మహేష్‌ మూవీ అనౌన్స్ కాకపోవడానికి కారణం ఇదే!

Jakkanna’s plan for SSMB 29: సూపర్ స్టార్ మహేష్‌ బాబు, దర్శకధీరుడు రాజమౌళి.. వీరిద్దరి కాంబోలో మూవీ గురించి గత కొంతకాలంగా వార్తలు రావడమే కానీ.. అఫిషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రావడం లేదు. కృష్ణ గారి జయంతి సందర్భంగా అనౌన్స్ చేస్తారని ప్రచారం జరిగింది కానీ.. అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు మహేష్‌ పుట్టినరోజు సందర్భంగా ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. అది కూడా నిజం కాదనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీని అనౌన్స్ చేయకపోవడానికి గల కారణం ఏంటి..? అసలు జక్కన్న ఏం ప్లాన్ చేసాడు..?

సూపర్ స్టార్ మహేష్‌ బాబు పుట్టినరోజు ఆగష్టు 9న. ఈ సందర్భంగా ఎస్ఎస్ఎంబీ 29కు సంబంధించిన అప్ డేట్ వస్తుందని… స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తారని ప్రచారం బాగా జరుగుతుంది. అయితే.. జక్కన్న ఈసారి కూడా ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదట. కనీసం ఈ మూవీ పూజా కార్యక్రమాల వీడియో కూడా రిలీజ్ చేయడం లేదట. ఇంతకీ కారణం ఏంటంటే.. ఈ సినిమాని దుర్గా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్నప్పటికీ.. హాలీవుడ్ కంపెనీలతో టైయప్ అయ్యే ప్లానింగ్ జరుగుతుందట. ఇంకా ఏ హాలీవుడ్ కంపెనీలతో టైయప్ అయ్యేది కన్ ఫర్మ్ కాలేదని సమాచారం.

హాలీవుడ్ కంపెనీల పార్టనర్ షిప్ కన్ ఫర్మ్ అయితే.. అప్పుడు ఈ సినిమాని అఫిషియల్ గా పెద్ద ఈవెంట్ పెట్టి అనౌన్స్ చేస్తారట. అందుకనే ఇంత ఆలస్యం జరుగుతుందని తెలిసింది. హాలీవుడ్ కంపెనీల భాగస్వామ్యంతో సినిమా చేస్తే.. ఆస్కార్ అవార్డుల విషయంలో నేరుగా పోటీపడే ఛాన్స్ ఉంటుంది. ఇదంతా చూస్తుంటే జక్కన్న ఈసారి పెద్ద ప్లానే వేసాడని తెలుస్తుంది. ఇలా ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ రాదని తెలియడంతో మహేష్‌ బాబు పుట్టినరోజును అతడు రీ రిలీజ్ తో సెలబ్రేట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. Jakkanna’s plan for SSMB 29.

ఎస్ఎస్ఎంబీ 29 మూవీని 2027లో రిలీజ్ చేయాలి అనేది ప్లాన్. అందుచేత ఈ పుట్టినరోజుకు ఎలాంటి హాడావిడి చేయాలి అనుకోవడం లేదట జక్కన్న. నెక్ట్స్ ఇయర్ 2026 కి గ్లింప్స్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. అప్పటికి ఇంకా సంవత్సరం ఉంటుంది కాబట్టి అలా చేయడం కరెక్ట్. అయితే.. ఇప్పుడు ఏదైనా అప్ డేట్ ఇస్తే బాగుటుందనే మాట వినిపిస్తుంది కానీ.. జక్కన్న కంప్లీట్ గా వేరేలా ఆలోచిస్తున్నారు. ఆఫ్రికా షెడ్యూల్, రామోజీ ఫిలిం సిటీలో వేసిన కాశి సెట్ ఎపిసోడ్ రాబోయే రోజుల్లో అతి కీలకమైన ఘట్టాలు. వీటికో ఏడెనిమిది నెలలు పట్టొచ్చు. ఇటీవలే కీరవాణి మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టారని తెలిసింది. ఏది ఏమైనా ఎస్ఎస్ ఎంబీ 29 అప్ డేట్ కోసం వెయిటింగ్ తప్పదు.

Also Read: https://www.mega9tv.com/cinema/does-vijay-devarakondas-kingdom-story-has-written-for-charan-however-naga-vamsi-confirms-its-not-for-charan/