
TEA Dating app hacked: ఆన్ లైన్ లో ఈ మధ్య కాలంలో రకరకాల డేటింగ్ యాప్స్ వస్తున్నాయి. మీరు ఒంటరిగా ఉన్నారా.. మీకు బోరు కొడుతోందా .. అయితే మాతో చాట్ చేయండి అంటూ.. సమాజంలో జనమే లేనట్టు.. ఓ మాట చెప్పుకోవడానికి బయట ఎవరు దొరకరనట్టు ప్రచారం చేస్తున్నాయి ఈ డేటింగ్ యాప్స్ సంస్థ. అయితే ఇలాంటి ప్రచారాలకు పోసపోయి.. ఆన్ లైన్ లో డేటింగ్ యాప్ లకు ఎడిక్ట్ అయితే ఇక అంతే సంగతులు. ఎవరికి తెలియదు కదా అని ఏదిపడితే అది సోషల్ మీడియా డేటింగ్ యాప్ లో సీక్రెట్లు పంచుకుంటే కొత్త చిక్కులు వచ్చి పడతాయి. తాజాగా టీ అనే డేటింగ్ యాప్ లో ఇలా సమాచారం పంచుకున్న మహిళలు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. వారు సీక్రెట్ గా మాట్లాడుకున్నదంతా బయటలకు లీక్ అయిపోయింది..? అబార్షన్ల నుంచి వివాహేతర సంబంధాల వరకు మొత్తం సీక్రెట్లు బయటకు వచ్చేశాయి. ఈ యాప్‌లోని వేలాది యూజర్ల ఫోటోలు, గుర్తింపు కార్డులు కూడా లీక్ అయ్యాయి.. అసలు ఈ డేటా లీక్ ఎలా జరిగింది? లీకైన సమాచారంలో ఏముంది? సంస్థ ఏమి చెబుతోంది? అసలు ఈ డేటింగ్ యాప్‌లు ఎంత వరకు సేఫ్..?
టీ డేటింగ్ యాప్‌లోని లక్షల మంది వినియోగదారుల సమాచారం లీక్ కావడం సంచలనంగా మారింది. ఈ యాప్ బ్యాకెండ్ డేటాబేస్ అన్‌సెక్యూర్డ్‌గా ఉండటం, ఎటువంటి పాస్‌వర్డ్, ఎన్‌క్రిప్షన్ లేకపోవడంతో సమాచారాన్ని మొత్తం హ్యాకర్లు దొంగిలించారు. ఈ డేటాబేస్‌లో యూజర్ల సమాచారం సులభంగా యాక్సెస్ చేయగలిగే విధంగా ఉండటంతో, హ్యాకర్లు దీనిని దుర్వినియోగం చేశారు. హ్యాకర్లు సుమారు 72,000 ఫోటోలను, 1.1 మిలియన్ ప్రైవేట్ మెసేజ్‌లను యాక్సెస్ చేశారు. ఆ తర్వాత వాటిని ఆన్ లైన్ లో పెట్టేశారు.
టీ యాప్ నుంచి లీక్ అయిన డేటాలో సుమారు 72,000 అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి. వీటిలో 13,000 సెల్ఫీలు, గుర్తింపు కార్డులు కూడా ఉన్నట్టు తేలింది. అలాగే 59 వేలకు యాప్‌లోని పోస్ట్‌లు, కామెంట్‌లు, డైరెక్ట్ మెసేజ్‌ల హ్యాకర్లు లీక్ చేశారు. అబార్షన్లు, వివాహేతర సంబంధాలు వంటి సున్నితమైన విషయాలకు సంబంధించిన చాటింగ్ లో లీకైన డేలాలో ఉన్నాయి. కొన్ని చాట్‌లలో యూజర్ల రియల్ పేర్లు, ఫోన్ నంబర్లు, సమావేశ స్థలాలు కూడా ఉన్నాయి. అయితే 2024 ఫిబ్రవరి కంటే ముందు సైన్-అప్ చేసిన యూజర్ల డేటా మాత్రమే లీకైనట్టు గుర్తించారు. TEA Dating app hacked.
