చిరు బర్త్ డేకి డబుల్ ట్రీట్ రెడీ చేసిన అనిల్ రావిపూడి!

Anil Ravipudi treat for Chiru’s birthday: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అభిమానులకు పండగ రోజు. ఎప్పుడెప్పుడు ఆగష్టు 22 వస్తుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తుంటారు. అలాగే తన పుట్టినరోజున అభిమానులకు తన సినిమాల అప్ డేట్ ఇస్తుంటారు మెగాస్టార్. ఈ బర్త్ డేకి కూడా మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇవ్వనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చిరు బర్త్ డేకి డబుల్ ట్రీట్ ప్లాన్ చేశాడని తెలిసింది. ఇంతకీ.. అనిల్ రావిపూడి ఏం చేయబోతున్నాడు..? మెగా ఫ్యాన్స్ కి ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నాడు..?

పటాస్ సినిమా నుంచి సంక్రాంతికి వస్తున్నాం వరకు ప్లాప్ అనేది లేకుండా వరుసగా సక్సెస్ ఫుల్ మూవీస్ అందిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేశాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తుండడంతో ఈ సినిమా కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమనే టాక్ బలంగా ఉంది. ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగానే.. అనిల్ రావిపూడి డిఫరెంట్ గా ప్రమోషన్ స్టార్ట్ చేయడం విశేషం. ఇటీవల చిరంజీవి, నయనతార పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఈ మూవీ షూటింగ్ చక చకా కానిచ్చేస్తున్నారు.

ఇక డబుల్ ట్రీట్ విషయానికి వస్తే.. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 22న టైటల్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారట. అలాగే ఈ పోస్టర్ తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారని తెలిసింది. దీనికి సంబంధించిన ప్రకటన కూడా త్వరలోనే చేయనున్నారని సమాచారం. చిరంజీవి కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో తెలిసిందే. ఈ సినిమాలో చిరు చేసే కామెడీ వేరే లెవల్లో ఉంటుందట. ఆడియన్స్ కడుపుబ్బా నవ్వుకునేలా అనిల్ రావిపూడి డిజైన్ చేశాడని.. సంక్రాంతికి సినీ అభిమానులు అందరికీ నిజమైన పండగలా ఈ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. Anil Ravipudi treat for Chiru’s birthday.

ఈ క్రేజీ మూవీకి భీమ్స్ అదిరిపోయే సాంగ్స్ రెడీ చేశాడట. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఎలా అయితే సాంగ్స్ బ్లాక్ బస్టర్ అయ్యాయో.. అందరికీ కనెక్ట్ అయ్యాయే.. అలా ఈ సినిమాలో పాటలు కూడా ఉంటాయట. ఈ మూవీకి సంక్రాంతికి రఫ్ఫాడించేస్తాం అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఆతర్వాత మన శంకర్ వరప్రసాద్ గారు అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టుగా టాక్ వచ్చింది. చిరంజీవి అసలు పేరు శివ శంకర్ వరప్రసాద్.. అందుకనే ఈ టైటిల్ పెడితే అందరికీ బాగా రీచ్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే ఈ టైటిల్ ను ఖరారు చేయనున్నారని తెలిసింది. మరి.. ఈ టైటిలే పెడతారా..? వేరే టైటిల్ పెడతారా..? అనేది చిరు బర్త్ డేకు తెలుస్తుంది.

Also Read: https://www.mega9tv.com/cinema/vashisht-is-directing-the-movie-vishwambhara-vashisht-is-doing-promotions-without-announcing-the-release-date-will-vashisht-plan-right-or-wrong/