
Charan and Gowtham Tinnanuri’s project: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ రేంజ్ లో గుర్తింపు సాధించిన విషయం తెలిసిందే. అయితే.. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్.. గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయబోతున్నాడనే వార్త బయటకు వచ్చింది. ఆతర్వాత ఏమైందో ఏమో కానీ.. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. చరణ్ గేమ్ ఛేంజర్ చేశారు. గౌతమ్ తిన్ననూరి కింగ్ డమ్ చేశారు. అయితే.. వీరిద్దరి కాంబోలో మూవీ ఎందుకు క్యాన్సిల్ అయ్యింది అనేది మాత్రం బయటకు రాలేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వెనుక ఏం జరిగింది అనేది స్వయంగా గౌతమ్ తిన్ననూరి బయటపెట్టారు. ఇంతకీ.. ఏం జరిగింది..?
విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్ననూరి కింగ్ డమ్ అనే సినిమాను తెరకెక్కించడం.. ఇటీవల ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం తెలిసిందే. అయితే.. ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో టాక్ రాలేదు. అయినప్పటికీ.. ఓపెనింగ్ మాత్రం బాగానే వచ్చింది. ఆగష్టు 14 వరకు ధియేటర్ దగ్గర సరైన సినిమా లేకపోవడంతో మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్స్ లో మరింత స్పీడు పెంచారు. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి, నాగవంశీ.. మీడియాకు ఇంటర్ వ్యూలు ఇస్తూ మరింతగా కలెక్షన్స్ సాధించేందుకు తమ వంతు ప్రయత్నం అయితే చేస్తున్నారు. Charan and Gowtham Tinnanuri’s project
అయితే.. ఇలా మీడియా ముందుకు వచ్చిన గౌతమ్ తిన్ననూరికి చరణ్ తో సినిమా గురించి ప్రశ్న ఎదురైంది. ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఏంటి అని అడిగితే.. చరణ్ కోసం ఓ స్టోరీ లైన్ చెబితే.. బాగుంది ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసిన తర్వాత ఆ కథ తనకే నచ్చలేదని.. చరణ్ తో సినిమా చేస్తే.. అది ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవ్వాలనే ఉద్దేశ్యంతో తనే మంచి కథ కుదిరినప్పుడు చేద్దామని చరణ్ కి చెప్పాడట. ఈ విషయాన్ని గౌతమ్ తిన్ననూరి బయటపెట్టాడు. చరణ్ కోసం రాసింది కింగ్ డమ్ స్టోరీ కాదని.. అది వేరే కథ అని క్లారిటీ ఇచ్చాడు.
చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పెద్ది అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి బుచ్చిబాబు డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో.. వృద్ది సినిమాస్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాని మార్చి 27న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. ఇందులో చరణ్ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. సంగీత సంచలనం ఏఆర్ రెహ్మాన్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వడం ఆలస్యం అయ్యింది కానీ.. స్టార్ట్ అయిన తర్వాత నుంచి జెడ్ స్పీడుతో వర్క్ జరుగుతోంది. ఈ మూవీ తర్వాత సుకుమర్ తో మూవీ, బాలీవుడ్ డైరెక్టర్ తో మూవీ, త్రివిక్రమ్ తో మూవీ చేయడానికి ప్లానింగ్ జరుగుతుందని సమాచారం. ఈ లెక్కన గౌతమ్ తో చరణ్ సినిమా ఇప్పట్లో ఉండకపోవచ్చు.
Also Read: https://www.mega9tv.com/cinema/vishwambhara-mega-157-anil-ravipudu-movie-release-date-changed/