సీఎం రేవంత్ రెడ్డి కమ్యూనిస్ట్ నేతలను..?

Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కమ్యూనిస్ట్ నేతలను తెగపొగిడేస్తున్నారు. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నా కమ్యూనిస్ట్ పార్టీల మద్దతు తప్పనిసరిగా ఉండాలన్న ఆయన డైలాగ్, ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. అయితే లెఫ్ట్ పార్టీల నేతల మాత్రం,డైలాగులు చాలా విన్నామనీ, సీట్ల పంపకాలు, నామినేటెడ్ పదవుల భర్తీలో కూడా అంతే ప్రేమ చూపించాలని చెబుతున్నారట.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎర్రసైన్యాన్ని పొగిడేస్తున్నారు. గతంల ఆపరేషన్ కగార్ సమయంలో కూడా మావోయిస్టులతో చర్చలు జరపాలంటూ కామెంట్ చేశారు రేవంత్. అయితే దీని మీద రకరకాల కామెంట్లు వచ్చాయి. స్వాగతించిన వాళ్లూ ఉన్నారు, వ్యతిరేకించిన వాళ్లూ ఉన్నారు. తాజాగా ఇప్పుడు కామ్రేడ్లను పొగిడేశారు రేవంత్ రెడ్డి. లెఫ్ట్ పార్టీలు ఉప్పలాంటివనీ, వాటి ఉనికి లేకపోతే రాజకీయాలు పండవన్న చందంగా డైలాగ్ పేల్చారు. అలాగే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచినా, లెఫ్ట్ పార్టీల సహకారం తప్పనిసరిగా ఉండాలన్నారు. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.

రేవంత్ తాజా కామెంట్ వెనుక బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో తెలంగాణాలో స్థానికి సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలో లెఫ్ట్ పార్టీలకు బలమైన కేడర్ ఉంది. అలాగే ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో బలంగా వారి ఓట్ బ్యాక్ ఉంది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో బీఆర్ఎస్ కూడా బలంగానే ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో కారు పార్టీని ఎదుర్కోవడం కాంగ్రెస్ పార్టీకి అంత సులువు కాదు. ఇక కొద్దోగొప్పో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను అధికమించి బీఆర్ఎస్ దూకుడుకు కళ్లెం వేయాలంటే కచ్చితంగా ఈ రెండు జిల్లాల్లో కమ్యూనిస్ట్ పార్టీల మద్దతు ఉండాల్సిందే. Telangana CM Revanth Reddy.

ఇక ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో అయితే కాంగ్రెస్ పరిస్తితి ఇబ్బందికరంగా ఉంది. ఈ రెండు జిల్లాల్లో బీఆర్ఎస్, బీజేపీలకు బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. ఈ రెండు పార్టీలను ఢీకొట్టడం అంత తేలికైన విషయం కాదు. కమ్యూనిస్ట్ పార్టీలు ఈ రెండు జిల్లాల్లో బలంగా లేకపోయినా, కొద్దోగొప్పో ఉన్న వారి ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి కల్సివస్తుంది. ఈ మొత్తం అంచనా వేసిన తర్వాతే రేవంత్ రెడ్డి కమ్యూనిస్టుల మీద ప్రేమ చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే లెఫ్ట్ నేతలను బుట్టలో వేసుకోవడం అంత సులువు కాదంటున్నా రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే, రాజకీయంగా కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు బలమైన చరిత్ర ఉంది. రెండు పార్టీలూ ఒడిదుడుకులు ఎదుర్కున్నవే. ఒకరినిమించి ఒకరు రాజకీయం చేయగలరు. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందు కమ్యూనిస్ట్ పార్టీలు రెండు ప్రతిపాదలను పెడుతున్నాయట. అందులో ఒకటి, నామినేటెడ్ పదవుల్లో సమవాటా అయితే, రెండోది స్థానికి సంస్థల ఎన్నికల్లో సమానంగా సీట్ల పంపిణీ. నామినేటెడ్ పవదుల్లో సమ వాటా అనేది స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఫిక్స్ చేయాలని లెఫ్ట్ పార్టీలు సీఎం రేవంత్ మీద ఒత్తిడి తెస్తున్నారట. ఇది తేల్చిన తర్వాతే సీట్ల గురించి ఆలోచిస్తామని క్లారిటీ ఇస్తున్నారట.

Also Read: https://www.mega9tv.com/telangana/telangana-congress-tpcc-will-nominated-posts-be-filled-will-42-percent-of-posts-be-given-to-bcs/