
ISRO & NASA’s Naisar satellite: నాసా ప్రయోగించిన నైసార్ ఉపగ్రహ ప్రయోగం సక్సెస్ అయింది. జీఎస్ఎల్వీ ఎఫ్ 16 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లాలోని సతీస్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన ఈ ఉపగ్రహాన్ని ఇస్రో, నాసా కలిసి ప్రయోగించాయి. సింథటిక్ ఎపెర్చెర్ రాడార్ సిస్టం ఉన్న ఈ ఉపగ్రహం కోసం నాసా 1 పాయింట్ 16 బిలియన్ డాలర్లు సమకూర్చింది.
అలాగే భారత్ కూడా 90 మిలియన్ డాలర్లు కేటాయించింది. ఇప్పటి వరకూ ప్రపంచ దేశాలు ప్రయోగించిన ఉపగ్రహాల్లో ఇదే అత్యంత ఖరీదైన శాటిలైట్ గా రికార్డ్ ఎక్కనుంది. ISRO & NASA’s Naisar satellite.