
Power Star Movie Under People Media Factory: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వీరమల్లు రిలీజైంది. ఓజీ థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ రెడీ అవుతోంది. అయితే.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరో సినిమాకి ఓకే చెప్పారని.. నిర్మాత ఫిక్స్ అని.. త్వరలో అనౌన్స్ మెంట్ ఉంటుంది అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఇంతకీ.. పవన్ తో సినిమా చేసే నిర్మాత ఎవరు..? డైరెక్టర్ ఎవరు..? ఈ ప్రాజెక్ట్ వెనుక ఏం జరిగింది..? తెలుసుకోవాలి అనుకుంటున్నారా..?
పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ టైమ్ లో పంచాయితీలు చేయాల్సి వచ్చింది. ఎన్నో పంచాయితీలు చేస్తే కానీ.. ఈ మూవీ బయటకు రాలేదు. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ తెలియచేశారు. అలాగే ఈ మూవీ రిలీజ్ చేయడానికి తెర వెనుక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు, అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఎంతగానో హెల్ప్ చేశారని.. వాళ్లు ముందుకు రావడం వలనే వీరమల్లు అనుకున్న టైమ్ కి రిలీజ్ అయ్యిందని తెలిసింది.
దీంతో టీజీ విశ్వప్రసాద్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పారట. గతంలో ఈ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ బ్రో అనే సినిమా చేశారు. ఈ సినిమా చేయడానికి కారణం.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి విశ్వప్రసాద్ ఎంతగానో సహాయ, సహకారాలు అందించారు. అలాగే పవన్ కళ్యాణ్ అమెరికా వెళితే అక్కడ వ్యవహారాలు అన్నీ చూసుకుంది విశ్వప్రసాదే. ఇంకా చెప్పాలంటే.. జనసేన పార్టీకి ఆర్థికంగా సపోర్ట్ గా నిలిచింది విశ్వప్రసాదే. ఈ కారణంగానే ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందట. Power Star Movie Under People Media Factory.
అయితే.. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కంప్లీట్ అయ్యాక.. ఏపీ రాజకీయాలపై మళ్లీ పవన్ దృష్టి పెట్టనున్నారు. ఆ తర్వాత విశ్వప్రసాద్ నిర్మాణంలో ఓ సినిమా చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకు గాను సరైన దర్శకుడి కోసం ఆయన వెతుకుతున్నారని సమాచారం. వచ్చే సంవత్సరంలో ఆ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన అప్ డేట్స్ రానున్నాయని టాక్ వినిపిస్తోంది. మరి.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను ఏ డైరెక్టర్ చేతిలో పెడతారో…? ఏ తరహా కథతో సినిమా చేస్తారో.. తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.