కూలీతో పాటు వస్తోన్న ఓజీ..?

Rajinikanth’s Coolie & OG Glimpse: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, శాండిల్ వుడ్ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్.. ఈ క్రేజీ కాంబోలో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ కూలీ. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని సినీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆగష్టు 14న కూలీ భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే.. కూలీతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఓజీ కూడా రాబోతోందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఇది నిజమేనా..? అసలు ఓజీ ప్లాన్ ఏంటి..?

కూలీ సినిమా నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్ అదిరింది. ఇప్పటి వరకు ఉన్న అంచనాలను రెట్టింపు చేసిందని చెప్పచ్చు. ఇందులో రజినీ డైలాగ్స్, నాగ్ స్టైల్ అండ్ యాక్షన్, ఉపేంద్ర, అమీర్ ఖాన్.. ఇలా ఒకటేమిటి ఆద్యంతం అద్భుతం అనేలా ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ట్రైలర్ తో అందర్నీ డామినేట్ చేసింది కింగ్ నాగార్జున అని చెప్పచ్చు. ఆ స్టైల్ అండ్ డైలాగ్స్ అయితే.. మాస్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి. సంగీత సంచలనం అనిరుథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే.. వేరే లెవల్లో ఉంది. ట్రైలర్ లోనే ఇలా ఉంటే.. ఇక థియేటర్స్ లో సాంగ్స్, రీ రికార్డింగ్ ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు. మొత్తానికి కూలీ ట్రైలర్ అంచనాలను ఆకాశంలో కూర్చోబెట్టింది.

ఇక ఓజీ విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఆమధ్య గ్లింప్స్ రిలీజ్ చేసిన తర్వాత అప్పటి వరకు ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళితే అక్కడ అభిమానులు ఓజీ ఓజీ అంటూ అరుస్తున్నారంటే ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సెప్టెంబర్ 25న ఓజీ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. Rajinikanth’s Coolie & OG Glimpse.

అయితే.. ఈ మూవీ గ్లింప్స్ ను కూలీ సినిమాతో పాటు రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. కూలీ మూవీకి ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. అందుకనే.. కూలీ రిలీజైన థియేటర్స్ లో ఓజీ సినిమా గ్లింప్స్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది. ఓజీ రిలీజ్ డేట్ కు ఇంకా టైమ్ ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే పక్కా ప్లానింగ్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఓజీ నుంచి సాంగ్ రిలీజ్ చేశారు. అలాగే కూలీతో గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారు. అలాగే పవర్ స్టార్ కూడా వీరమల్లుకు చేసినట్టుగానే ప్రమోషన్స చేయడానికి ఓకే చెప్పారని తెలిసింది. ఓజీ దూకుడు చూస్తుంటే.. ఈసారి గట్టిగానే బ్లాక్ బస్టర్ కొట్టాలే కనిపిస్తుంది. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/does-rajasaab-going-to-postpone-again-makers-are-planning-to-release-the-movie-on-sankranti/