టీ డేటింగ్ యాప్ సంస్థ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది. డేటా లీక్ అయిన వెంటనే దీనిని గుర్తించి సరిచేశామని సంస్థ తెలిపింది. సైబర్ సెక్యూరిటీ నిపుణులను నియమించి, సిస్టమ్‌లను సరిచేస్తున్నామని తెలిపింది. ఈ లీక్ ఒక పాత డేటా స్టోరేజ్ సిస్టమ్ నుంచి జరిగినట్లు, కొత్త సిస్టమ్‌లలో ఈ సమస్య లేదని సంస్థ పేర్కొంది. యూజర్లు తమ పాస్‌వర్డ్‌లను మార్చాల్సిన అవసరం లేదని, ఖాతాలను డిలీట్ చేయాల్సిన అవసరం లేదని సంస్థ తెలిపింది. అయితే, ఈ లీక్ వల్ల యూజర్ల గోప్యతకు జరిగిన నష్టం గురించి సంస్థ స్పందిచలేదు.
అలు టీ యాప్ అంటే ఏమిటి?
టీ డేటింగ్ యాప్. సాధారణంగా “టీ” అని పిలవబడే ఈ యాప్, మహిళల కోసం రూపొందించిన ఒక మొబైల్ అప్లికేషన్, ఇది 2023లో విడుదలైంది. ఈ యాప్‌ను షాన్ కుక్ అనే వ్యక్తి స్థాపించాడు. తన తల్లి ఆన్‌లైన్ డేటింగ్‌లో ఎదుర్కొన్న అనుభవాల నుంచి ఈ యాప్ తయారు చేశాడు. ఈ యాప్ మహిళలు తాము డేట్ చేసిన, డేట్ చేస్తున్న, లేదా డేట్ చేయాలనుకుంటున్న పురుషుల గురించి సమాచారాన్ని షేర్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. యూజర్లు పురుషుల ఫోటోలను అప్‌లోడ్ చేయవచ్చు, వారి గురించి రెడ్ ఫ్లాగ్ లేదా గ్రీన్ ఫ్లాగ్ రేటింగ్‌లు ఇవ్వవచ్చు. టీ పార్టీ గ్రూప్ చాట్ ద్వారా అనుభవాలను చర్చించవచ్చు. యాప్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్, బ్యాక్‌గ్రౌండ్ చెక్, సెక్స్ ఆఫెండర్ డేటాబేస్ చెక్ వంటి ఫీచర్లు ఉన్నాయి, 2025 జూలై నాటికి, ఈ యాప్‌కు 4.6 మిలియన్ యూజర్లు ఉన్నారని సంస్థ పేర్కొంది. అయితే ఇలాంటి చాలా డేటింగ్ యాప్స్ అమెరికాలో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో భారత్ లో కూడా పెరుగుతున్నాయి.
కొత్త పరిచయాలు, ఒంటరి తనాన్ని దూరం చేసుకోవడానికి .. తమ డేటింగ్ యాప్ ఇన్ స్టాల్ చేసుకోండని ప్రచారం చేస్తున్నారు. ఈ యాప్‌లలో యూజర్లు ప్రొఫైల్‌లను క్రియేట్ చేస్తారు. ఫోటోలు, వ్యక్తిగత సమాచారాన్ని అప్‌లోడ్ చేస్తారు. స్వైప్ లేదా మ్యాచింగ్ ఆల్గారిథమ్‌ల ద్వారా ఇతర యూజర్లతో కనెక్ట్ అవుతారు. టీ యాప్ వంటి కొన్ని యాప్‌లు మహిళల భద్రతపై దృష్టి పెడితే.. టిండర్, బంబుల్, ఓక్‌క్యూపిడ్ వంటి యాప్‌లు సాధారణ డేటింగ్ కోసం ఉపయోగపడతాయి. అయితే వీటిలో సమాచారం షేర్ చేయడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
భారత్‌లో డేటింగ్ యాప్‌లు ఇటీవల బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రముఖ డేటింగ్ యాప్‌లలో టిండర్, బంబుల్, ఓక్‌క్యూపిడ్, ట్రూలీమ్యాడ్లీ, ఐస్ల్, క్వాక్‌క్వాక్, హింగ్ ఉన్నాయి. భారత్‌లో డేటింగ్ యాప్‌లు చట్టబద్ధమైనవి, కానీ ఇవి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, డేటా ప్రొటెక్షన్ రూల్స్ 2011, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 పరిధిలో పనిచేయాలి. ఈ చట్టాల ప్రకారం యూజర్ డేటా ప్రైవసీ, భద్రతను కాపాడాలి. అయితే ఇవి ఎంత వరకు సెక్యూరో తెలియదు. భారత్‌లో టీ యాప్ పెద్దగా ఉపయోగించనప్పటికీ, దీని డేటా లీక్ భారతీయ యూజర్లను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ యాప్ గ్లోబల్ యూజర్ బేస్‌ను కలిగి ఉంది.