
Pawan and Suri combo: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్.. ఈ మూడు సినిమాలు ఎప్పుడో ఒప్పుకున్నారు. పాలిటిక్స్ లో బిజీగా ఉండడంతో ఈ సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేయడం ఆలస్యం అయ్యింది. అందుకనే ఇప్పుడు ఈ మూడు సినిమాల షూటింగ్స్ ను కంప్లీట్ చేశాడు. వీరమల్లు థియేటర్లోకి వచ్చేసింది.. ఇప్పుడు ఓజీ వచ్చేందుకు రెడీ అవుతోంది. తాజాగా ఓజీ నుంచి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. పవన్ కొత్త సినిమా గురించి కూడా ఓ వార్త బయటకు వచ్చింది. ఇంతకీ.. ఓజీ అప్ డేట్ ఏంటి..? పవన్ కొత్త సినిమా న్యూస్ ఏంటి..?
పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్న మూవీ ఓజీ. సుజిత్ తెరకెక్కిస్తోన్న ఓజీ మూవీని డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కి ఇంకా టైమ్ ఉంది. అయితే.. ఇప్పటి నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసారు. ఆగష్టు 2న ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసినప్పటి నుంచి అంచనాలు మరింతగా పెరిగాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఇప్పుడు మరింతగా ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెరిగింది.
ఇక అసలు విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేసిన సినిమాల్లో ఒకటి సురేందర్ రెడ్డితో సినిమా. ఈ మూవీని పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. ఆతర్వాత ఎలాంటి అప్ డేట్ లేకుండా ఆగిపోయింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ కూడా లైన్ లోకి వస్తోందట. అయితే.. సురేందర్ రెడ్డి ముందు చెప్పిన కథకు ఎక్కువ డేట్స్, భారీ బడ్జెట్ అవసరం ఉండటంతో దాన్ని పక్కన పెట్టేసి ఒక తమిళ రీమేక్ ని పవన్ సూచించినట్టుగా తెలిసింది. రాజకీయంగా తానున్న బిజీలో ఎక్కువ స్ట్రెయిట్ ఫిలింస్ చేయలేనని, వేగంగా పూర్తయ్యే ఛాన్స్ ఉన్న రీమేకుల మీద దృష్టి పెట్టడం తప్పా వేరే ఆప్షన్ లేదని సూరికి చెప్పినట్టుగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. Pawan and Suri combo.
అయితే.. ఏజెంట్ సినిమాతో దారుణమైన డిజాస్టర్ చూసిన తర్వాత ఇంత వరకు కొత్త సినిమా సెట్ కాలేదు. ఇలాంటి టైమ్ లో పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా రీమేక్ మూవీ చేయడం తప్పా వేరే ఆప్షన్ లేదు. అందుచేత పవన్ తో సినిమా చేయడానికి ప్లానింగ్ జరుగుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి రామ్ తాళ్లూరి నిర్మాత. ఆయన ఓ ఐదారేళ్లుగా వెయిటింగ్ లో ఉన్నాడు. ఇప్పుడు ఎన్నికల వచ్చే లోపు ఒకటి రెండు సినిమాలు చేయాలి అనుకుంటున్నాడట. ఆ రెండు సినిమాల్లో సురేందర్ రెడ్డితో ఉంటుందని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు. మరి.. ఏం జరగనుందో చూడాలి.