుక హైడ్రామా..!

Jagdeep Dhankar’s resignation: మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా వెనుక చాలా హైడ్రామా నడిచిందట. అంత సులువుగా ఆయన తన పదవిని వదులుకోలేదట. పదవి కట్టబెట్టిన బీజేపీకి ధమ్కీ ఇవ్వాలన్న ఆలోచన చేసిన ధన్కర్, చివరికి కాషాయ పార్టీ సీరియస్ అయిందని తెల్సుకుని ఇంటి ముఖం పట్టినట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

జగదీప్ ధన్కర్. రాజస్థాన్ ప్రాంతానికి చెందిన ధన్కర్ వృత్తిరిత్యా న్యాయవాది. ఆ తర్వాత జనతాదళ్ పార్టీ నుంచి రాజకీయ జీవతం ప్రారంభించిన ధన్కర్, 1989 ఎన్నికల్లో సొంత రాష్ట్రంలోని ఝున్ ఝున్ ఎంపీ సీటు నుంచి గెలిచి అప్పటి ప్రధాని చంద్రశేఖర్ మంత్రి వర్గంలో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన, 1993 రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో కిషన్ గఢ్ సీటు నుంచి ఎంఎల్ఏగా గెలిచారు. ఇక 1998 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఝున్ ఝున్ సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయిన ధన్కర్, 2003లో బీజేపీలో చేరారు. 2008లో శాసనసభ ఎన్నికలకు పార్టీ ప్రచార కమిటీ సభ్యుడిగా పనిచేసిన ఆయన, 2016లో బీజేపీ లీగల్ సెల్ జాతీయ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఇక 2019లో పశ్చిమ బెంగాల్ గవర్నర్ బాధ్యతలు నిర్వహించిన ధన్కర్, 2022లో ఉప రాష్ట్రపతిగా ఎంపికైన ఆయన 2025 జులైలో ఆరోగ్య కారణాలు చూపిస్తూ తన పదవికి రాజీనామా చేశారు.

ధన్కర్ రాజీనామా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేసింది. ఆయన నిర్ణయం మోడీ, అమిత్ షా జోడీలకు గట్టి ఝలక్కే ఇచ్చినట్లు అయింది. ఎందుకంటే, ఉప రాష్ట్రపతి ఎంపిక విషయంలో ధన్కర్ పేరును అప్పట్లోనే సంఘ్ పరివార్ వ్యతిరేకించిందట. ధన్కర్ సంఘ్ నుంచి వచ్చిన వ్యక్తి కానప్పుడు కీలక పదవి ఎందుకిస్తారని సంఘ్ పెద్దలు మోడీ, అమిత్ షాలను నిలదీశారట. అయితే అప్పటికే నిర్ణయం మీడియాలో రావడంతో పరువు పోతుందన్న భయంతో మోడీ, అమిత్ షాలు సంఘ్ పెద్దలకు సర్దిచెప్పుకున్నారట. ఆ తర్వాత నుంచీ ధన్కర్ వేసిన వేషాలు అన్నీఇన్నీ కావని తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినా, ఆ పార్టీలోని ఇద్దరు కీలక వ్యక్తులతో ప్రతి రోజూ టచ్ లోనే ఉంటున్నారట. వారిద్దరిలో ఒకరు జైరాం రమేష్. కాంగ్రెస్ ఫస్ట్ లేయర్ కు చెందిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తితో ధన్కర్ మంతనాలు జరపడం అంటే, చాలా కీలక విషయాల్లో ఆయనతో చర్చిస్తున్నట్లేనని బీజేపీ పెద్దలు ఇప్పుడు వాపోతున్నారట. ధన్కర్ జాట్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఎన్డీయే కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ధన్కర్, సొంత పార్టీకే ఎసరుతెచ్చే పని చేశారట. తన సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు కీలక నేతలను ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడమని పంపాలని చూశారట. అయితే అది మొదట్లోనే తెల్సుకున్న కొందరు బీజేపీ నేతలు ప్రధాని మోడీకి చెప్పడంతో సైలెంట్ అయ్యారట ధన్కర్.

ఆ తర్వాత నుంచీ ధన్కర్ మీద కేంద్ర పెద్దలు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. జైరాం రమేష్ తో ఎన్నిసార్లు కలుస్తారన్న దానిపై కూడా వారు ఆరాతీశారట. ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ పెట్టారు ధన్కర్. దీనికి అన్ని పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. మొదట నుంచీ జస్టస్ వర్మ కేసుపై దూకుడుగా వెళ్తోన్న ధన్కర్, ఆ మీటింగులో కూడా ఆ కేసు గురించి ప్రస్తావన తెచ్చారట. జస్టిస్ వర్మ కేసుపై చట్టపరంగా విచారించి శిక్ష అమలు అయ్యేటట్లు చూడాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. అంతేకానీ, పార్లమెంటులో చర్చకు అనుమతిస్తే న్యాయవ్యవస్థ మీద జనంలో నమ్మకం పోయే పరిస్తితి వస్తుంది. అందుకే పార్లమెంట్లో చర్చకు విపక్షాలు పట్టుపడుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. Jagdeep Dhankar’s resignation.

మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా వెనుక చాలా హైడ్రామా నడిచిందట. అంత సులువుగా ఆయన తన పదవిని వదులుకోలేదట. పదవి కట్టబెట్టిన బీజేపీకి ధమ్కీ ఇవ్వాలన్న ఆలోచన చేసిన ధన్కర్, చివరికి కాషాయ పార్టీ సీరియస్ అయిందని తెల్సుకుని ఇంటి ముఖం పట్టినట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదే సమయంలో బీఏసీ మీటింగులో కేంద్రం కంగుతినే నిర్ణయం తీసుకున్నారు ధన్కర్. జస్టిస్ వర్మపై లోక్ సభలో అభిశంసన తీర్మానం తీసుకురావాలని కాంగ్రెస్ కూటమి పార్టీలు భావించాయి. బీఏసీ మీటింగులో 63 మంది ప్రతిపక్ష ఎంపీలు సంతకాలు చేసిన అభిశంసన తీర్మాన నోటీసు ఇచ్చాయి. ఆ నోటీసును అంగీకరించారు ధన్కర్. అంతేకాదు, మీటింగులోనే ఉన్న కేంద్ర మంత్రులు జే.పీ. నడ్డా, కిరణ్ రిజుజుతో ఓ డైలాగ్ కొట్టారట ధన్కర్. ప్రధాని మోడీకి ఈ నోటీసు విషయం చెప్పి, ఏ రోజు చర్చకు అనుమతి ఇస్తారో తెల్సుకోవాలంటే ఇద్దరు మంత్రులను కోరారట. దీంతో కంగుతిన్న నడ్డా, రిజుజు అక్కడికక్కడే ధన్కర్ కు క్లాస్ పీకారట. దీంతో ఆ మీటింగ్ పూర్తికాకుండానే ముగిసినట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత ధన్కర్ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిసైడైన మోడీ, అమిత్ షాలు, ఆయనతో రాజీనామా చేయించాలని ప్లాన్ చేశారట. ఒకవేళ రాజీనామాకు ధన్కర్ ఒప్పుకోకపోతే, ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టి ఇంటికి పంపాలన్నదే ఫైలన్ ప్లాన్. వెంటనే కొందరు బీజేపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానానికి సంబంధిన ప్రక్రియ, సంతకాలు చేపట్టారట. ఈ విషయం తెల్సుకున్న ధన్కర్, వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గరకు వెళ్లి, మ్యాటర్ మొత్తం చెప్పి, రాజీనామా పత్రం ఇచ్చారట. మ్యాటర్ మొత్తం తెల్సుకున్న ముర్ము, వెంటనే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో మాట్లాడారట. రాజీనామాపై ఏం చేయాలన్న ముర్ము ప్రశ్నకు ఆమోదించమని గోయల్ క్లారిటీ ఇచ్చారట. అంతే, వెంటనే ధన్కర్ రాజీనామా ఆమోదించారు రాష్ట్రపతి ముర్ము. ఇదీ జరిగింది.

Also Read: https://www.mega9tv.com/telangana/the-war-of-words-between-ktr-and-ramesh-opens-a-can-of-worms/