
Vijay Devarakonda’s Kingdom: విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్. అయితే.. ఈ సినిమా కథను ముందుగా చరణ్ కు చెప్పారని.. గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. చరణ్ నో చెప్పడంతో గౌతమ్ విజయ్ దగ్గరకి వచ్చాడని.. విజయ్ కథకి ఓకే చెప్పడంతో కింగ్ డమ్ ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యింది అంటూ ప్రచారం జరుగుతూనే ఉంది. ఇప్పుడు ప్రచారంలో ఉన్న ఈ వార్త పై క్లారిటీ ఇచ్చాడు నిర్మాత నాగవంశీ. ఇంతకీ.. నాగవంశీ ఏం చెప్పాడు..? అసలు ఏం జరిగింది..?
కింగ్ డమ్ ఇది ఒక అన్నదమ్ముల కథ. అన్న గ్యాంగ్ స్టర్ అయితే.. తమ్ముడు పోలీస్.. వీరిద్దరి మధ్య జరిగే ఎమోషనల్ జర్నీ. శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ కథను అందరికీ కనెక్ట్ అయ్యేలా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించాడని.. ఖచ్చితంగా విజయం సాధించడం ఖాయమనే టాక్ ఉంది. అలాగే టీమ్ మెంబర్స్ అంతా కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇందులో విజయ్ కు బ్రదర్ గా సత్యదేవ్ నటిస్తే.. కథానాయికగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో ఆడియన్స్ లో మరింత హైప్ అయితే క్రియేట్ అయ్యింది.
ఈ సినిమా కథను చరణ్ కోసం రాసారా..? లేక విజయ్ దేవరకొండ కోసమే రాసారా..? ఇదే ప్రశ్న నాగవంశీని అడిగితే.. ఇది చరణ్ కోసం రాసిన కథ కాదని.. ఆయన కోసం రాసింది వేరే కథ అని.. ఇది విజయ్ దేవరకొండ కోసమే రాసారని చెప్పాడు. దీంతో ఈ సస్పెన్స్ కు తెర పడింది.. క్లారిటీ వచ్చేసింది. చరణ్ కోసం కథ రాయడం.. ఆ కథ పై చరణ్, గౌతమ్ ఇద్దరూ కొన్ని రోజులు పాటు చర్చలు జరపడం మాత్రం వాస్తవమే కానీ.. ఆ కథ ముందుకు వెళ్లలేదు. ప్రస్తుతం ఉన్న కింగ్ డమ్ కథకు.. చరణ్ కు ఎలాంటి సంబంధం లేదు అని అసలు విషయం బయటపెట్టాడు నాగవంశీ. Vijay Devarakonda’s Kingdom.
అయితే.. అప్పట్లో ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ పోలీస్ గా నటించాడు. గౌతమ్ చెప్పిన కథలో కూడా హీరో పోలీసే.. అందుచేత వెంట వెంటనే పోలీస్ క్యారెక్టర్ చేస్తే.. ఆడియన్స్ బోర్ ఫీలవుతారని.. బాగోదనే ఉద్దేశ్యంతోనే చరణ్ నో చెప్పాడని గుసగుసలు వినిపించాయి. ఇది నిజమో కాదో తెలియదు కానీ.. దీనికి గురించి సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరిగింది. కింగ్ డమ్ ఇటు విజయ్ దేవరకొండకు, అటు గౌతమ్ తిన్ననూరికి చాలా కీలకం. టాక్ అయితే.. పాజిటివ్ గా ఉంది. మరి.. కింగ్ డమ్ ఫుల్ రన్ లో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.