
Rajasaab Postponed Again: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తోన్న మూవీ ది రాజాసాబ్. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఇదొక హర్రర్ కామెడీ మూవీ. ఫస్ట్ టైమ్ ప్రభాస్ ఈ జోనర్ లో సినిమా చేస్తుండడంతో అందరిలో ఈ సినిమా పై ఆసక్తి ఏర్పడింది. అయితే.. ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. కొన్ని కారణాల వలన పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఇటీవల డిసెంబర్ 5న రాజాసాబ్ రావడం ఖాయమని ప్రకటించారు. ఇప్పుడు మరోసారి రాజాసాబ్ పోస్ట్ పోన్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. అసలు కారణం ఏంటి..? న్యూ రిలీజ్ డేట్ ఏంటి..?
ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత నుంచి సీరియస్ ఫిల్మ్స్ చేసాడు కానీ.. ఎంటర్ టైనర్ చేయలేదు. డార్లింగ్ ఫ్యాన్స్ ప్రభాస్ ను గతంలో చూసినట్టుగా చూడాలి అనుకుంటున్నారు. అది గుర్తించిన డైరెక్టర్ మారుతి ఈ సినిమాలో అలాగే ప్రజెంట్ చేస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన గ్లింప్స్ అయితే.. నెక్ట్స్ లెవల్ లో ఉంది. గ్లింప్స్ లోనే ప్రభాస్ ఇలా ఎంటర్ టైన్ చేస్తే… ఈ సినిమాలో ఎంతలా నవ్విస్తాడో అని ప్రభాస్ అభిమానులే కాదు కామన్ ఆడియన్స్ సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో నిర్మిస్తుంది.
అసలు ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలి అనుకున్నారు. అనుకోవడమే కాదు.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే.. అనుకున్న విధంగా షూటింగ్ జరగలేదు. దీంతో రాజాసాబ్ పోస్ట్ పోన్ చేయక తప్పలేదు. సమ్మర్ లో కుదరకపోతే.. దసరాకి అయినా విడుదల చేయాలని ప్లాన్ చేశారు కానీ.. అది కూడా సెట్ కాలేదు. ఆతర్వాత డిసెంబర్ 5న రాజాసాబ్ ని థియేటర్స్ లోకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు. అఫిషియల్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే.. ఇప్పుడు అనుకున్న టైమ్ కి వీఎఫ్ఎక్స్ వర్క్ కంప్లీట్ కావడం లేదు. అందుకనే మరోసారి వాయిదా వేయక తప్పడం లేదని తెలిసింది. Rajasaab Postponed Again.
ఇంతకీ.. రాజాసాబ్ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే.. సంక్రాంతి బరిలోకి దిగనుందని.. జనవరి 9న రాజాసాబ్ ని రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం రిలీజ్ డేట్ విషయమై మేకర్స్ ఆలోచనలో పడ్డారట. జనవరి 9న రిలీజ్ డేట్ లాక్ చేసిన తర్వాత అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలిసింది. ఈ మూవీకి సంబంధించి పెండింగ్ ఉన్న షూట్ ను త్వరలోనే కంప్లీట్ చేయనున్నారు. ఇందులో ప్రభాస్ కు తాతగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటించనున్నారు. వీరిద్దరి పై వచ్చే సీన్స్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయని వార్తలు వస్తున్నాయి. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా సంక్రాంతి బరిలోకి ప్రభాస్ వస్తే.. పోటీ మరింత రసవత్తరంగా మారడం ఖాయం.
Also Read: https://www.mega9tv.com/cinema/anil-ravipudi-has-prepared-a-double-treat-for-chirus-birthday/