
Pooja Hegde Special Song in Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న భారీ పాన్ ఇండియా మూవీ పెద్ది. ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే స్పోర్ట్స్ డ్రామా. ఇప్పటి వరకు చరణ్ చేయని పాత్రలో సరికొత్తగా చూపిస్తున్నాడట బుచ్చిబాబు. ఈ మూవీ కోసం బుచ్చిబాబు సుకుమార్ ను ఫాలో అవుతున్నాడు అంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు బుచ్చిబాబు ప్లాన్ చూస్తుంటే ప్రచారంలో ఉన్నది నిజమే అనిపిస్తుంది. ఇంతకీ.. పెద్ది కోసం బుచ్చిబాబు గురువు సుకుమార్ వలే.. ఏం చేయబోతున్నాడు..?
ఈ క్రేజీ మూవీ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. అక్కడ చరణ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. గేమ్ ఛేంజర్ మూవీతో బ్లాక్ బస్టర్ మిస్ అయ్యింది కానీ.. ఈసారి మాత్రం పక్కాగా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని.. థియేటర్స్ లో పూనకాలు రావడం ఖాయమని మెగా ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఎమోషనల్ సీన్స్ అయితే.. ప్రతి ఒక్కర్నీ కంటతడి పెట్టిస్తాయట. ముఖ్యంగా చరణ్ పర్ ఫ్మారెన్స్ వేరే లెవల్లో ఉంటుందని.. రంగస్థలం సినిమాలో చిట్టిబాబు పాత్రలో ఎలాగైతే అద్భుతంగా నటించాడో.. ఈ సినిమాలో కూడా అలాగే అద్భుతం అనేలా పర్ ఫార్మెన్స్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. Pooja Hegde Special Song in Peddi.
ఈ మూవీలో ఓ ఫోక్ సాంగ్ ఉందట. అది శ్రీకాకుళం యాసలో ఉంటుందట. ఈ సాంగ్ ను ఫోక్ సింగర్ పెంచల దాస్ పాడినట్టుగా తెలుస్తోంది. ఈ సాంగ్ అయితే.. అందరికీ మాంచి కిక్ ఇచ్చేలా ప్లాన్ చేశాడట బుచ్చిబాబు. రంస్థలం సినిమాలో జిల్ జిల్ జిగేల్ రాణి అంటూ సాగే పాట ఎలా అయితే ఆకట్టుకుందో ఈ పాట కూడా అదే స్థాయిలో అలరించేలా ఉంటుందట. ఈ పాట కోసం జిగేల్ రాణి.. పూజా హేగ్డేను రంగంలోకి దింపుతున్నారని వార్తలు వస్తున్నాయి. రంగస్థలం సినిమాలో జిగేల్ రాణి పాట బాగా ఆకట్టుకుంది.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్య్యింది. ఇప్పుడు పూజానే తీసుకుంటే సెంటిమెంట్ గా వర్కవుట్ అవుతుంది అంటున్నారు ఫ్యాన్స్.
ఈ మూవీ అప్ డేట్ విషయానికి వస్తే.. యాభై శాతం షూటింగ్ పూర్తయ్యింది. షూటింగ్ స్టార్ట్ చేసిన్పటి నంచి ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా చాలా ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ ఈ మూవీని నిర్మిస్తుంది. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. చరణ్ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తున్న ఈ మూవీని మార్చి 27న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. మరి.. గేమ్ ఛేంజర్ తో మిస్సైన బ్లాక్ బస్టర్ పెద్ది సినిమాతో సాధిస్తారేమో చూడాలి.
Also Read: https://www.mega9tv.com/cinema/mass-jathara-ole-ole-song-has-been-released/