
Kingdom failed to meet expectations: విజయ్ దేవరకొండ నటించిన కొత్త సినిమా కింగ్ డమ్. ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్. ఈ సినిమాని రెండు పార్టులుగా తీయనున్నట్టుగా గతంలో నాగవంశీ అనౌన్స్ చేశారు. ఆతర్వాత ఫస్ట్ పార్ట్ ను కంప్లీట్ గా ఎండ్ చేస్తామని.. సెకండ్ పార్ట్ ను ప్రీక్వెల్ అయినా తీయచ్చు.. సీక్వెల్ అయినా తీయచ్చు.. ఎన్ని పార్టులు అయినా తీయచ్చు అనేట్టుగా చెప్పారు. ఇప్పుడు కింగ్ డమ్ రిలీజైంది. ఈ మూవీకి నెగిటివ్ టాక్ ఉంది. మరి.. కింగ్ డమ్ పార్ట్ 2 ఉంటుందా..? ఉండదా..? నాగవంశీ ఏం చెప్పారు..?
లైగర్, ఖుషీ, ఫ్యామిలీ స్టార్.. ఇలా మూడు సినిమాలతో వరుసగా నిరాశపరచడంతో ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి లాంటి ఇన్ టెన్స్ ఉన్న స్టోరీతో సినిమా చేస్తున్నామని.. ఖచ్చితంగా విజయ్ కి ఈ సినిమా విజయాన్ని అందిస్తుందని చెప్పారు మేకర్స్. అయితే.. ఈ మూవీ అంచనాలను ఏమాత్రం అందులోకపోయింది. కథలో కొత్తదనం లేకపోవడం పెద్ద మైనస్. ఏదో చెప్పాలని.. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ట్రై చేశాడు కానీ.. వర్కవుట్ కాలేదు. పైగా సినిమా అంతా సీరియస్ గానే వెళుతుంది.. ఎక్కడా వావ్ అనిపించే మెరుపులు లేకపోవడం మరో పెద్ద మైనస్.
ఇప్పుడు రెండు మూడు పార్టులుగా తీస్తామని అనౌన్స్ చేయడం.. ఆతర్వాత ఫస్ట్ పార్ట్ ప్లాప్ అయితే.. సెకండ్ పార్ట్ తీయకుండా ఆపేయడం.. ఇది కామన్ గా జరుగుతుంది. అందుకే.. కింగ్ డమ్ మూవీకి నెగిటివ్ టాక్ రావడంతో అసలు పార్ట్ 2 ఉంటుందా..? ఉండదా..? అనే డౌట్ అందరిలో వచ్చింది. ఇదే విషయం గురించి నిర్మాత నాగవంశీని అడిగితే.. త్వరలోనే సీక్వెల్ ఉంటుందని, విజయ్ దేవరకొండ కమిట్ మెంట్స్ పూర్తయ్యాక ప్లాన్ చేస్తామని అన్నారు. క్లైమాక్స్ లో చూపించిన సేతు పాత్రని ఒక స్టార్ హీరో చేస్తారని, అది చూశాక సర్ ఫ్రైజ్ అవుతారని నాగవంశీ చెప్పారు. Kingdom failed to meet expectations.
ఎక్కువ ప్రాధాన్యం దక్కని హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకు పార్ట్ 2లో ఇంపార్టెన్స్ ఉంటుందని వివరణ ఇచ్చారు. మొత్తానికి ఫ్యాన్స్ కి కొనసాగింపు గురించి క్లారిటీ అయితే వచ్చింది. ఇక కలెక్షన్స్ గురించి నాగవంశీ మాట్లాడుతూ.. తెలంగాణలో ఎక్కువగా ఆదరణ ఉండే విజయ్ దేవరకొండ ఈసారి సీడెడ్ లో అదరగొట్టాడని, ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం 50 శాతం రికవరీ మొదటి రోజే అయిపోతుందని, ఓవర్సీస్ లోనూ ఇదే మేజిక్ జరుగుతోందని చెప్పుకొచ్చారు. గురువారం రిలీజ్ గురించి టెన్షన్ పడ్డానని చెప్పిన విజయ్ ప్రొడ్యూసర్ భరోసా నిజమైనందుకు మాటలు రావడం లేదన్నాడు. అయితే.. ఈ మూవీ కలెక్షన్స్ పై క్లారిటీ రావాలంటే మండే వరకు వెయిట్ చేయాలి.