
Pawan Kalyan’s OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరి హర వీరమల్లు. క్రిష్, జ్యోతికృష్ణ తెరకెక్కించిన వీరమల్లు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ సాధించింది. ఇక పవన్ నుంచి రానున్న నెక్ట్స్ మూవీ ఓజీ. ఈ సినిమాకి సుజిత్ డైరెక్టర్. అయితే.. ఈ సినిమా కోసం పవర్ స్టార్ మళ్లీ అలా చేయబోతున్నారని ఓ వార్త బయటకు వచ్చింది. ఇంతకీ.. పవర్ స్టార్ ఏం చేయబోతున్నారు..? అసలు ప్లాన్ ఏంటి..?
పవన్ కళ్యాణ్ ఎక్కడకి వెళ్లినా.. అభిమానులు ఓజీ ఓజీ అంటూ అరవడం తెలిసిందే. దీనిని బట్టి ఓజీ సినిమాకి ఎంత క్రేజ్ ఉందో.. అభిమానులు ఎంతలా ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారో అర్థమౌతుంది. ఈ భారీ మూవీని డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ అమాంతం అంచనాలు పెంచేసింది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ను పవర్ స్టార్ కంప్లీట్ చేశారు. ప్రస్తుతం సుజిత్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 25న ఓజీ మూవీని రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఉన్నారు మేకర్స్. Pawan Kalyan’s OG.
ఇక అసలు విషయానికి వస్తే.. వీరమల్లు సినిమాని పవర్ స్టార్ ఎంతలా ప్రమోట్ చేసారో చూశాం. ఒకే రోజు వీరమల్లు గురించి ప్రెస్ మీట్ పెట్టారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు. అలాగే విజయవాడలో జర్నలిస్టులతో ప్రత్యేకంగా వీరమల్లు గురించి మాట్లాడడం ఇంటర్ వ్యూలు ఇవ్వడం జరిగింది. అలాగే హైదరాబాద్లో కూడా ప్రత్యేకంగా ఇంటర్ వ్యూలు ఇవ్వడం జరిగింది. గతంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఇంతలా తన సినిమాలను ప్రమోట్ చేయలేదు. ఏఎం రత్నం నష్టాల్లో ఉన్నాడు.. ఆయన కోసం వీరమల్లు సినిమాని విస్తృతంగా ప్రచారం చేశారు.
ఇప్పుడు ఓజీ విషయంలో కూడా అలాగే చేయాలి అనుకుంటున్నారట. ఈ విషయం ఇండస్ట్రీ జనాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం సుజిత్ ఫైనల్ వెర్షెన్ రెడీ చేస్తున్నారట. అంతా రెడీ అయిన తర్వాత పవర్ స్టార్ కు చూపించి ఫైనల్ చేస్తారట. ఆతర్వాత నుంచి ప్రమోషన్స్ ప్లాన్ చేయాలి అనుకుంటున్నారని తెలిసింది. ఇందులో చాలా స్పెషాల్టీస్ ఉన్నాయట. అభిమానులు కోరుకుంటున్నట్టుగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుంది. వీరమల్లు సినిమాతో మిస్ అయిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఓజీ సినిమాతో వస్తుంది అంటున్నారు అభిమానులు, ఇండస్ట్రీ జనాలు. మరి.. ఓజీ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాలి.